Saripodhaa Sanivaaram OTT Release Date: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన రీసెంట్ మూవీ `సరిపోదా శనివారం`. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను యాక్షన్ ఎంటర టైనర్ గా రూపొందించారు. తమిళ నటుడు ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించారు. ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి షో నుంచే మౌత్ టాక్ తో మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికీ ఈ సినిమా చక్కటి వసూళ్లను సాధిస్తున్నది. నాని కెరీర్ లో రూ. 100 కోట్లు సాధించిన సినిమాల లిస్టులో ఈ మూవీ కూడా చేరింది. ఇప్పటికే ‘ఈగ’, ‘దరస’ సినిమాలు రూ. 100 కోట్లు సాధించిగా, ఇప్పుడు `సరిపోదా శనివారం` ఆ ఘనత సాధించింది.


నెట్ ఫ్లిక్స్ వేదికగా `సరిపోదా శనివారం` స్ట్రీమింగ్


ఇక థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న `సరిపోదా శనివారం` మూవీ త్వరలో ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది.  ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీపడినా, ఫ్యాన్సీ అమౌంట్ చెల్లించి నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ నెల(సెప్టెంబర్) 26 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.






నాని, సూర్య నటనకు ప్రేక్షకులు ఫిదా


గతంలో నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ‘అంటే సుందరానికి’ అనే సినిమా వచ్చింది. అయితే, ఈ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ, ఆయన వర్క్ తీరు నచ్చడంతో నాని మరో అవకాశం కల్పించారు. రెండో సినిమాతో సత్తా చాటారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా తర్వాత ఆమె మరోసారి నానితో జతకట్టింది.



`సరిపోదా శనివారం` సినిమాలో నాని, ఎస్ జే సూర్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నాని యాక్షన్ అవతార్ లో దుమ్మురేపారు. సూర్య తన పాత్రలో ఒదిగిపోయిన నటించారు. ఓవైపు ఉద్యోగిగా నేచురల్ గా ఉంటూనే మరోవైపు కోపంతో రగిలిపోయే యువకుడిగా నాని అద్భుతంగా ఆకట్టుకున్నారు. సూర్య ఇన్ స్పెక్టర్ దయానంద్ పాత్రలో అదరగొట్టేశారు. తనతోనే విలనిజాన్ని అద్భుతంగా ప్రదర్శించి వారెవ్వా అనిపించారు. ఈ సినిమాకు మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆయా సన్నివేశాలకు తగ్గట్లుగా ఎలివేషన్ ఇస్తూ బీజీఎం ఆకట్టుకుంది.  మొత్తంగా సినిమా విడుదలై నాలుగు వారాలు పూర్తికాక ముందే నాని సినిమా థియేటర్లలోకి రావడం విశేషం.


Also Read: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే