Thabitha Sukumar Birthday: సుకుమార్ భార్య తబిత బర్త్ డే సెలబ్రేషన్స్... ఫారిన్లో చీర కట్టారు, ఎక్కడున్నారో తెలుసా?
![Thabitha Sukumar Birthday: సుకుమార్ భార్య తబిత బర్త్ డే సెలబ్రేషన్స్... ఫారిన్లో చీర కట్టారు, ఎక్కడున్నారో తెలుసా? Thabitha Sukumar Birthday: సుకుమార్ భార్య తబిత బర్త్ డే సెలబ్రేషన్స్... ఫారిన్లో చీర కట్టారు, ఎక్కడున్నారో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/21/094a04e5344ae6801db2354a56cf5b17c6a48.jpg?impolicy=abp_cdn&imwidth=800)
దర్శకుడు సుకుమార్ భార్యగా తబిత బండ్రెడ్డి కొంత మందికి తెలుసు. సోషల్ మీడియాలో ఆవిడ యాక్టివ్ గా ఉంటారు. ఆ కారణంతో ఇంకొంత మందికి తెలుసు. ఇప్పుడు ఆవిడ ప్రస్తావన ఎందుకంటే... నేడు తబితా సుకుమార్ 40వ పుట్టినరోజు. (Image Courtesy: thabitha_sukumar / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App![Thabitha Sukumar Birthday: సుకుమార్ భార్య తబిత బర్త్ డే సెలబ్రేషన్స్... ఫారిన్లో చీర కట్టారు, ఎక్కడున్నారో తెలుసా? Thabitha Sukumar Birthday: సుకుమార్ భార్య తబిత బర్త్ డే సెలబ్రేషన్స్... ఫారిన్లో చీర కట్టారు, ఎక్కడున్నారో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/21/a4ecb2c1ed0c16381b480aeb5ab6723d74fa8.jpg?impolicy=abp_cdn&imwidth=800)
బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం తబితా సుకుమార్ గ్రీస్ వెళ్లారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అతి కొద్ది మందితో పాటు పిల్లలు కూడా ఆవిడతో ఉన్నారని తెలిసింది. పుట్టినరోజు సందర్భంగా చీర కట్టి గ్రీస్ లో ఇలా సందడి చేశారు తబితా సుకుమార్. (Image Courtesy: thabitha_sukumar / Instagram)
![Thabitha Sukumar Birthday: సుకుమార్ భార్య తబిత బర్త్ డే సెలబ్రేషన్స్... ఫారిన్లో చీర కట్టారు, ఎక్కడున్నారో తెలుసా? Thabitha Sukumar Birthday: సుకుమార్ భార్య తబిత బర్త్ డే సెలబ్రేషన్స్... ఫారిన్లో చీర కట్టారు, ఎక్కడున్నారో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/21/a7ec42cb94ee951c3d89b7b7640c21f9be6ad.jpg?impolicy=abp_cdn&imwidth=800)
సుకుమార్ భార్యగా మాత్రమే కాకుండా ఇటీవల ఓ సినిమా సమర్పకురాలిగా కూడా ఆవిడ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రావు రమేష్ కథానాయకుడిగా నటించిన 'మారుతి నగర్ సుబ్రమణ్యం' చిత్రాన్ని తన సమర్పణలో తబిత విడుదల చేశారు. (Image Courtesy: thabitha_sukumar / Instagram)
కామన్ ఫ్రెండ్స్ ద్వారా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమా గురించి తెలుసుకొని, స్పెషల్ షో వేసుకుని చూశారు తబితా సుకుమార్. ఆ సినిమా విపరీతంగా నచ్చడంతో దగ్గరుండి ప్రచార కార్యక్రమాలు జోరుగా చేసి ప్రేక్షకులకు సినిమా గురించి తెలిసేలా చేశారు. ప్రీ రిలీజ్ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా రావడానికి కారణం కూడా ఆవిడ. (Image Courtesy: thabitha_sukumar / Instagram)
సుకుమార్ తబిత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇద్దరిలో అమ్మాయి పెద్దది. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రచార కార్యక్రమాలలో తన కుమార్తె తనకు సపోర్ట్ అని చెప్పారు తబిత. అబ్బాయి చిన్నవాడు.(Image Courtesy: thabitha_sukumar / Instagram)