Chandrayaan 3 Launch Live: జాబిల్లి దిశగా ప్రయాణం మొదలు, భూ కక్ష్యలోకి విజయవంతంగా చంద్రయాన్ 3 - ఇస్రో ఛైర్మన్ ప్రకటన

Chandrayaan 3 Launch Live: చంద్రయాన్‌-3 ప్రయోగంతో అద్భుతాలు సృష్టించడానికి ఇస్రో సిద్ధమైంది. ఆ అద్భుతాలు చూసేందుకు మీరు సిద్దమా? క్షణక్షణం అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABP Desam Last Updated: 14 Jul 2023 03:56 PM
రాష్ట్రపతి ప్రశంసలు

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అవడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. నిర్విరామంగా కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. 





ప్రధాని ప్రశంసలు

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రోకి అభినందనలు తెలిపారు. భారత దేశ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైందని ప్రశంసించారు.





Chandrayaan 3 Update: భూ కక్ష్యలోకి విజయవంతంగా చంద్రయాన్ 3 - ఇస్రో ప్రకటన

చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. చంద్రయాన్ 3 ని ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామని తెలిపారు.

దశల వారీగా ప్రయోగం

ఈ ప్రయోగానికి సంబంధించిన మూడు దశలూ పూర్తయ్యాయి. ప్రపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయింది. 

విజయవంతంగా లాంఛ్

చంద్రయాన్ 3 రాకెట్‌ని విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది. 

Chandrayaan 3 Live: చంద్రయాన్ 3 ప్రయోగం లైవ్‌లో ఇక్కడ చూడండి

నెల్లూరు శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ - 3 ప్రయోగాన్ని లైవ్ లో వీక్షించండి.


Chandrayaan 3 Live: చంద్రయాన్ 3 ప్రయోగం లైవ్‌లో ఇక్కడ చూడండి

నెల్లూరు శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్ - 3 ప్రయోగాన్ని లైవ్ లో వీక్షించండి.


ల్యాండర్‌ "విక్రమ్‌"

చంద్రయాన్ 3 ల్యాండర్‌కి విక్రమ్‌ అని, రోవర్‌కి ప్రగ్యాన్‌ అని పేరు పెట్టింది ఇస్రో. 

ప్రధాని మోదీ విషెస్

భారత దేశ అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్ 3 మిషన్ ఓ సువర్ణాధ్యాయం అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మన దేశ ఆశల్ని,ఆకాంక్షల్ని ఇది మోసుకెళ్తోందని అన్నారు. 





ఆ పావుగంటలోనే తేలిపోతుంది

చంద్రయాన్ 3 మిషన్‌లో చంద్రుడిపై దిగబోయే ఆ చివరి పావుగంట చాలా కీలకమంటున్నారు సైంటిస్ట్‌లు. ఆ 15 నిముషాలు ఎందుకంత కీలకమో ఈ కథనం చదివి తెలుసుకోండి. 

లూనార్ డే మిషన్

చంద్రయాన్ 3 మిషన్ లైఫ్ ఒక లూనార్ డే. అంటే మన భూమిపై 14 రోజులతో సమానం. 

యూపీ పోలీస్ విషెస్

యూపీ పోలీసులు చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ అవ్వాలని ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. స్పెషల్ ట్వీట్‌తో విష్ చేశారు. 





గోద్రేజ్ ఏరోస్పేస్ ఇంజిన్‌లు

ఈ చంద్రయాన్ 3 మిషన్‌లో గోద్రేజ్ ఏరోస్పేస్‌ కీలక సాయం అందించింది. చంద్రయాన్‌ 3ని తీసుకెళ్లే రాకెట్‌కి వినియోగించిన ఇంజన్‌లను గోద్రేజ్ ఏరోస్పేస్ తయారు చేసింది. 

సాఫ్ట్ ల్యాండింగ్ కీలకం

చంద్రుడి సౌత్‌పోల్‌పై సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడమే ఈ మిషన్‌లో కీలకం. ఆ తరవాత చంద్రుడిపై తిరుగుతూ అక్కడి గుట్టుని పసిగట్టి భూమికి పంపుతుంది. 

