టీఆర్ఎస్ ప్లీనరీ విజయవంతమైందని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఒక్కరుగా ఉద్యమం మొదలు పెట్టి 33 పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక సీఎంగా 33 జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. ప్లీనరీ సక్సెస్ తో ప్రతిపక్షాలకు కడుపు మంటగా ఉందని అందుకే అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలపై అధ్యయనం చేసేందుకు వేరే రాష్ట్రాల అధికారులు వస్తున్నారని తెలిపారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి పథకాలు ఎందుకు అమలుచేయడంలేదని ప్రశ్నించారు. ఏడేళ్ల పసికూన తెలంగాణ దేశం గర్వపడేలా అభివృద్ధి సాధిస్తోందన్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు తమకు కావాలని ఆంధ్రా సహా అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అణగారిన వర్గాల కోసం పాటుపడుతుందన్నారు. 


Also Read: కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు.... అభివృద్ధికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్.. ప్లీనరీలో మంత్రి కేటీఆర్ కామెంట్స్


ప్లీనరీ సొంత వ్యవహారం


సీఎ కేసీఆర్ బీసీ జన గణన అడినందుకే బీజేపీ, కాంగ్రెస్ లకు కడుపుమంట అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ జనగణనతో వెనక బడిన వర్గాలు అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్, బీజేపీ లకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు మేలు జరుగుందన్నారు. ప్లీనరీ తమ సొంత వ్యవహారమన్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికపై కూడా తాము మాట్లాడుతున్నామా అని ప్రశ్నించారు. ఓర్వలేనితనంతో కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శిస్తున్నారు. మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేటీఆర్ సమర్ధుడు కనుకే ఆయన్ను ఫ్రాన్స్ దేశం ఆహ్వానించిందన్నారు. దళిత బంధును చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారన్నారు. ఎన్నికలే ప్రజాస్వామ్యానికి కొలమానమన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నందుకు ప్రతిపక్షాలకు ప్రత్యర్థులకు కడుపు మంట అన్నారు. 


Also Read: ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !


త్వరలోనే ఉద్యోగ నియామక ప్రక్రియ


ప్లీనరీతో టీఆర్ఎస్ మరో ఇరవై ఏండ్ల పాటు అధికారంలో ఉంటుందన్న భరోసా కలిగిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చైనాలో కూడా సాధ్యం కానీ రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంతో పూర్తి చేసిన నేత కేసీఆర్ అని మంత్రి అన్నారు. తెలంగాణ తల్లిని గుర్తించని వారికి తెలంగాణ తల్లితో ఏం పని అని విమర్శించారు. బహిరంగ చర్చతో కాదు ఎన్నికల్లో తేల్చుకోవడమే రాజకీయ పార్టీలకు ముఖ్యమన్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 24 గంటల కరెంటు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, ఆసరా పెన్షన్ల పెంపు, జర్నలిస్టులు, న్యాయవాదులకు సంక్షేమ నిధి ఏర్పాటు అవాస్తవాలా అని ప్రశ్నించారు. ఉద్యోగ నియమాకాలపై త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. 


Also Read: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.... జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి