Mukkoti Devathalu (33 Crores Gods or 33 Vedic Gods): దేవతల సంఖ్య మూడు కోట్లు అని కొందరు...33 కోట్లు అని మరికొందరు అంటుంటారు. అయితే కోటి అనేది వాస్తవానికి సంఖ్యాశాస్త్ర సంకేతం కాదు. ఏకాదశ రుద్రులు (11), ద్వాదశ ఆదిత్యులు (12), అష్ట వసువులు (8), ఇద్దరు అశ్వినీ దేవతలు..ఇలా మొత్తం 33 మందిని ముక్కోటి దేవతలు అని పిలుస్తారని చెబుతోంది వేదం. సృష్టిక్రమంలో వీరిదే  బాధ్యత..వీళ్లంతా ఒక్కటై శ్రీ మహావిష్ణువుని సేవించేందుకు వైకుంఠానికి వెళతారు. నారాయణుడితో కలసి భూలోకానికి తరలివస్తారు. ఈ రోజే వైకుంఠ ఏకాదశి.. ముక్కోటి దేవతలు దిగివచ్చే రోజుకావడంతో ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. 
 
సంస్కృతంలో ‘కోటి’ అంటే ‘విధము’, ‘వర్గము’ అనే అర్థాలున్నాయి
 
‘ఉచ్ఛకోటి’ అంటే ఉచ్ఛమైన వర్గానికి చెందినవారని అర్థం
 
‘సప్త కోటి బుద్ధులు’ అనే పదం బౌద్ధంలో ఉంది..ఏంటే ఏడుగురు ప్రధాన బుద్ధులు అని అర్థం
 
యజుర్వేజం, అథర్వణ వేదం ప్రకారం దేవతలను 33 విధాలుగా వర్గీకరించారు. వీరినే త్రింశతి కోటి దేవతలు అంటారు.  


హిందూ ధర్మ శాస్త్రాలు, బౌధ్దంలోనే కాదు..పార్శీ గ్రంధాల్లోనూ దేవతలను 33 వర్గాలని పేర్కొన్నారు. హిందూమతంలో చెప్పే ఆ ముక్కోటి దేవతలు ఎవరెవరంటే... 


ఏకాదశ రుద్రులు 


పరమేశ్వరుడు 11 అవతారాల్లో ఏకాదశ రుద్రుడిగా దర్శనమిస్తాడు. రుద్రనమకంలో ఓ శ్లోకంలో ఏకాదశ రుద్రలు పేర్లున్నాయి..


ఓంనమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
 త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ 
కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ 
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః" 


1. విశ్వేశ్వరుడు 2.మహాదేవుడు 3. త్ర్యంబకుడు 4.త్రిపురాంతకుడు 5.త్రికాగ్నికాలుడు 6.కాలాగ్నిరుద్రుడు 7.నీలకంఠుడు 8.మృత్యుంజయుడు 9.సర్వేశ్వరుడు 10. సదాశివుడు 11. శ్రీమన్మహాదేవుడు


Also Read: వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
 
ద్వాదశ ఆదిత్యులు


హిందూ పురాణాల ప్రకారం అదితి - కశ్యపుని 12 మంది పుత్రులను ద్వాదశఆదిత్యులు అంటారు. ఏడాదిలో 12 నెలల్లో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశ ఆదిత్యుల పేర్లతో వర్ణించారు. 


మహాభారతం ఆదిపర్వంలో శ్లోకం ప్రకారం ద్వాదశ ఆదిత్యుల శ్లోకం


ధాతా మిత్రః ఆర్యమా శక్రో వరుణ స్త్వంశ ఏవచ
భగో వివస్వాన్ పూషా చ, సవితా దశమస్తథా
ఏకాదశస్తథా త్వష్టా, ద్వాదశో విష్ణురుచ్యతే
జఘన్యజస్తు సర్వేషా మాదిత్యానా గుణాధికః


ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణువు.. 12 నెలల్లో నెలకో పేరు


Also Read: వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. అన్నం తింటే ఏమవుతుంది!


అష్టవసువులు


గంగాదేవికి - శంతనుడికి జన్మించిన ఎనిమిది మంది సంతానమే అష్టవసువులు. శాపవశాత్తు వీళ్లంతా మానవ జన్మ ఎత్తాల్సి వచ్చింది. వారి పేర్లు  ఆపుడు, ధృవుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యుషుడు, ప్రభాసుడు. ఓసారి  వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లిన అష్టవసువులు  అక్కడ కామధేనువిని చూసి అది కావాలని కోరారు. వశిష్ఠులు స్టుని ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ కామధేనువు వంటిదైన నందిని అనే ఆవును చూసి, అది తమకు కావాలని కోరారు. వశిష్ఠ మహర్షి తిరస్కరించడంతో దానిని అపహరించారని అనుకున్నారు. అది గ్రహించిన వశిష్ఠ మహర్షి భూలోకంలో జన్మించమని శపించారు. శాపవిమోచనం కోసం వేడుకోగా.. ప్రభాసుడు మినహా మిగిలినవారంతా పుట్టిన వెంటనే మరణించి పూర్వ రూపానికి వస్తారని చెబుతాడు. అలా శంతనుడితో కలసి తనకు జన్మించిన సంతానాన్ని గంగలో పడేస్తుంటుంది గంగాదేవి. చివరకు జన్మించిన ప్రభాసుడే భీష్ముడు. ఎందుకు బిడ్డలను నీటిపాలు చేస్తున్నావని శంతనుడు ప్రశ్నించడంతో భీష్ముడిని శంతనుడికి అప్పగించి వెళ్లిపోతుంది గంగ.  


Also Read: వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!


అశ్వినీ దేవతలు 


పురాణాల ప్రకారం అశ్వినీ దేవతలు కవలలు. సూర్యునికి - సౌంజ్నకి అశ్వ రూపంలో ఉండగా జన్మించిన సంతానం. పాండవులలో నకులుడు, సహదేవుడు అశ్వినీదేవతల కలిగిన సంతానమే. ఆశ్విని దేవతలు  దక్ష ప్రజాపతి నుంచి ఆయుర్వేదం నేర్చుకుని ఇంద్రుడికి నేర్పించారని చెబుతారు. వీరిసోదరి అయిన ఉష..నిత్యం బ్రహ్మ మహూర్తంలో మేల్కొలుపుతుందట. ఆ తర్వాత రథాన్ని అథిరోహించి ప్రయాణిస్తారని పురాణ వర్ణన.
 
వీళ్లంతా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వారం గుండా వెళ్లి శ్రీహరిని దర్శించుకుంటారు...అనంతరం విష్ణువుతో కలసి భూలోకాని వస్తారని చెబుతారు.