3.84 లక్షల కిలోమీటర్ల దూరం

భూమి నుంచి చంద్రుడికి ఉన్న 3.84 లక్షల కిలోమీటర్ల దూరాన్ని చేరుకోడానికి చంద్రయాన్‌ 3 కి 40 రోజుల సమయం పడుతుంది. గంటకు 36 వేల కిలోమీటర్ల వేగంతో రాకెట్ దూసుకెళ్తుంది.  

ఆగష్టు 23న చంద్రుడిపైకి!

లాంఛింగ్ అయ్యాక చంద్రయాన్ 3 భూకక్ష్యలోకి చేరుకుంటుంది. అక్కడి నుంచి మెల్లగా చంద్రుడి వైపు కదులుతుంది. ఆగస్టు 23 నాటికి ఇది చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. 

మధ్యాహ్నం 2.35 కి లాంఛింగ్

మధ్యాహ్నం 2.35 నిముషాలకు చంద్రయాన్ 3 మిషన్ లాంఛ్ కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

చంద్రుడిపై ల్యాండర్ దింపే సత్తా ఇస్రోకు ఉంది, చరిత్ర సృష్టిస్తుంది- నంబి నారాయణ్ ధీమా!

చంద్రయాన్ 3పై ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్ ధీమా వ్యక్తం చేశారు. భారత్ చరిత్ర సృష్టిస్తుందన్నారు. చంద్రుడిపై ల్యాండర్ దింపే సామర్థ్యం ఇస్రోకు ఉందని... భారత్ ఆ ఘనత సాధించిన నాలుగోదేశంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Background

Chandrayaan 3 Launch Live: ఇస్రోకే కాదు దేశ చరిత్రలోనే బిగ్‌డే. ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చంద్రయాన్-3 జాబిలిని ముద్దాడేందుకు సిద్ధమైంది. ఇస్రో చేస్తున్న ఈ ప్రయోగం దేశ ప్రజలకే యావత్‌ ప్రపంచం ఎంతగానో ఆసక్తిగా గమనిస్తోంది. ఎల్‌వీఎం3-ఎం4 ద్వారా ఈ ప్రయోగం మధ్యాహ్నం 2.35కి జరగనుంది. 


ప్రతిష్టాత్మంగా తీసుకున్న ఈ ప్రయోగానికి గురువారం కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. తొలిసారిగా చంద్రుడికి ఆవల వైపు ల్యాండర్‌, రోవర్‌లను పంపనున్నారు. అందుకే యావత్ ప్రపంచం ఇస్రో ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. మంచి ఉత్సాహం మీద ఉన్న ఇస్రో మాత్రం కచ్చితంగా ఈ ప్రయోగం విజయం సాధిస్తుందన్న నమ్మతం ఉంది.  2019 జులై15 చంద్రయాన్‌-2 ప్రయోగం చేసి ఇస్రో విపలమైంది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మాత్రం పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు. 


చంద్రుని వద్ద ఉన్న మరిన్ని రహస్యాలను ఛేదించేందుకే ఈ ప్రయానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. చంద్రయాన్-3లో ప్రొపల్షన్ మాడ్యూల్‌ 2,145 కిలోలు, ల్యాండర్‌ 1,749 కిలోలు, రోవర్‌ 26 కిలోలు ఉంటాయి. టోటల్‌గా దీని బరువు 3,920గా చెబుతున్నారు. ఈసారి కేవలం ఆరు పేలోడ్స్‌ను మాత్రమే పంపుతున్నారు. ఇందులో ఒక ఇస్రో పేలోడ్‌ ఉంది. 
చాలా దేశాలు చంద్రునిపై పరిశోధనలు చేశారు కానీ ఎవరూ దక్షిణ ధ్రవం వైపు వెళ్లలేదు. ఇస్రో మాత్రం దక్షిణ ధ్రువంవైపు ఫోకస్ పెట్టింది. అందుకే చంద్రయాన్ -1 ను ప్రయోగించింది. ఇప్పుడు చంద్రయాన్‌-3ని కూడా అక్కడేకే పంపిస్తోంది. చంద్రయాన్‌–3 ల్యాండర్‌ను చంద్రుని చీకటి ప్రాంతంలో దించనున్నారు. 


