ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 21ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించాడంటూ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ విషయం బయటకు రాగానే పలువురు సినీతారలు, మహిళా సంఘాలు ఆయనపై మండిపడుతున్నారు. అంతేకాదు బాధిత యువతి తమ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ కేసు సింగర్ చిన్మయి స్పందిస్తూ బాధిత యువతికి మద్దతు తెలిపింది.
ఒక మీడియా కథనాన్ని ట్యాగ్ చేస్తూ చిన్మయి "నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి ఉండాలని కోరుకుంటున్నాను" ఇన్‌స్టా వేదికగా స్పందించింది. తాజాగా సినీ నటి పూనమ్ కౌర్ కూడా ఈ కేసుపై స్పందించింది. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో సంచలన పోస్ట్ చేసింది. "ఇకపై నిందితుడు షేక్ జానీని మాస్టర్ అని పిలవకండి. మాస్టర్ పదానికి కాస్తా గౌరవం ఇవ్వండి" అంటూ ఆమె సిరియస్ అయ్యింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జానీ మాస్టర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా
కాగా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు చెప్పిన ఆమె ముంబై, చెన్నైలో ఔట్ డోర్ షూట్స్‌కి వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాగే తను నివాసం ఉంటున్న నార్సింగ్ ఇంట్లోనూ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నార్సింగ్ పోలీసులు జానీపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహరంలో ఇప్పటికే ఆయనపై జనసేన వేటు వేసింది. ఫిలిం చాంబర్ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఆయన తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌కు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశమైన తర్వాత POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందని ఫిలిం ఛాంబర్ గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు.
పెళ్లి చేసుకోవాలని వేధింపులు
ఇదిలా ఉంటే సదరు యువతి జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేస్తూ సంచలన ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్ తనని పెళ్లి చేసుకోవాలని వేధించినట్టు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. అంతేకాదు ఎంతోకాలంగా తనని లైంగికంగా వేధిస్తున్నాడని, తన కోరిక తీర్చకుండ ఆఫర్స్ లేకుండ చేస్తానని బెదిరించినట్టు పేర్కొంది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడని, లేదంటే కెరీర్ లేకుండ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్టు ఆమె సంచలన విసయాలు వెల్లడించింది. అయితే సదరు యువతి ఆరోపణలపై ఇప్పటి వరకు జానీ స్పందించపోవడం గమనార్హం.
Also Read: జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు - ఫిలిం ఛాంబర్ రియాక్షన్ ఇదే..!