మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర'. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. 'దేవర'తో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతోంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కు కూడా ఇది తెలుగులో ఫస్ట్ మూవీనే. ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కు రెడీ కావడంతో ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ప్రస్తుతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఇంటర్వ్యూ హిలేరియస్ గా ఉంది. 


పిలిచి మరీ పరువు తీస్తున్నారు 
ప్రోమో మొదట్లోనే "దేవర చిట్ చాట్ విత్ మాస్ కా దాస్" అంటూ విశ్వక్ సేన్ ముందుగా మొదలు పెట్టాడు. "స్టార్ బాయ్" అని ఎన్టీఆర్ సాగదీయగా "విత్ యంగ్ టైగర్" అంటూ సిద్ధూ జొన్నలగడ్డ పూర్తి చేశాడు. ఆ తర్వాత సిద్ధు మాట్లాడుతూ "అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఏంటన్నా... మీరు బాంబేకి షిఫ్ట్ అయిపోవచ్చు కదా?" అని ప్రశ్నించాడు. అయితే ఎన్టీఆర్ "నీకు వచ్చు కదా హిందీ?" అని అడిగారు ఫన్నీగా. ఆ వెంటనే సిద్ధు "హిందీ అంటే భయ్యా తోడ ప్యాస్ దాలో అనే కదా" అంటూ డైలాగ్ చెప్పి నవ్వించారు. 


Also Read: జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు



మీ టైపు రొమాన్స్ కాదు... యంగ్ హీరోలపై ఎన్టీఆర్ సెటైర్ 
ఇక ఆ తర్వాత సీన్లోకి విశ్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చాడు. "దేవర సినిమాలో రొమాన్స్ ఎలా ఉందన్నా" అని ప్రశ్నించాడు విశ్వక్. మీరు అనుకున్నట్టుగా రొమాన్స్ ఉండదు. కానీ..." అంటూ ఎన్టీఆర్ సమాధానం చెప్పేలోపే విశ్వక్ "వాడి లెవెల్ రొమాన్స్ ఉండదు అంటున్నారు అంతే కదా" అంటూ సిద్ధూ జొన్నలగడ్డను చూపిస్తూ నవ్వాడు. ఆ వెంటనే "ఆ కరెక్ట్ కరెక్ట్... ఈ లెవల్ రొమాన్స్ అయితే ఉండదు" అంటూ తారక్ రిప్లయ్ ఇచ్చారు. వెంటనే సిద్దు "ఇది హరాజ్మెంట్  రా" అని నవ్వాడు విశ్వక్ తో. నెక్స్ట్ "ఇలాంటి ఐటమ్ పనులన్నీ మనోడితోనే అవుతాయి కదా" అని సిద్ధూను చూపిస్తూ మళ్ళీ అతనిపై సెటైర్ వేశారు ఎన్టీఆర్. "ఇజ్జత్ తీయడానికే ఉంటారు... పిలిచి మరి పరువు తీస్తున్నారు. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు" అంటూ హిలేరియస్ గా డైలాగ్ వేశారు సిద్దు. ఈ ప్రోమో చివర్లో "వాట్ ఈజ్ యువర్ ఫియర్ అన్నా?" అని ప్రశ్నించాడు సిద్దు. కానీ ఎన్టీఆర్ సమాధానం చెప్పకుండానే ప్రోమో ఎండ్ అయ్యింది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఇద్దరు స్టార్స్ ను ఇలా దేవర ప్రమోషన్లకు ఉపయోగించుకోవడం మంచి ఆలోచనే. ఇక సిద్ధూ, విశ్వక్ లకు ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫుల్ వీడియో గురించి ఎన్టీఆర్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ కంప్లీట్ ఇంటర్వ్యూను రేపు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. 


Read Also : Sonia Akula Love Story: ఎట్టకేలకు లవర్ గురించి ఓపెన్ అయిన సోనియా... మూడేళ్ల లవ్ స్టోరీ, ఏం చెప్పిందో తెలుసా?