ఈ వీకెండ్ ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఓటిటిలో సినిమాలను ఎంజాయ్ చేయాలి అనుకునే వారి కోసం తాజాగా ఓటీటీలోకి వచ్చిన టాప్ 5 మలయాళ, తమిళ సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి. 


అన్వేషిప్పిన్ ఖండేతుమ్ 
ఈ మూవీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్నాక ఓటీటీలోకి వచ్చేసింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ మూవీ ఓటిటిలో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే భారీ వ్యూస్ తో ట్రెండింగ్లోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ మూవీ రెండు హత్యలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. 


అబ్రహం ఓజ్లర్ 
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జయరాం ప్రధాన పాత్రల్లో నటించిన మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్. కొన్ని వరుస హత్యల ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కూడా తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. 


తలవన్
తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టిన మరో ఇంటరెస్టింగ్ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తలవన్. బిజు మీనన్, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో అందుబాటులో ఉంది. ఇక క్లైమాక్స్ అయితే ఊహించని విధంగా ఉంటుంది. 


Read Also : Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 



పేచీ 
రామచంద్రన్ బి దర్శకత్వం వహించిన తమిళ హారర్ మూవీ పేచీ. ట్రెక్కింగ్ యాత్రలో అడవిలో దుష్ట ఆత్మ బారిన పడే స్నేహితుల కథనే ఈ హారర్ మూవీ. గాయత్రీ, బాల శరవణన్ నటించిన ఈ మూవీ రీసెంట్ గానే థియేటర్లో రిలీజ్ అయ్యింది. అంతలోనే ఓటీటీలోకి వచ్చేసిని. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20 నుండి ఆహా తమిళంలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. రామచంద్రన్ బి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గోకుల్ బెనోయ్, షేక్ ముజీబ్ నిర్మించారు. వెయిలోన్ ఎంటర్‌టైన్‌మెంట్, వెరస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. హారర్ మూవీ లవర్స్, అందులోనూ మలయాళ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ పేచీ మూవీ మంచి సజెషన్.  


సీఐడీ రామచంద్రన్ రి. ఎస్‌ఐ
ఓటీటీలోకి వచ్చేసిన తాజా మలయాళ చిత్రం సీఐడీ రామచంద్రన్ రి. ఎస్‌ఐ. కళాభవన్ షాజోన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 20 నుండి మనోరమ మ్యాక్స్‌లో ప్రసారం అవుతోంది. మే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో అంతంత మాత్రంగానే ఆడింది. ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు సపోర్ట్ చేస్తూ కోర్టులఓ న్యాయం కోసం పోరాడతాడు ఈ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఒక పోలీస్ అయ్యి ఉండి కూడా నిందితులకు ఎందుకు హెల్ప్ చేశాడో తెలియాలంటే సినిమాను చూడాల్సిందే. 


Read Also : Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