పిల్లలకు పేర్లు పెట్టేందుకు తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో తెలిసిందే. జన్మరాశులు, నక్షత్రాలు, రోజులకు తగినట్లుగా పేరు పెట్టడమంటే మాటలు కాదు. అయితే, ఇటీవల పిల్లలకు పెద్దల పేర్లు పెట్టడం మానేసి నోరు తిరగని సరికొత్త పేర్లను పెడుతున్నారు. ఇతర దేశాల నుంచి కూడా కొన్ని పేర్లను అరువు తీసుకుంటున్నారు. అయితే, ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి.. పేరు కోసం తంటాలు పడటం నా వల్ల కాదంటూ.. తన కొడుకు వింత పేరు పెట్టాడు. ABCDEFGHIJK Zuzu (ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్ఐజేకే జూజు)గా నామకరణం చేశాడు. ఔనండి.. నిజం. మొదట్లో స్కూల్ నిర్వాహకులు కూడా ఇది జోకేమో అనుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ చూపించిన తర్వాతే నమ్మారు.  


ఇండోనేషియాలోని సౌత్ సుమత్రా ప్రావిన్స్‌లోని మురా ఎనిన్‌లో ఇటీవల స్కూల్ పిల్లలకు కరోనావైరస్ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా అధికారులు ఓ బాలుడి పేరు చూసి ఆశ్చర్యపోయారు. 12 ఏళ్ల ఆ బాలుడి పేరు ABCDEFGHIJK Zuzu అని తెలుసుకుని షాకయ్యారు. ఆ పిల్లాడు జోకేస్తున్నాడేమో అని అధికారులు తొలత భావించారట. అతడి తండ్రికి ఫోన్ చేయగా.. అసలు విషయం తెలిసింది.  


జూజు స్కూల్ ఐడెంటీ కార్డుపైన, అతడి స్కూల్ యూనిఫామ్ ట్యాగ్ కూడా ABCDEFGHIK Zuzu అనే ఉంది. అతడి తండ్రికి క్రాస్‌వర్డ్ పజిల్స్‌పై ఉన్న అభిమానం వల్లే తన కొడుకుకు ఆ పేరు పెట్టాడట. అంతేగాక, అతడికి రచయిత కావాలనే కోరిక బాగా ఉండేదని, అక్షరాలపై ఉన్న మమకారంతో అతడు తన అబ్బాయికి ఆ పేరు పెట్టాడని బంధువులు అంటున్నారు. అయితే, జూజు అనేది మాత్రం అతడి తల్లిదండ్రుల పేర్ల నుంచే వచ్చింది. తండ్రి జు, తల్లి జుల్ఫామీ పేర్లలోని ముందు అక్షరాలను అతడి పేరులో చేర్చారు. దీంతో అంతా జూజు అని పిలుస్తున్నారు. కేవలం ABCDEFGHIK అనే మాత్రమే పెట్టి ఉంటే.. మాత్రం అతడి పేరు పిలిచేందుకు నానా తంటాలు పడేవారు. అయితే, జూజు పేరును K వరకు మాత్రమే ఎందుకు పెట్టాడనేగా మీ సందేహం? దానికి కూడా ఒక షాకింగ్ కారణం ఉంది. తనకు తర్వాత పుట్టిన పిల్లలకు NOPQ RSTUV, WXYZ అని పేరు పెట్టాలని అనుకున్నాడు. మళ్లీ ఏమనుకున్నాడో ఏమో..  వారికి అమ్మర్, అత్తూర్ అనే సాధారణ పేర్లను పెట్టి బతికించాడు. 


 


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి