Amazon Great Indian Festival Vs Flipkart Big Billion Days: మన దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కావడంతో, కస్టమర్లను ఆకర్షించేందుకు అన్ని కంపెనీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. కార్లపై లక్షల రూపాయల డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తున్నారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కూడా రకరకాల ఆఫర్లతో ప్రజలను బుట్టలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పండుగ సీజన్‌ను క్యాష్‌ చేసుకోవడంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు మాత్రం ఎలా వెనుకంజ వేస్తాయి? ఇ-కామర్స్ రంగ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ సంవత్సరంలో అతి పెద్ద విక్రయాలకు సిద్ధమయ్యాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే.. అమెజాన్ తన "గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌"ను, ఫ్లిప్‌కార్ట్ "బిగ్ బిలియన్ డేస్"ను ప్రకటించాయి.


అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానుంది
అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఈ నెల 27 (2024 సెప్టెంబర్‌ 27) నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు ఒక రోజు ముందే, అంటే సెప్టెంబర్‌ 26 నుంచే సేల్‌ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్ దీపావళి వరకు, అంటే అక్టోబర్ 29 వరకు కొనసాగుతుందని చెబుతున్నారు. 


ఈ సంవత్సరం అక్టోబర్‌లో దసరా (Dasara 2024), దీపావళి (Deepawali 2024) ఉన్నాయి. ఈ కారణంగా, అమెజాన్‌ నెల పొడవునా ప్రత్యేక ఆఫర్‌లను కొనసాగిస్తోంది. 


SBI కార్డ్‌పై డిస్కౌంట్‌  
అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్‌ సేల్‌లో, ఈ కంపెనీ చాలా బ్యాంకులతో టై-అప్‌ల ద్వారా నో-కాస్ట్ EMIని, మరికొన్ని ప్రత్యేక ఆఫర్‌లను కూడా అందిస్తుంది. SBI డెబిట్ కార్డ్ & క్రెడిట్ కార్డ్ వినియోగదార్లకు 10 శాతం డిస్కౌంట్‌ కూడా ఉంటుంది. 


ఐఫోన్‌ సహా వేలకొద్దీ ఉత్పత్తులపై ఆఫర్‌లు
ఈ నెల రోజు కాలంలో, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా వేలాది ఉత్పత్తులపై బెస్ట్‌ ఆఫర్‌లను అమెజాన్‌ ప్రకటించింది. రూ. 5,999 నుంచే మొబైల్‌ ఫోన్లు అందుబాటులో ఉంచుతామని అమెజాన్‌ ఇప్పటికే టాంటాం చేసింది. ఈ డిస్కౌంట్‌ సేల్స్‌లో, ఐఫోన్‌పై భారీ తగ్గింపులు పొందే అవకాశం ఉంది. శామ్‌సంగ్‌, ఒప్పో, ఒన్‌ప్లన్‌, రియల్‌మీ వంటి స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్స్‌ పైనా డిస్కౌంట్స్‌ లభిస్తాయి. మొబైల్‌ యాక్సెసరీస్‌ కూడా రూ. 89 నుంచే స్టార్ట్‌ అవుతాయని వెల్లడించింది. 24 నెలల నో-కాస్ట్ EMI ఫెసిలిటీ కూడా ఉంది. 


స్మార్ట్‌ టీవీలను కూడా చాలా చవగ్గా, రూ. 6,999 నుంచి కస్టమర్లకు ఆఫర్‌ చేస్తున్నట్లు అమెజాన్‌ అనౌన్స్‌ చేసింది. శామ్‌సంగ్‌, సోనీ, LG సహా చాలా టీవీ బ్రాండ్స్‌పై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. అమెజాన్‌ అలెక్సా, ఫైర్‌టీవీ స్టిక్‌లు వంటి ఉపకరణాలు రూ. 1,999 నుంచి అందుబాటులోకి వస్తాయి. 


ఫ్యాషన్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ వాచ్‌లు, గృహోపకరణాలపై భారీ ఆఫర్లు రాబోతున్నాయి. గ్రేట్ ఇండియా ఫెస్టివల్‌ సేల్‌ టైమ్‌లో ట్రావెల్‌ బుకింగ్స్‌ చేసుకున్నా డిస్కౌంట్స్‌ ఇస్తామని అమెజాన్‌ వెల్లడించింది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు, కూపన్లను కూడా జారీ చేస్తుంది. అయితే, ఆఫర్ల పూర్తి వివరాలను అమెజాన్‌ ఇంకా బయటపెట్టలేదు.


ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ తేదీలు-ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ కూడా సెప్టెంబర్ 27 నుంచే ప్రారంభమవుతుంది. కంపెనీ చెప్పిన ప్రకారం, ఇది అక్టోబర్ 6 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ కస్టమర్లకు ఒకరోజు ముందే (సెప్టెంబర్‌ 26 నుంచి) సేల్‌ అందుబాటులోకి వస్తుంది. 


బిగ్ బిలియన్ డేస్ కోసం HDFC బ్యాంక్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. HDFC బ్యాంకు క్రెడిట్‌ & డెబిట్‌ కార్డ్‌ వినియోగించేవాళ్లకు ఈ సేల్‌లో 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం డిస్కౌంట్‌ ఇస్తారు. క్యాష్‌బ్యాక్, రివార్డులు, అనేక ఆఫర్‌లు కూడా ఉంటాయి. గృహోపకరణాలు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & బ్యూటీ, గృహాలంకరణ, పుస్తకాలు, బేబీ ప్రొడక్ట్స్‌, స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు ఇస్తారు. ఏ ఫోన్‌ మీద ఎంత తగ్గింపు ఉంటుందో త్వరలో వెల్లడిస్తారు. ఫ్లిప్‌కార్ట్ UPI చెల్లింపులతో రూ.50 వరకు తగ్గింపు, నో-కాస్ట్‌ EMI వంటి ఫెసిలిటీలు ఉంటాయి. క్లియర్‌ట్రిప్ నుంచి ట్రావెల్‌ బుకింగ్స్‌ కూడా అందుబాటులోకి వస్తాయి.


మరో ఆసక్తికర కథనం:  భలే ఛాన్స్‌, పెరిగిన మేర తగ్గిన గోల్డ్‌, సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి