PM Modi Podcast : ఇప్పటివరకూ మన్ కీ బాత్ లో తన గొంతుకను వినిపించిన భారత ప్రధాని మోదీ.. ఇప్పుడు పాడ్ కాస్ట్ వరల్డ్ లోకి అడుగుపెట్టారు. జెరోధా సీఈవో నిఖిల్ కామత్ హోస్ట్ గా నిర్వహించిన ఈ షోలో.. మోదీ కీలక విషయాలు పంచుకున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ మోదీ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయగా.. ఇప్పుడది వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్ అనే పేరుతో జెరోధా సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ పాడ్ కాస్టర్ నిఖిల్ కామత్ నిర్వహించే ఈ పాడ్ కాస్ట్ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ లో ప్రధాని నరేంద్ర మోదీ పలు విషయాలపై మాట్లాడారు. రాజకీయాలు, వ్యవస్థాపకత, నాయకత్వ సవాళ్లు వంటి అనేక కీలక విషయాలను చర్చించారు. ఈ వీడియోలో ఒక ప్రధానిని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే చాలా కంగారుగా ఉంది అని నిఖిల్ కామల్ అనగా.. దీనికి సమాధానంగా ఇదే నా తొలి పాడ్ కాస్ట్. ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారో తెలియదు అంటూ ప్రధాని అనడంతో ఇద్దరూ నవ్వారు.


నేనూ మనిషినే.. దేవుణ్ణి కాదు


ఈ ఇంటర్వ్యూ ప్రధాని మోదీని నిఖిల్ కామత్ అనేక రాజకీయ ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరు ఎలాంటి సూచనలిస్తారు అన్న ప్రశ్నకు బదులుగా.. రాజనీతి కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందని, ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో వారు రావాలని, సొంత అవసరాలు తీర్చుకోవడం, నేరవేర్చుకోవడం కోసం రాకూడదని మోదీ చెప్పారు. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని, కేవలం ఆశయంతో కాకుండా ఒక మిషన్ తో రావాలని చెప్పారు. ఇక ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపైనా సమాధామిచ్చారు. అప్పుడు నేను ఏదో అని ఉంటాను. పొరపాట్లు జరుగుతుంటాయి. నేనూ మనిషినే కదా.. దేవుణ్ణి కాదు కదా అని మోదీ వ్యాఖ్యానించారు. దాంతో ఆయన రెండు సార్లు ప్రధానిగా తన అనుభవాలను పంచుకున్నారు.


వీడియో షేర్ చేసిన ప్రధాని


ఈ పాడ్ కాస్ట్ ట్రైలర్ వీడియోను ప్రధాని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఇంటర్వ్యూను మీరంతా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని క్వాప్షన్ లో రాశారు. ప్రస్తుతానికి ఈ ఇంటర్వ్యూ ట్రైలర్ ను మాత్రమే రిలీజ్ చేయగా.. ఫుల్ వీడియోను ఎప్పుడు అప్ లోడ్ చేస్తారన్నది మాత్రం ప్రస్తావించలేదు. వీడియో చివర్లో కమింగ్ సూన్ అని మాత్రం వేశారు. దీన్ని బట్టి చూస్తుంటే పూర్తి వీడియోను త్వరలోనే విడుదల చేస్తారని భావిస్తున్నారు. ఇక 2నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ వీడియో విడుదలైన 11గంటల్లోనే 7 లక్షల వ్యూస్ వచ్చాయి.






Also Read : Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామాలు ఏ సమయంలో పఠించాలి - పారాయణం వల్ల ఉపయోగం ఏంటి!