Balu Gani Talkies Release Date: శివ కుమార్ రామచంద్రపురపు ప్రధాన పాత్రలో విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘బాలు గాని టాకీస్‌’. ఇప్పటికే ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలకావాల్సి ఉన్నా, కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.


అక్టోబర్ 4 నుంచి ఆహాలో స్ట్రీమింగ్


‘బాలు గాని టాకీస్’ సినిమా ముందుగా చెప్పినట్లుగానే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 13 నుంచి ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఆక్టోబర్ 4 నుంచి ఆడియెన్స్ కు అందుబాటులోకి రాబోతోంది. ఈ మేరకు ఆహా రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేసింది. మా ‘బాలు గాని టాకీస్’లో ఆటలు అక్టోబర్ 4 నుంచి మొదలవుతాయి’ అంటూ క్యూరియాసిటీ పెంచేసింది.






సినిమాపై అంచనాలు పెంచిన ట్రైలర్  


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా పోస్టర్లు, టీజర్ అలరించాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా మూవీపై ఓ రేంజిలో అంచనాలు పెంచింది. ఈ సినిమా మొత్తంగా బాలు అనే కుర్రాడి సినిమా టాకీస్ చుట్టూ తిరుగుతుంది. బాలు అనే యువకుడికి ఓ థియేటర్ ఉంటుంది. అందులో ఎప్పుడూ అడల్ట్ కంటెంట్ సినిమాలు ఆడిస్తుంటాడు. ఈ సినిమా హాల్ ను రన్ చేసేందుకు చాలా చోట్ల అప్పులు చేస్తాడు. బాలయ్య అబిమాని అయిన బాలు.. ఎలాగైనా తన థియేటర్లలో నందమూరి నటసింహం సినిమా ఆడించాలనే ఆశ ఉంటుంది. ఇంతకీ అతడి కోరిక నెరవేరిందా? లేదా? అనే కథాశంతో మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో హీరో లవ్ స్టోరీ క్రేజీగా ఆకట్టుకుంటుంది. రఘు కుంచె ఈ సినిమాలో నెగెటివ్ పాత్ర పోషిస్తున్నారు.



ఇప్పటికే పలు సినిమాల్లో నటించి ఆకట్టుకన్న శివ


ఇప్పటికే ‘వకీల్‌సాబ్‌’, ‘మజిలీ’, ‘నిన్ను కోరి’ సహా పలు సినిమాల్లో నటించిన శివ రామచంద్రవరపు.. ‘బాలు గాని టాకీస్’ సినిమాలో హీరోగా కనిపించనున్నారు. ఈ సినిమాలో  శ్రావ్య శర్మ హీరోయిన్ పాత్రలో కనిపించనుంది.  ఈ మూవీ ఆక్టోబర్ 4 నుంచి ప్రేక్షకులను అలరించనుంది. విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి, శేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనిధి సాగర్, పి రూపక్ ప్రణవ్ తేజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఆదిత్య బీఎన్ సంగీతాన్ని అందిస్తున్నారు.    


Read Also: ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్... పిచ్చెక్కిస్తున్న ‘వేట్టయాన్’ ప్రివ్యూ