దేశంలో కరోనా కేసులు మరోసారి 15 వేలకు దిగువనే నమోదయ్యాయి. కొత్తగా 13,451 కరోనా కేసులు నమోదుకాగా 585 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రోజువారి కేసులు గత 33 రోజులుగా 30 వే కంటే దిగువనే నమోదవుతున్నాయి. గత 122 రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు వస్తున్నాయి.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.48గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 98.19గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.
- మొత్తం కేసుల సంఖ్య: 3,42,15,653
- యాక్టివ్ కేసులు: 1,62,661
- మొత్తం రికవరీల: 3,35,97,339
- మొత్తం మరణాలు: 4,55,653
- మొత్తం వ్యాక్సినేషన్: 1,03,53,25,577 (నిన్న 55,89,124)
కేరళ..
కేరళలో కొత్తగా 7,163 కరోనా కేసులు నమోదుకాగా 482 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 49,19,952కు పెరిగింది. మొత్త మరణాల సంఖ్య 29,355కు చేరింది. గత 24 గంటల్లో 79,122 శాంపిళ్లను పరీక్షించారు.
మొత్తం 14 జిల్లాల్లో త్రిస్సూర్‌లో అత్యధికంగా 974 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో తిరువనంతపురం (808), కొట్టాయం (762) ఉన్నాయి.
Also Read: Amarinder Singh New Party: 'కెప్టెన్' సెకండ్ ఇన్నింగ్స్.. పంజాబ్ ఎన్నికల బరిలో కొత్త పార్టీ!
Also Read: Pegasus Spyware Case: 'పెగాసస్'పై సుప్రీం కీలక నిర్ణయం.. దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి