Katy Perry Special QR Code Tattoo: అమెరికన్ పాన్ సింగర్ కేటీ పెర్రీ గురించి సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన పాటలోతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది శ్రోతలను ఉర్రూతలూగించింది. ఇప్పటికే 12 సార్లు గ్రామీ అవార్డులు అందుకున్న కేటీ... తాజాగా 13వసారి గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యింది. ‘రోర్’, ‘ఫైర్ వర్క్’ లాంటి పాప్ సాంగ్స్ తో ఈసారి నామనేషన్ దక్కించుకుంది. తాజాగా MTV వీడియో మ్యూజిక్ అవార్డ్స్‌ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే ఫర్మార్మెన్స్ తో ఆకట్టుకుంది.


వెరైటీ టాటూతో ఆకట్టుకున్న పాప్ బ్యూటీ


స్టార్-స్టడెడ్ 2024 ఈవెంట్ లో భాగంగా సింగర్ కేటీ పెర్రీ  బ్లాక్ కార్పెట్ మీద నడిచి అందరినీ అలరించింది. ఈ సందర్భంగా ఆమె వీపు కింది భాగంలో వేయించుకున్న టాటూ సంథింగ్ స్పెషల్ గా నిలిచింది. ఎవరైనా తమకు నచ్చిన వారి పేరు, లేదంటే నచ్చిన గుర్తు టాటూగా వేయించుకుంటారు. కానీ, కేటీ పెర్రీ మాత్రం క్యూఆర్ కోడ్ ను టాటూగా వేయించుకుంది. ఆమె టాటూ వెనుక ఉన్న అసలు సంగతేంటని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు.


కేటీ పెర్రీ క్యూఆర్ కోడ్ టాటూ వెనుక్కున్న అసలు కథ ఇదే!


సింగర్ కేటీ పెర్రీ కేవలం బోల్డ్ ష్యాషన్ స్టేట్ మెంట్ గానే కాకుండా, కీలక విషయాన్ని సదరు క్యూర్ కోడ్ లో నిక్షిప్తం చేసిందని తెలిసింది. కేటీ ఒంటి మీద ఉన్న టాటూ స్కాన్ చేస్తే, ఆమెకు నెక్ట్స్ ఆల్బమ్ ‘143’ వివరాలు వస్తున్నాయి. నేరుగా తన లేటెస్ట్ ఆల్బమ్ కు సంబంధించిన పేజి ఓపెన్ అవుతుందట. ఈ ఏడాది సెప్టెంబర్ 20న కేటీ లేటెస్ట్ ఆల్బమ్ రిలీజ్ కానుంది. ఈ ఆల్బమ్ కు ఆమె ‘ఏంజెల్’ అని పేరు పెట్టింది. ఫ్యాషన్ తో పాటు టెక్నాలజీని కలిపి కేటీ క్రియేటివ్ గా టాటూ వేసుకోవడాన్ని అందరూ అభినందిస్తున్నారు. 






రీసెంట్ గా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొన్న కేటీ పెర్రీ


ఇక కేటీ పెర్రీ గత కొద్ది రోజుల క్రితం జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదిరిపోయే సాంగ్స్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.  ఆమె పాటలు పాడుతుంటే అతిథులు ఉత్సాహంతో డ్యాన్సుల చేశారు. సిల్వర్ కలర్ దుస్తుల్లో ఆటా పాటలతో అద్భుతంగా ఆకట్టుకుంది. ఇక ఈ వేడుకలో పాల్గొన్నందుకు కేటీ పెర్రీ  భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంది. సుమారు 4 గంటల పర్ఫామెన్స్ కు ఏకంగా 5 మిలియన్ డాలర్లు తీసుకుంది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.45 కోట్లుగా ఉంటుంది.


Also Read: నయనతార హిట్ మూవీ సీక్వెల్‌కు డైరెక్టర్‌ని మార్చిన మేకర్స్‌ - కొత్త పోస్టర్స్‌తో సర్‌ప్రైజ్‌!