NTR Nagar: జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!

Andhra Pradesh: సెంటు స్థలాల కాలనీల పేర్లను ఎన్టీఆర్ నగర్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు వైఎస్సార్ -జగనన్న కాలనీలు అని పేరు పెట్టారు.

Continues below advertisement

AP government has issued orders changing the names of colonies of cent places to NTR Nagar : ఆంధ్రప్రదేశ్‌లో ఇక వైఎస్ఆర్‌ జగననన్న పేరుతో ఉన్న కాలనీల పేర్లు మార్చేశారు. PMAY- ఎన్టీఆర్ నగర్‌లుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు . ఇప్పటి వరకూ ఈ కాలనీలకు..  వైఎస్ఆర్, జగనన్న కాలనీలు అనే పేర్లు ఉండేవి. తాము కాలనీలను కాదని ఊళ్లను నిర్మిస్తున్నామని జగన చెప్పేవారు. అందుకే తమ పేరు పెట్టుకున్నామనేవారు. అయితే ప్రభుత్వం మారగానే ఆ కాలనీల పేర్లు మార్చేసింది. ఈ కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లు అన్నీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మిస్తున్నవే. స్థలం మాత్రం ప్రభుత్వం కేటాయించింది. అందుకే PMAY- ఎన్టీఆర్ నగర్‌లుగా వచ్చారు. 

Continues below advertisement

టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణం - వైసీపీ సర్కార్ సెంటర్ స్థలాల కాలనీల నిర్మాణం 

గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిడ్కో ఇళ్లను నిర్మించేది. అపార్టుమెంట్లను నిర్మించేవారు. అయితే అపార్టుమెంట్లలో ఉండలేరని తాము వస్తే ఇళ్లను నిర్మించి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత  సెంట్ స్థలాల్లో ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. సెంట్ స్థలంలో ఇళ్లు అతి చిన్నవని  ఉండటానికి పనికిరానివని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం ముందుకెళ్లింది. పెద్ద ఎత్తున భూములు లేని చోట కొనుగోలుచేసింది.    71,811 ఎకరాల్లో 31.19 లక్షల మందికి పంపిణీ చేసినట్లుగా గత ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాటిలో అత్యధిక ఇల్ల నిర్మాణం  ప్రారంభం కాలేదదు.             

Also Read: ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!

పది లక్షల లక్షల నిర్మాణం అయ్యాయని గత ప్రభుత్వం చెప్పింది. స్థలం మాత్రమే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షల బిల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పిస్తామని చెప్పి నిర్మాణాలు చేసుకోవాలని సలహా ఇచ్చింది. అయితే ఆ సొమ్ముకు ఇంటి పునాదాలు కూడా రావన్న అభిప్రాయంతో ఎక్కువ మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదు. ఇప్పటికీ కొన్ని లక్షల మంది సెంటు స్థలాలను రిజిస్టర్ చేసుకోలేదని చెబుతున్నారు. సెంట్ స్థలాలు ఊరికి దూరంగా ఉండటం..  రోడ్లు, డ్రైనేజీ సహా ఇతర సదుపాయాలు లేకపోవడంతో ఎవరూ ఉండటానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.         

పేరు మార్పుతో పాటు కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం 

ఇప్పుడు ప్రభుత్వం ఈ కాలనీల పేరు మార్చడంతో పాటు...గౌరవప్రదమైన ఇంటిని ఇచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంది.లబ్దిదారులతో అభిప్రాయసేకరణ జరిపి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వం పక్కన పడేసిన టిడ్కో ఇళ్లను.. ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుని పూర్తి చేస్తోంది. 

Also Read: అతుల్ సుభాష్‌లా ఆత్మహత్య చేసుకుంటేనే స్పందిస్తారా ? తన సోదరుడి దుస్థితిపై తెలుగు యువతి ఆవేదన - ఈ ప్రశ్నకు బదులేది?

Continues below advertisement