జనవరి 10 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోతాయి. అర్థవంతమైన చర్చల్లో పాల్గొంటారు. వ్యాపార ఒప్పందాల విషయంలో తొందరపడకండి.
వృషభ రాశి
ఈ రాశివారికి ఈ రోజు చాలా మంచిరోజు. ఆధ్యాత్మిక వాతావరణం ప్రభావం మీపై ఉంటుంది. మీరు ఇతరుల భావాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆలోచనాత్మక వ్యక్తుల నుంచి ప్రేరణ పొందుతారు:
మిథున రాశి
ఈ రోజు ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకోండి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. అర్థరాత్రి వరకు మెలకువగా ఉండటం వల్ల రోజువారీ దినచర్య దెబ్బతింటుంది.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. జీవితంలో కొన్ని సానుకూల మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అనవసర చర్చలతో సమయం వృధా చేయవద్దు.
Also Read: వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. అన్నం తింటే ఏమవుతుంది!
సింహ రాశి
ఈ రోజు వైవాహిక జీవితంలో ప్రేమ భావన పెరుగుతుంది. మీరు ఫైనాన్స్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మధ్యాహ్నం తర్వాత అన్ని పనులు పూర్తయ్యేలా చూస్తారు. మేధోపరమైన రచన, పఠనంపై ఆసక్తి ఉంటుంది.
కన్యా రాశి
ఈ రోజు మనసులో కొన్ని సందేహాలు ఉంటాయి. తప్పుడు అలవాట్ల వల్ల మీరు విమర్శల బారిన పడాల్సి రావచ్చు. సబార్డినేట్ ఉద్యోగులను పర్యవేక్షించండి. మీ రహస్యాలను ఎవరికీ చెప్పొద్దు.
Also Read: వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
తులా రాశి
ఈ రాశికి చెందిన వారు తమ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆహారం పట్ల శ్రద్ధ అవసరం. జీవితభాగస్వామికి సమయం కేటాయిస్తారు.
వృశ్చిక రాశి
ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. మీరు సృజనాత్మక పనిపై ఆసక్తి చూపుతారు. స్నేహితులతో సమయం గడుపుతారు. ఏదో విషయంపై చింతిస్తారు. మీ ప్రతిభపై నమ్మకం ఉంచండి.
ధనుస్సు రాశి
మిమ్మల్ని మీరు ప్రశంసించుకోకండి. అన్ని పనులు ఒక క్రమపద్ధతిలో పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకోండి. మీరు సాధించిన విజయాలతో మీరు సంతృప్తి చెందలేరు. కొత్త పని చేయాలనే కోరిక మీ మనస్సులో ఉంటుంది. రాజకీయ పరిణామాలపై చాలా ఆసక్తిని కలిగి ఉంటారు
మకర రాశి
ఈ రోజు ఆర్థిక సంబంధిత ఇబ్బందులు ఉండొచ్చు. ప్రత్యేక వ్యక్తులను కలుస్తారు. ప్రేమ బంధాలలో ఏదో ఆందోళన ఉంటుంది. కుటుంబ వ్యవహారాలపై ఆసక్తి ఉండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభ రాశి
ఎప్పటి నుంచి వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఉద్యోగం-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కాపాడుకోండి. అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. దూర ప్రాంత ప్రయాణం కోసం ప్లాన్ చేసుకుంటారు.
మీన రాశి
ఈ రోజు కిందిస్థాయి వ్యక్తులు మీ పట్ల బాగా ప్రవర్తిస్తారు. మీరు ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది.
Also Read: ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.