మిషన్ లక్ష్యాలేంటి..?
1. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌గా ల్యాండ్ అయ్యేలా చేయడం
2. రోవర్‌ సరైన విధంగా చంద్రుడిపై తిరిగేలా చేయడం
3.సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్‌ 


ప్రముఖుల శుభాకాంక్షలు


ఇస్రో టీంకు ముఖ్యమంత్రి జగన్ ఆల్‌ది బెస్ట్ చెప్పారు. 


 






నాసా ఆర్టెమిస్ మిషన్‌కి ఇస్రో చంద్రయాన్ పోటీనా..?


 


ఆర్టెమిస్ ప్రోగ్రాం లక్ష్యం చంద్రుడి మీదకు మనుషులు పంపించటం..చంద్రుడిని ఓ గేట్ వే టూ ది స్పేస్ గా తయారు చేయటం. అంటే భవిష్యత్తులో మనుషులు చేసే ప్రయోగాలకు భూమి కాకుండా చంద్రుడిని హాల్ట్ పాయింట్ గా మార్చటం. ఫైనల్ టార్గెట్ మిషన్ టూ మార్స్. మిషన్ టూ మార్స్ గురించి తర్వాత వీడియోల్లో చెప్పుకుందాం. ఆర్టెమిస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 


 2022 నవంబర్ లో ఆర్టెమిస్ 1 ప్రయోగం జరిగింది. SLS రాకెట్ ద్వారా ఓరియాన్ క్యాప్య్సూల్ ను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టారు. అది చంద్రుడు చుట్టూ తిరుగుతూ అనేక ఫోటోలు విలువైన ఇన్ఫర్మేషన్ సేకరించి తిరిగి భూమి మీదకు వచ్చింది. ఆర్టెమిస్ 2 లో నలుగురు ఆస్ట్రోనాట్స్ ను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెడతారు. చంద్రుడి చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేసి మళ్లీ వీళ్లు కూడా భూమి మీదకు తిరిగి వచ్చేస్తారు. ఈ ఆర్టెమిస్ 2 ను 2024లో అంటే నెక్ట్స్ ఇయర్ ప్రయోగించాలని నాసా ప్లాన్. ఇక ఆర్టెమిస్ 3 లో మనుషులు చంద్రుడి కక్ష్యలో తిరిగి వచ్చే యటం కాదు...చంద్రుడి మీద ల్యాండ్ అవుతారు...దాదాపు యాభై మూడేళ్ల తర్వాత..ఇది 2025లో చేయాలని నాసా ప్లాన్. ఆర్టెమిస్ 4 కూడా ప్లాన్ చేశారు దీంట్లో చంద్రుడి చుట్టూ లూనార్ గేట్ వే పేరుతో ఓ స్పేస్ స్టేషన్ తిరిగేలా ప్లాన్ చేశారు. ఇది 2028లో చేస్తారు. 


సో మొత్తం దశల వారీగా మనుషులను చంద్రుడి మీద దింపాలి..చంద్రుడి  చుట్టూ తిరిగేలా ఓ స్పేస్ స్టేషన్ ను నిర్మించాలి. సో దట్ అది చంద్రుడి మీద రాకపోకలకు ఓ కేంద్రంగా పనిచేస్తుంది. క్లియర్ కదా.



ఇప్పుడు చంద్రయాన్ గురించి మాట్లాడుకుందాం
 


మన ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ నాలుగు దశల్లో ప్లాన్ చేశారు. మొదటి దశ లో చంద్రయాన్ 1 ను ప్రయోగించారు. 2008లో చంద్రయాన్ 1 ప్రయోగం జరిగింది. ఓ ఇంపాక్టర్ ప్రోబ్ చంద్రుడి మీద ఖనిజాలు ఏం ఉన్నాయో మ్యాప్ రెడీ చేసింది. దీన్నే మూన్ మినరాలజీ మ్యాపింగ్ అంటారు. సో దీని ద్వారా చంద్రుడి మీద వాటర్ కంటెంట్ ఉండేందుకు అవకాశం ఉందని చెప్పింది ఇస్రోనే.



