సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) సెట్స్ మీదకు వెళ్లి చాలా రోజులే అవుతోంది. మయోసైటిస్ కారణంగా సమంత సరిగ్గా సినిమాలను చేయడం లేదు. కరోనా నుంచి సమంత కెరీర్ డల్ అయిన సంగతి తెలిసిందే. అటు పర్సనల్ లైఫ్ గానీ... ఇటు ప్రొఫెషనల్ లైఫ్ గానీ పూర్తిగా మారిపోయాయి. అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత పరిస్థితి మరింతగా మారిపోయింది. మయోసైటిస్ అటాక్ అవ్వడంతో కొన్ని నెలల పాటు సమంత ఇంటికే పరిమితం అయింది. 


మయోసైటిస్ కారణంగా సమంతకు ఎన్నో ప్రాజెక్టులు చేజారిపోయాయి. పుష్ప స్పెషల్ సాంగ్ సక్సెస్‌తో మంచి జోరు మీదున్న సమంతకు బాలీవుడ్ డెబ్యూ కూడా దొరికింది. కానీ మయోసైటిస్ కారణంగా అన్ని ఆఫర్లు పోయాయి. సమంత సైతం అందరికీ అడ్వాన్సులు తిరిగి ఇచ్చినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అప్పటికే కమిట్ అయి ఉన్న చిత్రాలను మాత్రం ఎలాగోలా పూర్తి చేయాలని అనుకుంది.


అందుకే తనకు బాగా లేకపోయినా, ఒంట్లో శక్తి లేకపోయినా కూడా సమంత తన శాకుంతలం, యశోద ప్రమోషన్స్ కోసం వచ్చింది. అయితే సిటాడెల్ ప్రమోషన్స్‌లో హాట్‌గా కనిపించి.. యశోద, శాకుంతలం ప్రమోషన్స్‌లో ఏడుస్తూ కనిపించడం మీద బాగానే ట్రోలింగ్ జరిగింది. సింపతీ కార్డ్ వాడుతోందని, ఏడిస్తే జనాలు సినిమాను చూస్తారని సమంత భావిస్తోందంటూ అప్పట్లో ట్రోలింగ్ జరిగింది.


యశోద పర్వాలేదనిపిస్తే... శాకుంతలం డిజాస్టర్ అయింది.. ఇక 'ఖుషి' కమర్షియల్‌గా ఓకే ఓకే అనిపించింది. విజయ్ దేవరకొండ, సమంత జంటకు కూడా అంతగా మార్కులేమీ పడలేదు. ఇక సమంత సిటాడెల్ వెబ్ సిరీస్‌ను కష్టపడి పూర్తి చేసింది. రాజ్ అండ్ డీకేలు సమంత కోసం షూటింగ్‌ను చాలా నెలలు పోస్ట్ పోన్ చేశారు. అలా సమంత తిరిగి వచ్చాక షూట్ కంప్లీట్ చేశారు. 






ఇక ఇప్పుడ సిటాడెల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. సమంత కూడా పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతోంది. వర్కౌట్లు చేస్తోంది. భారీ కసరత్తులు చేస్తూ బరువులు ఎత్తేస్తోంది. తన నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం రెడీ అవుతోంది. తాజాగా తన కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన సెట్‌లో అడుగు పెట్టానని, తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇలా సెట్స్ మీదకు వచ్చినందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. నెట్ ఫ్లిక్స్ కోసం రాజ్ అండ్ డీకే తీస్తున్న రక్త బ్రహ్మాండ్ అనే ఈ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ మిగిలిన వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక సమంత ఇలా సెట్స్ మీదకు వచ్చానని గుడ్ న్యూస్ చెప్పడంతో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Also Read: స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?