అక్కినేని నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత జోరు పెంచింది. ఆ బాధ నుంచి బయటపడేందుకు సమంత ఎక్కువ సేపు స్నేహితులతో గడిపేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల సమంత తన స్నేహితురాలితో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించింది. ఉత్తరాఖండ్‌లోని చార్‌దమ్ యాత్రలో భాగంగా సమంత మహర్షి మహేష్ యోగి ఆశ్రమంకు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ పోస్ట్‌కు ‘ఫ్యాన్ గర్ల్ ఫర్ ఎవర్’ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించింది. అలానే ఆశ్రమంలో ఉన్న బీటిల్స్ గ్రూప్ ఫోటోలను షేర్ చేసింది సామ్. 


ట్రిప్ నుంచి రాగానే సినిమా షూటింగ్‌ల్లో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా తన స్టైలిష్ ప్రీతమ్ జుకాల్కర్, మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్‌తో కలిసి తీసుకున్న ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌గా పోస్ట్ చేసింది. వారితో కలిసి విదేశాలకు వెళ్తున్నానని సమంత పేర్కొంది. సామ్-చైతూలు విడిపోయిన తర్వాత ఎన్నో వదంతలు షికారు చేశాయి. ఈ సందర్భంగా ప్రీతమ్‌తో ఉన్న స్నేహాన్ని కూడా మీడియా, సోషల్ మీడియా తప్పుబట్టాయి.


ప్రీతమ్ జుకల్కర్ సమంతకు స్టైలిష్ మాత్రమే కాదు.. మంచి స్నేహితుడు కూడా. ఆమె కెరీర్‌లో పైకి రావడానికి సహకరించిన వ్యక్తుల్లో అతడు కూడా ఒక్కడు. అయితే, ఈ బంధాన్ని చాలా తప్పుగా భావిస్తూ విమర్శలు చేశారు. వాస్తవానికి జుకల్కర్ ఆమెను ‘అక్క’ అని పిలుస్తాడు. అందుకే వారు చనువుగా ఉంటారు. కొద్ది నెలల కిందట సమంత అతడి ఒడిలో కాళ్లు పెట్టుకుని తీసుకున్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో చాలామంది ఆమెను ట్రోల్ చేశారు. అక్కినేని ఇంటి కోడలై ఉండి అలా చేస్తావా అంటూ నెగటివ్ కామెంట్లు చేయడంతో ఆమె ఆ పోస్టును డిలీట్ చేయాల్సి వచ్చింది.   
 
ఇటీవల ప్రీతమ్ బర్త్ డే సందర్భంగా ఈ క్రమంలో సమంత చెప్పిన విషెస్ వైరల్ అయ్యాయి. ‘‘హ్యాపీ బర్త్ డే మై ప్రీతమ్ జుకల్కర్.. నా జీవితంలో నువ్వు ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాతో పాటు వచ్చినందుకు థ్యాంక్స్. ఐ లవ్యూ సో మచ్’’ అని సమంత పేర్కొంది. ఇందుకు ప్రీతమ్ స్పందిస్తూ.. ‘‘థాంక్యూ సో మచ్ జీజీ’’ అని రిప్లై ఇచ్చాడు. అయితే, జీజీ అంటే హిందీలో ‘అక్క’ అని అర్థం. కానీ, దానికి అర్థం తెలియనివారు అప్పటికే ఆమెపై నెగటీవ్ కామెంట్లతో ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టారు. 


నాగ చైతన్యతో పోల్చితే.. సమంతా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. ఏ విషయాన్ని దాచకుండా ధైర్యంగా పోస్టులు పెడుతుంది. చైతూతో పోల్చితే ఫాలోవర్లు కూడా ఆమెకే ఎక్కువ. దీంతో అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొనేది కూడా ఆమెనే. విడాకుల తర్వాత కూడా చాలామంది సమంతనే ట్రోల్ చేశారు. చివరికి ఆమె విసుగుపోయి.. తనని డిస్ట్రబ్ చేయొద్దని కూడా పోస్ట్ పెట్టింది. తాజాగా సమంత హైదరాబాద్ కూకట్ పల్లిలోని న్యాయస్థానంలో తన వ్యక్తిగత విషయాలపై తప్పుడు ప్రచారం చేసిన మూడు యూట్యూబ్ చానెళ్లు, ఓ న్యాయవాదిపై పరువు నష్టం దావా వేసింది. ఈ కేసు విచారించిన కోర్టు.. సమంత వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రసారం చేయకూడదని, యూట్యూబ్‌ ఛానల్స్‌లో ఆమెకి సంబంధించిన వీడియోలను తొలగించాలని ఆదేశించింది. సమంత కూడా తన వ్యక్తిగత వివరాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం మానుకోవాలని సూచించింది. 


Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
Also Read: బస్ డ్రైవర్ నుండి బాలచందర్ వరకూ... తమిళ ప్రజలనూ... రజనీకాంత్ ఎవ్వర్నీ మరువలేదు!
Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి