ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై లైంగిక కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన దగ్గర అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మహిళా కొరియోగ్రాఫర్‌ అతడిపై లైంగిక ఆరోపణలు చేసింది. అంతేకాదు నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో సెప్టెంబర్‌ 16న ఫిర్యాదు చేయడంతో అతడిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహరం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే జానీ మాస్టర్‌ జనసేన పార్టీ నామమాత్రపు వేటు కూడా వేసింది. ఇక ఈ ఆరోపణలు నిజమని తెలిస్తే జనసేన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి నెలకొంది. మరోవైపు తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌ అధ్యక్ష పదవిలో ఉన్న జానీ మాస్టర్‌ తాత్కాలికంగా ఆ పదవి నుంచి తీసివేసినట్టు తెలుస్తోంది.


ఫిలిం ఛాంబర్ రియాక్షన్‌


ఈ కేసుపై ఫిలిం ఛాంబర్‌ స్పందిస్తూ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు తమకు అందిందని ఫిలిం ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపడుతున్నామని, ఈ ఫిర్యాదును తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌కు సిఫార్సు చేసిట్లు తెలిపారు. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశమైన తర్వాత POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇక బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, బాధితురాలి ఫోటోలను, వీడియోలను దయచేసి ఎవరూ ఉపయోగించవద్దని ఆయన కోరారు. 



అసలేం జరిగిందంటే.. 


జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు బాధిత యువతి మధ్యప్రదేశ్‌కు చెందిన అమ్మాయిగా సమాచారం. ఆమె కొంతకాలంగా జానీ మాస్టర్‌ దగ్గరగ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గాపని చేస్తుంది. ఈ క్రమంలో ఆయనతో కలిసి ఎన్నో సినిమాలకు పని చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో జానీమాస్టర్‌తో కలిసి ఔట్‌డోర్‌ షూట్‌కి కూడా వెళ్లింది. అదే సమయంలో జానీ మాస్టర్‌ తనని లైంగిక వేధించినట్టు ఆమె ఫిర్యాదు పేర్కొంది. సాంగ్స్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై వంటి నగరాలకు వెళ్ళినప్పుడు అవుట్‌ డోర్ షూటింగ్ చేసే సమయాల్లో తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలిపింది.


Also Read: ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే అప్‌డేట్‌ ఇచ్చిన రామ్‌ చరణ్‌ - బీస్ట్‌ మోడ్‌లో గ్లోబల్‌ స్టార్‌, ఆర్‌సీ 16 లోడింగ్‌...



అంతేకాదు  తాను నివాసం ఉంటున్న నార్సింగ్‌ ఇంట్లో కూడా తనపై అత్యాచారం చేశాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇక జానీ మాస్టర్‌ గతంలోనూ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఓ యువతి వేధించిన కేసులో ఆరు నెలల జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఇప్పుడు మరోసారి ఆయన లైంగిక ఆరోపణలు రావడం కొరియోగ్రాఫర్‌ అసోసియేషన్‌ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయనను అసోసియేషన్‌ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్స్‌ వస్తున్నట్టు కూడా సమాచారం. 


Also Read: ఎన్టీఆర్‌కు కాదు, కొరటాలకే అగ్ని పరీక్ష... 'దేవర' రిజల్ట్ దర్శకుడి కెరీర్‌కి చాలా ఇంపార్టెంట్