ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 33,944 పరీక్షలు నిర్వహించారు. వీరిలో 415 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,356కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 584 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,45,276 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 4,655 యాక్టివ్‌ కేసులున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. 






Also Read: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?


రాష్ట్రంలో 4,655 యాక్టివ్ కేసులు


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,64,287కి చేరింది. వీరిలో 20,45,276 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 584 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 4,655 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,356కు చేరింది. సోమవారం కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2,93,25,840 నమూనాలను పరీక్షించారు. 


Also Read: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం.. దరఖాస్తు చేసుకున్నాక ఎప్పటిలోగా వస్తాయంటే..


తెలంగాణ మళ్లీ పెరుగుతున్న కేసులు


తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా కోలుకున్న వారికన్నా కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 41,388 నమూనాలు పరీక్షించగా 190 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ 6,70,643 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌ లో ఈ వివరాలు తెలిపింది. 24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,950కు చేరుకుంది. ఒక్కరోజు వ్యవధిలో 111 మంది కోలుకున్నారని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,101 యాక్టివ్‌ కేసులున్నట్లు పేర్కొంది. 


దేశంలో కరోనా కేసులు


దేశంలో గడిచిన 24 గంటల్లో 11,31,826 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 12,428 మందికి పాజిటివ్‌గా తేలింది. 356 మంది కరోనాతో మృతి చెందారు.  తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,42,02,202కి పెరిగింది. మొత్తం 3,35,83,3018 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,55,068 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,63,816 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తగ్గింది. కిందటి సంవత్సరం మార్చి తర్వాత అత్యల్పంగా 889 కొత్త కేసులు వెలుగుచూశాయి. కేరళలో ఆరు వేల మందికి పైగా వైరస్ సోకింది. నిన్న 15,951 మంది కోలుకోగా.. ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3.35 కోట్లకు చేరింది. ప్రస్తుతం కొవిడ్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 1.63 లక్షలుగా ఉంది.


Also Read: భారత్ లో తగ్గిన కొవిడ్ కేసులు.. మధ్యప్రదేశ్ లో కొత్తరకం కరోనా వైరస్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి