Vishnu Sahasranamam: హిందూ ధ‌ర్మంలో విష్ణు సహస్రనామ పారాయ‌ణ‌కు విశేష ప్రాముఖ్యత ఉంది. విష్ణుసహస్రనామ పారాయణం వల్ల ఉపయోగం ఏంటి.. నిత్యం పారాయణం చేస్తే ఏం జరుగుతుంది..


మీలో ఆధ్యాత్మిక శక్తి పెరగాలి అనుకుంటే నిత్యం విష్ణు సహస్రం పారాయణ చేయాలి.


ఇందులో ఉండే 1000 నామాలు విష్ణువు మహిమలను వివరిస్తాయి. ఈ నామాల‌న్నీ ఆధ్యాత్మికత, ధ్యానం, భక్తి, అంతర్గత శాంతిని సూచిస్తాయి. 


నిత్యం ఈ నామాలు పఠించినా, శ్రద్ధగా విన్నా.. మానసిక ప్రశాంతత లభిస్తుంది..వెంటాడుతున్న ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని విశ్వ‌సిస్తారు.


క్రమం తప్పకుండా విష్ణు స‌హ‌స్ర‌నామాన్ని పారాయ‌ణ చేయ‌డం వల్ల  ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి


Also Read: ముక్కోటి దేవతలు అంటే ఎవరెవరు.. వైకుంఠ ఏకాదశిరోజు విష్ణువుతో భూలోకానికి వచ్చేదెవరు!



విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు..ఎవరు జపించాలి!


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నప్పుడు విష్ణు సహస్రనామం జపించడం అత్యంత ప్రయోజనం. ఎందుకంటే శని ప్రభావం ఉన్నప్పటికీ బృహస్పతి స్థానం బలంగా ఉంటే ఎలాంటి సమస్యలను అయినా ఎదుర్కొనే శక్తి , విజయం మీ సొంతం అవుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. 


శనిమాత్రమే కాదు..జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా వాటినుంచి ఉపశమనం కల్పించే శక్తి విష్ణుసహస్రనామాలకు ఉంటుందని చెబుతారు. ఎందుకంటే ఎలాంటి దోషాలకు అయినా గురువు అనుగ్రహాన్ని మించిన పరిష్కారం ఉండదు..జగద్గురువు కన్నా గురువెవ్వరు? 


జాతంలో 6, 8 లేదా 12వ ఇంట గురుడు సంచరించినప్పుడు విష్ణు సహస్రనామం పారాయ‌ణ చేస్తే చెడుచేసే గ్రహాలు శాంతిస్తాయి 


కాలేయ సమస్యలు, పొట్టకు సంబంధించిన రుగ్మతలు ఉన్నప్పుడు..ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే నిత్యం విష్ణుసహస్రం పారాయణం చేస్తే మంచి ఫలితం పొందుతారు
 
పెళ్లికి సంబంధించిన ఆటంకాలు అయినా, పెళ్లి తర్వాత సంతానానికి సంబంధించిన సమస్యలు అయినా విష్ణు సహస్రం పారాయణం చేస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
 
Also Read: వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. అన్నం తింటే ఏమవుతుంది!


విష్ణు సహస్ర‌ం ఎప్పుడు జపించాలి?


సాధారణంగా బ్రహ్మముహూర్తంలో విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ఉత్తమం
 
విష్ణుసహస్రనామాన్ని పారాయ‌ణ చేసిన్ని రోజులు కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి


విశ్వంలో ప్రతి సంఘటన విష్ణువుకు సంబంధించినదే. జీవితంలో ప్రతి అవరోధాన్ని,  విపత్తును తొలగించే విష్ణు సహస్రం హిందూ ధర్మంలో అత్యంత విశిష్టమైనది. అందుకే జాతకంలో దోషాలు తొలగిపోవాలన్నా...ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా..ఆరోగ్యంగా ఉండాలన్నా నిత్యం విష్ణు స‌హ‌స్ర‌నామం  పారాయ‌ణ చేయాలి.


విష్ణు సహస్రం నుంచి కొన్ని శ్లోకాలు


శ్రీ భీష్మ ఉవాచ |
జగత్ప్రభుం దేవదేవమనన్తం పురుషోత్తమమ్ |
స్తువన్నామసహస్రేణ పురుషః సతతోత్థితః ||  


తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్ |
ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ ||  


అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరమ్ |
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ || 


బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనమ్ |
లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్ ||  


ఏష మే సర్వధర్మాణాం ధర్మోఽధికతమో మతః |
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా ||  


పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యఃపరాయణమ్ ||  


పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్ |
దైవతం దైవతానాంచ భూతానాం యోవ్యయః పితా ||  


యతః సర్వాణి భూతాని భవన్త్యాదియుగాగమే |
యస్మింశ్చ ప్రలయం యాన్తి పునరేవ యుగక్షయే || 


తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే |
విష్ణోర్నామసహస్రం మే శృణు పాపభయాపహమ్ ||  


యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః |
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ||  


ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః |
ఛన్దోఽనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః ||  


అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః |
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ||  


విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ |
అనేకరూప దైత్యాన్తం నమామి పురుషోత్తమమ్ ||


Also Read: 600 కోట్ల ఖర్చు.. 7జన్మలకు గుర్తుగా 7ద్వారాలు.. మిల్లు కార్మికుడి కొడుకు కట్టిన అద్భుతమైన స్వర్ణ దేవాలయం!