ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల మహిళ కొరియోగ్రాఫర్, ఢీ మాజీ కంటెస్టెంట్ జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ముంబై, చెన్నై వంటి నగరాలకు ఔట్‌డోర్ షూట్‌కి వెళ్లినప్పుడు ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తను నివాసం ఉంటున్న ఇంట్లోనూ జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయమై ఆమె ఫిలిం ఛాంబర్‌కు కూడా ఫిర్యాదు చేసింది. అయితే జానీ మాస్టర్‌పై ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఇంకా ఎన్నో విస్తుపోయే విషయాలు ఉన్నాయి.
మతం మారాలంటూ వేధింపులు
ఈ వ్యవహరంలో జానీ మాస్టర్ భార్య అయోషా కూడా ఉందని, తన భర్త పెళ్లి చేసుకోమంటూ ఆమె తనపై దాడి చేసినట్టు బాధిత యువతి తన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. దీంతో ఇప్పుడు ఆమె స్టేట్‌మెంట్ సంచలనంగా మారింది. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. బాధిత యువతి ఢీ 12 డ్యాన్స్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అదే సమయంలో జానీ మాస్టర్ ఈ షోకు జడ్జీగా వ్యవహరించారు. అప్పుడే ఆమెకు జానీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆమెకు తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చాడు. అలా 2019లో ఆమె జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఈ క్రమంలో 2019తో ఓ ప్రాజెక్ట్ కోసం ముంబై ఔట్ డోర్ షూటింగ్ తనతో పాటు ఇద్దరు అసిస్టెంట్స్‌ని జానీ తన వెంట తీసుకువెళ్లాడు.
ముంబై హోటలో బలవంతం
అప్పుడే తను ఉంటున్న హోటల్‌లో రూంకి వచ్చి ఆమెపై బలవంతంగా లైంగిక దాడి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ విషయం బయటకు చెబితే తనని పని నుంచి తొలగిస్తానని కూడా బెదిరించాడు. దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. అప్పటి నుంచి ఔట్‌డోర్ షూటింగ్ వెళ్లినప్పుడల్లా జానీ తనపై లైంగికంగా వేధించేవాడు. షూటింగ్ సెట్స్‌లోనూ తన ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఓ రోజు ఆమె వ్యానిటీ వ్యాన్‌లోకి ప్రవేశించి లైంగిక వాంఛను తీర్చాలని బలవంతం చేశాడు. అంగీకరించనందుకు తన జుట్టు పట్టి వ్యాన్‌లోని అద్దానికి గుద్దాడు. అంతేకాదు తనని పెళ్లి చేసుకోవాలని, మతం మారాలని ఒత్తిడి చేసేవాడు. దీనికి నిరాకరించినందుకు ఓ రోజు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి తన స్కూటీని ధ్వంసం చేశాడు. ఇంటిపై దాడి దాడి చేసి పెళ్లి చేసుకోమ్మని బెదిరించాడు.
నా భర్తను పెళ్లి చేసుకో..
జానీ, అతని భార్య అయేషా కూడా ఓ రోజు రాత్రి ఆమె ఇంటిపై దాడి చేశారు. బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి వచ్చి ఆమెతో మతం ప్రస్తావన తీసుకువచ్చారు. మత మరాలని, తన భర్త పెళ్లి చేసుకోమ్మంటూ జానీ భార్యను ఆమెను బలవంతం చేసింది. ఈ క్రమంలో ఆమెపై పులమార్లు శారీరక దాడికి కూడా పాల్పడింది. ఇక వారి వేధింపులు భరించలేక బాధిత యువతి జానీ బృందం నుంచి బయటకు వచ్చి సొంతంగా పని చేసుకోవడం ప్రారంభించింది. కానీ తన ఇన్‌ఫ్లూయేన్స్‌తో జానీ ఆమెకు ఆఫర్స్ రాకుండ చేసేవాడు. కావాలని పలు ప్రాజెక్ట్స్‌కి ఆమెను సెలక్ట్ చేసుకుని షూటింగ్ మధ్యలో కావాలనే ఆమెను తీసేసి మరొకరిని నియమించుకోవడం చేసేవాడు.
అలా ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు అని బాధితురాలు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహరం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా జానీపై కేసు నమోదు అవ్వడంతో ఇప్పటికే జనసేన ఆయనను పార్టీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు పార్టీకి సంబంధించిన అంశాలపై అతడు కలుగజేసుకోవద్దని కూడా ఆదేశించింది. డ్యాన్స్ అసోసియేషన్ సైతం ఆయనపై వేటు వేసింది. అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఇక అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేసే ఆలోచిన ఫేడరేషన్ ఉందని సమాచారం.