Bachchala Malli OTT Platform: అల్లరి నరేష్ (Allari Naresh) మరోసారి మాస్ అవతారం ఎత్తి, గత ఏడాది ప్రేక్షకులను అలరించిన సినిమా 'బచ్చల మల్లి' (Bachhala Malli). థియేటర్లలో రిలీజై అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా నెలలోపే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఒక్కటి కాదు... మూడు ఓటీటీ వేదికల్లో ఈ సినిమా రానుంది.


ఒకటి కాదు... మూడు ఓటీటీల్లో!
కెరీర్ మొదట్లో వరుసగా కామెడీ సినిమాలు చేసి, తన వినోదంతో అదరగొట్టిన హీరో అల్లరి నరేష్. ఈ మధ్య కాలంలో రూటు మార్చి మంచి మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 'నాంది' సినిమాతో ఈ మార్పును మొదలు పెట్టారు అల్లరి నరేష్. ఆ తర్వాత 'నా సామి రంగ' సినిమాలో కూడా మంచి మాస్ క్యారెక్టర్ ని చేసి అలరించారు. ఇక ఇలాంటి క్యారెక్టర్ చేస్తే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు అని అనుకున్నారో ఏమో... తాజాగా 'బచ్చల మల్లి'లో కూడా  ఆల్మోస్ట్ అలాంటి పాత్రని రిపీట్ చేశారు. కాకపోతే ఈసారి కాస్త వైలెన్స్ ని యాడ్ చేశారు.


డిసెంబర్ 20, 2024న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాతో అల్లరి నరేష్ మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచాడు. దీంతో ఈ సినిమాను నెల రోజులలోపే ఓటీటీలోకి తీసుకురాబోతున్నారు. తాజాగా ఈటీవీ విన్ ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ని గెస్ చేయగలరా? అంటూ ఆడియన్స్ ని ఊరించింది. సన్ నెక్ట్స్ ఓటీటీ కూడా త్వరలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంది. ఆ పోస్టులు చూసిన నెటిజన్లు ఇంకేముంది ఈ సినిమా సంక్రాంతికి రావడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు కొత్త సినిమాలు ఓటీటీలో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఈటీవీ విన్, సన్ నెక్ట్స్ ఓటీటీలు కూడా 'బచ్చల మల్లి' సినిమాను సంక్రాంతికి తీసుకు వస్తాయో? లేదో? అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్.


Also Read: ఐఎండీబీలో 6.8 రేటింగ్ ఉన్న రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్... మలయాళ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... ఎందులో చూడొచ్చంటే?










'బచ్చల మల్లి' స్టోరీ ఇదే... 
'బచ్చల మల్లి'లో అల్లరి నరేష్ సరసన 'హనుమాన్' హీరోయిన్ అమృత అయ్యర్ నటించింది. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఏపీలోని తుని దగ్గరలో ఉన్న సురవరం అనే ఊర్లో జరిగిన స్టోరీగా తెరపైకి తీసుకొచ్చారు డైరెక్టర్. అయితే 'బచ్చల మల్లి' సినిమాకు అల్లరి నరేష్ మాత్రమే ప్లస్ పాయింట్, స్క్రీన్ ప్లేలో లోపాలు, చికాకు పెట్టించే అనవసరమైన సీన్లు ఉన్నాయి అనే టాక్ మొదటి షోతోనే వినిపించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా డీలా పడడానికి కారణం స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు అనే విమర్శలు వచ్చాయి. ఇక ఈ సినిమా స్టోరీ లోకి వెళ్తే... మల్లి అనే అబ్బాయి బాగా చదువుతాడు. కానీ అతని తండ్రి తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా ఈ మల్లి మొండిగా, మొరటుగా మారతాడు. ఈ నేపథ్యంలోనే కావేరి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ప్రేమ మల్లిని మళ్లీ సాధారణంగా మార్చిందా? అసలు అతని తండ్రి చేసిన ఆ తప్పు ఏంటి? ఎందుకు హీరో ఇంత మొండిగా, మొరటుగా తయారయ్యాడు? హీరో హీరోయిన్ల ప్రేమలో ఎదురైన సమస్యలు ఏంటి? అనేది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.


Read Also: 'ప్రేమలు' హీరో కొత్త సినిమా, సేమ్ డైరెక్టర్‌తో - ఎప్పుడు, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?