కరోనరీ ఆర్టరీ వ్యాధి (Coronary Artery Disease - CAD) అనేది గుండెకు రక్త ప్రసరణ జరిపే కరోనరీ ఆర్టరీలు అంటే గుండెకు సంబంధించిన రక్తనాళాల వైశాల్యం తగ్గిపోవడం వల్ల ఏర్పడే అనారోగ్యంగా చెప్పవచ్చు.  ఈ వ్యాధి ప్రధానంగా ఆర్టరీల గోడలపై కొవ్వు అంటే ప్లాక్ పేరుకుపోవడం వల్ల జరుగుతుంది, ఇలా రక్తనాళాల్లో కొవ్వు చేరడాన్ని ఆథిరోస్క్లెరోసిస్ అంటారు.


లక్షణాలు


ఆంజీనా అంటే గుండెలో నొప్పి రావడం లేదా అసౌకర్యంగా ఉండడం. కొన్ని సార్లు భుజం, భుజాల మధ్య, మోచేతులు, మెడ నుంచి దవడకు వ్యాపిస్తున్నట్టు కూడా నొప్పి వస్తుంది. గుండె రక్తనాళాల వైశాల్యం తగ్గిపోవడం వల్ల గుండెకు రక్త ప్రసరణ తగ్గి గుండెపోటుకు కారణమవుతుంది. తగినంత ఆక్సిజన్ కలిగిన రక్తం ప్రసరించకపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కలుగవచ్చు.


కారణాలు


పొగతాగే అలవాటు


హై బీపీ


కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం


మధుమేహం


స్థూలకాయం


లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం గురించి ఒక అంచనాకు రావచ్చు కానీ పూర్తిగా నిర్ధారించలేము. లిపిడ్ ప్రొఫైల్ గుండెకు సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్లలో ఒక ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈ పరీక్ష ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిసరైడ్ స్థాయిలు తెలుసుకోవచ్చు. వీటి మీదే గుండె ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.


లిపిడ్ ప్రొఫైల్‌లో ముఖ్యమైన అంశాలు:


టోటల్ కొలెస్ట్రాల్ (Total Cholesterol): ఇది మొత్తం రక్తంలోని కొలెస్ట్రాల్ మొత్తాన్ని సూచిస్తుంది. ఎక్కువగా ఉంటే గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.


ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ (LDL - Low-Density Lipoprotein): దీనిని "చెడు కొలెస్ట్రాల్" (bad cholesterol) గా చెప్పవచ్చు. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఆర్టరీల గోడలపై ప్లాక్ ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతాయి. ఈ కారణంతో గుండెపోటు రావచ్చు.


హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ (HDL - High-Density Lipoprotein): ఇదే "మంచి కొలెస్ట్రాల్" (good cholesterol) అంటారు. ఇది అధికంగా ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.


ట్రైగ్లిసరైడ్స్ (Triglycerides): అధికంగా ఉంటే గుండె సమస్యల ప్రమాదాం చాలా ఎక్కువ. ఇది రక్తంలో ఉండే ఫ్యాటీ యాసిడ్లను గురించి తెలియజేస్తుంది.


గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేయడం:


ఎల్‌డిఎల్ అధికంగా ఉండడం: గుండెపోటుకు ప్రధాన కారణం కావచ్చు. దీని వల్ల ప్లాక్‌ కరోనరీ ఆర్టరీల్లో పేరుకుంటుంది. ఫలితంగా  ఆర్టరీలు సంకుచితమవుతాయి.


హెచ్‌డిఎల్ తక్కువగా ఉండడం: రక్తనాళాలలో ప్లాక్ పేరుకోకుండా నివారిస్తుంది. కాబట్టి హెచ్‌డిఎల్ తక్కువగా ఉంటే గుండెపోటు ప్రమాదం ఎక్కువ అని గుర్తించాలి.


ట్రైగ్లిసరైడ్స్ అధికంగా ఉండటం: వీటి సంఖ్య ఎక్కువగా ఉంటే  స్థాయిలో ఉంటే ఇది గుండెపోటు ప్రమాదాన్ని సూచిస్తుంది


లిపిడ్ ప్రొఫైల్ ఫలితాలు మీ గుండె ఆరోగ్యాన్ని తప్పకుండా చెబుతాయి.  కానీ గుండె ఆరోగ్యానికి సంబంధించిన నిర్ధారణల కోసం మాత్రం తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి.  ఇతర రిస్క్ ఫ్యాక్టర్లను కూడా పరిశోధించిన తర్వాత మాత్రమే గుండె ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి.