డ్రగ్స్ కేసులో బెయిల్ కోసం ఎదురుచూస్తోన్న షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు మరోసారి నిరాశే మిగిలింది. బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్న బాంబే హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది.






ఆర్యన్, మున్‌మున్, అర్బాజ్ తరఫు న్యాయవాదులు బెయిల్‌పై తమ వాదనలను కోర్టుకు వినిపించారు. ఎన్‌సీబీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ రేపు వాదనలు వినిపించనున్నారు.


మరో రాత్రి..


ముంబయిలోని ఆర్థర్ రోడ్ సెంట్రల్ జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ మరో రాత్రి అక్కడే గడపనున్నాడు. అయితే ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టులో వాదించారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసే సమయానికి అతనిపై ఎలాంటి అభియోగాలు లేవన్నారు.






మున్‌మున్‌ ధామేచా తరుఫున న్యాయవాది కషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ వాదించారు. ఓ ఫ్యాషన్ మోడల్ అయిన ధామేచా స్టేజ్ షోలు, ర్యాంప్ వాక్‌లు చేస్తుంటారని.. ఇందులో భాగంగానే ఆ రోజు క్రూయిజ్ షిప్‌లో ఒకరు ఆహ్వానిస్తే వెళ్లిందని ఆయన కోర్టుకు వెల్లడించారు.


ఇదీ కేసు..


ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. 


ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు. 


విచారణలో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది.


Also Read: China Land Boundary Law: 'చైనా.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే.. సరిహద్దులో హిస్టరీ రిపీట్ అవుద్ది'


Also Read: WHO ON Covaxin: మళ్లీ అదే కథ.. కొవాగ్జిన్‌ అనుమతిపై మారని డబ్ల్యూహెచ్ఓ తీరు!


Also Read: Aryan Khan Drug Case: డ్రగ్స్ కేసులో కీలక సాక్షిని 4 గంటల పాటు ప్రశ్నించిన ఎన్‌సీబీ!


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు, 585 మరణాలు నమోదు


Also Read: Amarinder Singh New Party: 'కెప్టెన్' సెకండ్ ఇన్నింగ్స్.. పంజాబ్ ఎన్నికల బరిలో కొత్త పార్టీ!


Also Read: Pegasus Spyware Case: 'పెగాసస్‌'పై సుప్రీం కీలక నిర్ణయం.. దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి