Vettaiyan Prevue OUT: తమిళ సూపర్ స్టార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’. ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రజనీకాంత్ సూపర్ కాప్ గా కనిపించబోతున్నారు. చెన్నైలో సూపర్ స్టార్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కాగా... అంగరంగ వైభవంగా జరిగిన ఈవెంట్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూను విడుదల చేశారు. ఇందులో తలైవా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా దుమ్మురేపారు. ‘జైలర్’ లాంటి లుక్ లోనే కనిపించి ఆకట్టకుకున్నారు. రజనీకి ఉన్నతాధికారిగా అమితాబ్ బచ్చన్ నటించారు. ఈ ప్రివ్యూలో కీలక నటీనటులు అందరినీ పరిచయం చేశారు.
‘వేట్టయాన్’ ప్రివ్యూ రిలీజ్
‘జై భీమ్’, ‘కూతతిల్ ఒరుతన్’ సినిమాల తర్వాత జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజనీకాంత్ ఈ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ‘వేట్టయాన్ ప్రీవ్యూ’ను రిలీజ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో రజనీకాంత్, అనిరుధ్ రవిచందర్, రానా దగ్గుబాటి, దుషారా, రితికా సింగ్ పాల్గొన్నారు.
ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా ఆకట్టుకున్న రజనీకాంత్
‘వేట్టయాన్ ప్రివ్యూ’ను మాస్ యాక్షన్ కంటెంట్ తో విడుదల చేశారు మేకర్స్. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ గురించి ఇతర పోలీసుల అధికారులకు గొప్పగా చెప్పే సీన్ తో ప్రీ వ్యూ ప్రారంభం అవుతుంది. నేరస్తులను అదుపు చేసేందుకు ఎంత వరకైనా తెగించే పోలీసు అధికారిగా రజనీ వ్యవహరిస్తారని బిగ్ బీ చెప్తారు. ఈ ప్రయాణంలో ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వివరిస్తారు. ఈ సినిమాలో రజనీ లుక్, స్టైల్ అచ్చం ‘జైలర్’ లుక్ మాదిరిగానే కనిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా జ్ఞానవేల్ గత సినిమా ‘జై భీమ్’ మాదిరిగానే ఎన్‌కౌంటర్లు, మానవ హక్కుల ఉల్లంఘనల కథాశంతో తెరకెక్కిస్తున్నారు.
రజనీకాంత్ ఇమేజ్ కు పూర్తి భిన్నమైన మూవీ-రానా
సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ‘వేట్టయాన్’ స్టోరీ పవర్ ఫుల్ గా ఉంటుందన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా ఉందన్న ఆయన రజనీ ఈ సినిమాకు మరింత బలంకాబోతున్నట్లు చెప్పారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు ఈ చిత్రంలో కొత్త రజనీకాంత్ ను చూస్తారని చెప్పారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. సామాజిక విషయాలు, వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందినట్లు చెప్పారు. అటు ఈ సినిమా రజనీ స్టైల్ మూవీ కాదని, ఆయన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన సినిమాగా ఉంటుందని రానా వెల్లడించారు. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
తెలుగులో ‘వేటగాడు’గా విడుదల
ఇక ‘వేట్టయాన్’ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10న తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో ‘వేట్టయాన్’గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తెలుగులో ‘వేటగాడు’గా విడుదలకానుంది. రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి ’కూలీ’ సినిమా చేస్తున్నారు.
Also Read: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే