కొరియన్ డ్రామా, వెబ్ సిరీస్‌లు చూసే వీక్షకులకు 'స్క్విడ్ గేమ్' (Squid Game Web Series) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే... భాషతో ఎలాంటి  సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని మెప్పించిన సిరీస్ అది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసిన సిరీస్ అని కూడా చెప్పాలి. ఇప్పుడు ఆ సిరీస్ సెకండ్ సీజన్ వస్తోంది. ఈ రోజు 'స్క్విడ్ గేమ్' సీజన్ 2 (Squid Game Season 2) ఫస్ట్ టీజర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూశారా?


సియాంగ్ గి హ్యూన్ ఈజ్ బ్యాక్!
Squid Game 2 Teaser: 'స్క్విడ్ గేమ్' సిరీస్ చూసిన వీక్షకులకు 55 సెకన్స్ నిడివి గల ఈ టీజర్ అమితంగా ఆకట్టుకుంటుంది. ఎందుకు అంటే... ఫస్ట్ సీజన్ ఎండ్ నుంచి సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు. సిరీస్ ప్రధాన పాత్రధారి సియోంగ్ గి హ్యూన్ మరోసారి 456 యూనిఫార్మ్ ధరించి కనిపించారు. ఆయనతో పాటు మ్యాసివ్ క్రౌడ్ కూడా ఉన్నారు. క్యాష్ ప్రైజ్ ఎంత? ఈసారి ఆట ఎలా ఉండబోతుంది? అనేది తెలియాలంటే... కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. 


'ది గేమ్ విల్ నాట్ స్టాప్' (ఆట ఆగదు) అని 'స్క్విడ్ గేమ్ 2' టీజర్ ప్రారంభంలో అక్షరాలు కనిపించాయి. ఆ తర్వాత 'వుయ్ ఆర్ రెడీ టు స్టార్ట్ ద గేమ్' అని మాస్క్ మ్యాన్ నుంచి వాయిస్ వినిపించింది. అదీ సంగతి!


Also Readఆహా ఓటీటీలో టాప్ 5 బెస్ట్ హారర్ మూవీస్... రొమాంటిక్ హారర్ నుంచి ప్యూర్ హారర్ వరకూ... వీటిని అస్సలు మిస్ కావొద్దు






నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో 'స్క్విడ్ గేమ్ 2' రిలీజ్ ఎప్పుడు?
Squid Game Season 2 Release Date: 'స్క్విడ్ గేమ్' ఫస్ట్ సీజన్ 2021లో విడుదల అయ్యింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో పలు రికార్డులు క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్ టీవీ సిరీస్‌లలో అత్యధిక వీక్షకాదరణ పొందిన సిరీస్‌గా చరిత్రకు ఎక్కింది. ఎనిమిది గంటల నిడివి గల ఆ సిరీస్ 265 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఎమ్మా అవార్డుల్లో 14 కేటగిరీల్లో నామినేట్ కాగా... ఆరు అవార్డుల్లో విజేతగా నిలిచింది. 


'స్క్విడ్ గేమ్' అంటే వీక్షకుల్లో బోలెడు క్రేజ్ ఉంది. మరి, ఈ 'స్క్విడ్ గేమ్' సీజన్ 2 రిలీజ్ ఎప్పుడు? అంటే... డిసెంబర్ 26న. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీని కోసం ఇండియన్, అందులో మన తెలుగు ప్రజలు చాలా మంది కూడా ఉన్నారు.


Also Readకంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే



'స్క్విడ్ గేమ్ 2'లో సియాంగ్ గి హ్యూన్ పాత్రలో లీ జుంగ్ జే మరోసారి వీక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయనతో పాటు లీ బ్యూంగ్ హ్యూన్, వీ హా జున్, గాంగ్ యూ తమ తమ పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు సీజన్ 2లో కొత్త తారాగణం కూడా ఉంటారు. ఫస్ట్ సీజన్ డైరెక్ట్ చేసిన Hwang Dong-hyuk ఈ సీజన్ 2కు కూడా రచయిత, దర్శకుడు, నిర్మాత. ఫస్ట్ మ్యాన్ స్టూడియో పతాకం మీద ఈ సిరీస్ తెరకెక్కింది.