Episode 19 Day 18: బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం గొడవల మీద గొడవలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ సైతం కంటెస్టెంట్లకు రకరకాల కండీషన్లు పెడుతున్నాడు. వంట వండుకునేందుకు కూడా నిబంధనలు పెట్టేశాడు. ఇక ప్రభావతి 2.ఓ ఆటను గురువారం నాటి ఎపిసోడ్‌లో కంటిన్యూ చేశారు. ఆల్రెడీ అభయ్ పిచ్చి లేసినట్టుగా ప్రవర్తించి... గివ్ అప్ ఇచ్చాడు. ఆటను మధ్యలోనే గాలికి వదిలేశాడు. నాయకుడే అలా వదిలేయడం... కాంతార క్లాన్‌ ఓ గతి లేకుండా పోయింది. అవతలి టీం వచ్చి గుడ్లు ఎత్తుకు పోతూ ఉన్నా కూడా చోద్యం చూస్తుండిపోయాడు అభయ్.


అలా అభయ్ పూర్తిగా విఫలం అయ్యాడు. కంటెస్టెంట్, చీఫ్‌గా అభయ్ డిజాస్టర్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. నేటి ఎపిసోడ్ తరువాత అభయ్ ఎలిమినేషన్ దాదాపు కన్ఫామ్ అయిపోయినట్టే అనిపిస్తుంది. నిఖిల్, పృథ్వీ చాలా దారుణంగా ఆడేస్తున్నారు. ఆ ఆటలో, కోపంలో అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదనిపిస్తోంది. యష్మీ, ప్రేరణలను బొమ్మల్లా ట్రీట్ చేసి అవతల పారేస్తున్నారు. పృథ్వీ అయితే నోటి దురుసుతో రెచ్చిపోతున్నాడు. ఇక సోనియా అయితే కష్టపడకుండా.. ఎగ్స్‌ను లేపేసే పనిలోనే ఉండిపోయింది.


Read Also : హౌస్‌లో అర్జున్ రెడ్డి... అప్పుడు సన్నీ, ఇప్పుడు పృథ్వీ - అదే తప్పు... ఆదిత్య ఓంకు అవమానం



ఇక సోనియా మాటలతోనే ఆట ఆడుతోంది. సంచాలక్ నబిల్‌ను రెచ్చగొడుతూ ఉంది. సోనియా మీద యష్మీ, ప్రేరణలు పీకల దాక కోపంతో ఉండిపోయారు. ఫేక్ గేమ్ ఆడుతోందని, ఫేక్ మనిషి అంటూ తిట్టిపోశారు. ఇక ప్రేరణను సీత, విష్ణు ప్రియలు బ్లాక్ చేయడం.. అక్కడ కారెక్టర్ లెస్ అంటూ విష్ణు ప్రియని అనడంతో మరో రచ్చ మొదలైంది. కాంతార టీం గంపలను లేపి అవతలపారేశారు. విష్ణు ప్రియ అయితే ఆ గంపని కాలితో తన్నేసింది. ప్రభావతి వద్ద శక్తి టీం బ్లాక్ చేయడం.. మొత్తం వాళ్లే ఉండటంతో అక్కడ కూడా గొడవలు అయ్యాయి.


మణికంఠ, పృథ్వీల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇలా గురువారం నాటి ఎపిసోడ్ మాత్రం చాలా దారుణంగా మారిపోయింది. ఫిజికల్ అయ్యారు... బూతులు తిట్టుకున్నారు. టాస్కుని పక్కన పెడితే... నబిల్ విషయంలో విష్ణు ప్రియ క్లారిటీ ఇచ్చింది. నబిల్ తనను ఎక్కడా టచ్ చేయలేదని, మంచోడు అని క్లారిటీ ఇచ్చింది. ప్రభావతి నుంచి ఓ ఎర్ర కలర్ గుడ్డు వచ్చింది. దాన్ని నిఖిల్ తీసుకున్నాడు. ఈ ఎర్రగుడ్డుతో సపరేట్ లాభాలుంటాయని ఇది వరకు సీజన్లు చూస్తే అర్థం అవుతుంది. ఇక వంట గదిలో ఒక సారి ఒక టీం మాత్రమే ఉండాలని.. అది కూడా ముగ్గురు సభ్యులే ఉండి వంట చేయాలని కండీషన్ పెట్టడంతో అభయ్ విరుచుకుపడ్డాడు. 


బిగ్ బాస్‌ని సైకో గాడు... అంటూ అభయ్ తిట్టేశాడు. సరిగ్గా తిననివ్వడం కూడా లేదు అంటూ బిగ్ బాస్ టీం మీద నోరు జారాడు. ఇవన్నీ చూస్తుంటే ఈ వారం అభయ్‌కి మూడేలా ఉందనిపిస్తుంది. చీఫ్‌గా ఫ్లాప్ అయిన అభయ్ ఈ వారం ఎలిమినేట్ అయ్యేలానే ఉన్నాడు. ఆటను మధ్యలో వదిలేయకుండా.. చివరి వరకు ప్రాణం పెట్టి ఆడాలన్న కనీస ప్రయత్నం కూడా అతనిలో కనిపించలేదు. తన టీం ఎంత కష్టపడుతున్నా.. కూడా తాపీగా కూర్చుని చూశాడు. దీనికి కచ్చితంగా మూల్యం చెల్లించుకునేలా ఉన్నాడు.