ముంబయి డ్రగ్స్ కేసులో కీలక సాక్షిగా ఉన్న ప్రభాకర్ సాలీని ఎన్‌సీబీ అధికారులు నిన్న అర్ధరాత్రి వరకు విచారించారు. దాదాపు 4 గంటల పాటు అతడ్ని ప్రశ్నించారు అధికారులు.
విచారణ అనంతరం ప్రభాకర్ సాలీ వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేసినట్లు సమాచారం. అతడు చెప్పిన సమాచారం మేరకు తదుపరి దర్యాప్తును అధికారులు కొనసాగిస్తున్నారు.
కిరణ్ గోసవీ బాడీగార్డ్ అయిన ప్రభాకర్ సాలీ ఇటీవల ఎన్‌సీబీ సీనియర్ అధికారి సమీర్ వాంఖడేపై సంచలన ఆరోపణలు చేశారు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను విడిచిపెట్టేందుకు వాంఖడే రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించాడు. ఆ తర్వాత ఎన్‌సీబీ అధికారులు ప్రభాకర్‌ను ప్రశ్నించేందుకు ఇటీవల సమన్లు జారీ చేశారు.
ఇదీ కేసు..
ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు.
విచారణలో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు, 585 మరణాలు నమోదు
Also Read: Amarinder Singh New Party: 'కెప్టెన్' సెకండ్ ఇన్నింగ్స్.. పంజాబ్ ఎన్నికల బరిలో కొత్త పార్టీ!
Also Read: Pegasus Spyware Case: 'పెగాసస్'పై సుప్రీం కీలక నిర్ణయం.. దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి