Poonam Kaur: త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్‌ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌

Trivikram Srinivas: జానీ మాస్టర్‌ ేసు సంచలనంగా మారిన నేపథ్యంలో నటి పూనమ్‌ కౌర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై షాకింగ్‌ ట్వీట్‌ చేసింది. ఆయనను ఇండస్ట్రీ పెద్దలు ప్రశ్నించాలంటూ ఆమె కోరింది.  

Continues below advertisement

Poonam Kaur Shocking Tweet on Trivikram Srinivas: ప్రస్తుతం ఇండస్ట్రీలో జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులు తీవ్ర దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో సినీ నటి పూనమ్‌ కౌర్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ అంశాన్ని లేవనెత్తుతూ సంచలన ట్వీట్‌ చేసింది. జానీ మాస్టర్‌ లైంగిక వేధింపుల కేసు హాట్‌టాపిక్‌ అవుతున్న నేపథ్యంలో పూనమ్‌ కౌర్‌ పోస్ట్‌ ఆసక్తిని సంతరించుకుంది. జానీ మాస్టర్‌పై 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్‌ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Continues below advertisement

జానీ మాస్టర్ కేసు వ్యవహరం

అతడి వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేస్తున్న తనపై జానీ మాస్టర్‌ కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతు వస్తున్నాడని ఆమె నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో పోలీసులు జానీపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఈ వివాదాన్ని ఫిలిం ఛాంబర్‌ సైతం సీరియస్‌ తీసుకుని సైలెంట్‌గా విచారణ చేస్తుంది. అదే విధంగా డ్యాన్స్‌ అసోసియేషన్‌ నుంచి కూడా జానీ మాస్టర్‌కు తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీంతో నటి పూనమ్‌ కౌర్‌ జానీ వ్యవహరంలో స్పందిస్తూ అతడిని ఇకపై మాస్టర్‌ అని పిలవద్దు అంటూ పోస్ట్‌ చేసింది. ఈ ట్వీట్‌ చేసిన కాసేపటికే ఆమె మరో సంచలన పోస్ట్‌ చేసింది. మరోసారి త్రివిక్రమ్‌తో తనకు ఉన్న వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చింది. 

త్రివిక్రమ్ ను ప్రశ్నించండి

గతంలో నేను ప్రముఖ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై మా అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశాను. కానీ అప్పుడు ఎవరూ నాకు సహాకరించలేదు. పైగా రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ వాటిని నేను సైలెంట్‌గా వదిలేశాను.కానీ, ఈ విషయంలో సినీ పెద్దలకు వ్యక్తిగతం ఫోన్ చేసి ఫిర్యాదు చేశాను. ఇప్పుడు వారందరు ఈ విషయమైన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ని ప్రశ్నించాలని కోరుతున్నా" అంటూ సైలెంట్‌గా ట్వీట్‌ వదిలింది. ప్రస్తుతం పూనమ్‌ కౌర్‌ పోస్ట్‌ సంచలనంగా మారింది. మరి ఆమె ట్వీట్‌పై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

త్రివిక్రమ్ పై మాకు ఫిర్యాదు

కాగా పూనమ్‌ కౌర్‌కి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వివాదం గురించి తెలిసిందే. వీరిద్దరు చాన్నాళ్ల నుంచి గొడవ జరుగుతుంది. గతంలో త్రివిక్రమ్‌ తనని వేధించాడంటూ ఆమె మా అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పూనమ్‌కు ఇండస్ట్రీలో మెల్లిమెల్లిగా అవకాశాలు తగ్గడం మొదలయ్యాయి. దీంతో పూర్తిగా ఆమె ఇండస్ట్రీకి దూరమైంది. కానీ, వీలు చిక్కినప్పుడల్లా ఆమె గురూజీపై మాటల దాడి చేస్తూనే ఉంటుంది. ఆయనను విమర్శిస్తూ సంచలన కామెంట్స్‌ చేస్తూనే ఉంటుంది. తాజాగా జానీ మాస్టర్‌ వ్యవహారం బట్టబయలైన నేపథ్యంలో ఆమె త్రివిక్రమ్‌ను సినీ పెద్దలు ప్రశ్నించాలంటూ ట్వీట్ చేయడంతో హాట్‌టాపిక్‌గా మారింది. 

Also Read: లైంగిక వేధింపుల కేసు - జానీ మాస్టర్‌పై నటి పూనమ్‌ కౌర్‌ సంచలన కామెంట్స్‌

Continues below advertisement