ఫేజ్ 2 : సాఫ్ట్ ల్యాండర్స్ అండ్ రోవర్స్ ని చంద్రుడి మీద ఇస్రో ప్రయోగిస్తోంది. అందులో భాగంగానే 2019లో చంద్రయాన్ 2 ను ప్రయోగించారు. చంద్రుడి మీద ఓ ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి అందులో నుంచి ఓ రోవర్ ను బయటకు తీసుకువచ్చి చంద్రుడి సౌత్ పోల్ మీద ప్రయోగాలు చేయాలని. కానీ ఇది ఫెయిల్ అయ్యింది. అందుకే ఇదే పనిని మళ్లీ చేయటానికి 2023 జులై 13న మళ్లీ చంద్రయాన్ 3 ప్రయోగం చేస్తోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. లాంఛ్ వెహికల్ మార్క్ 3 M4 ద్వారా చంద్రుడి మీద ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి రోవర్ ను నడిపించాలనేది ప్రస్తుతం నాసా ముందున్న లక్ష్యం



ఫేజ్ 3 : చంద్రుడి మీద శాంపుల్స్ ను కలెక్ట్ చేయటం. 2025లో చంద్రయాన్ 4 ప్రయోగం ద్వారా చంద్రుడి పై రాత్రి సమయాల్లో బతికేందుకు అవకాశాలు ఎంత వరకూ ఏంటీ..లాంటివి శాంపుల్స్ కలెక్ట్ చేయటం చంద్రయాన్ 4 టార్గెట్.



ఫేజ్ 3 లోనే చంద్రయాన్ 5 ప్రయోగం కూడా చేయాలనేది ప్లాన్. ఇది 2025-30ల మధ్యలో చేయాలనేది ఇస్రో టార్గెట్. చంద్రుడి మీద ఒకటి నుంచి ఒకటిన్నర మీటర్ల లోతుకు డ్రిల్లింగ్ చేసి శాంపుల్స్ టెస్ట్ చేయాలనేది మిషన్.



ఇక ఫేజ్ 4 : ఫేజ్ 4 లో భాగంగా 2030-35 మధ్యలో చంద్రయాన్ 6 ను ప్రయోగించి ఈ సేకరించిన శాంపుల్స్ ను భూమి మీదకు తిరిగి తీసుకువచ్చే ప్రక్రియ అన్న మాట. 



సో నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్ లో 4 ఆర్టెమిస్ ప్రయోగాలు జరిగితే..ఇస్రో చంద్రయాన్ మిషన్ లో ఆరు చంద్రయాన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆర్టెమిస్ టార్గెట్ అంతా చంద్రుడి మీద హాల్ట్ పాయింట్స్ ఏర్పాటు, స్పేస్ స్టేషన్ ఏర్పాటు...అక్కడి నుంచి మార్స్ మీదకు ప్రయాణం చేసేందుకు అవకాశాలును ఏర్పాటు చేసేది అయితే...ఇస్రో చేస్తున్న చంద్రయాన్ అంతా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దిశగా సాగుతోంది. ఆర్టెమిస్ కమర్షియల్ ప్రోగ్రాం. చంద్రయాన్ కూడా కమర్షియలే అయినా రీసెర్చ్ ఓరియెంటెడ్. ఆర్టెమిస్ లో నాసా తో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ లాంటి దేశాలతో పాటు భారత్ లాంటి దేశాలు కూడా ఆర్టెమిస్ అకార్డ్స్ గా ఉన్నాయి. ఇస్రో మాత్రం జపాన్ స్పేస్ ఏజెన్సీ జాక్సా సహాయాన్ని మాత్రమే చంద్రయాన్ ప్రయోగాల కోసం తీసుకుంటుంది. సో ఇవి చంద్రుడి మీద ప్రయోగాలు చేస్తున్న నాసా, ఇస్రో మిషన్ ల కథ.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.