గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రికార్డుల వేట మొదలు అయ్యింది. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా... ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా థియేటర్లలోకి వచ్చిన సినిమా... 'గేమ్ చేంజర్' (Game Changer) ఈ రోజు విడుదల అయ్యింది. ఫస్ట్ డే థియేట్రికల్ రన్ ఇంకా కంప్లీట్ కాలేదు. అప్పుడే ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం మొదలు పెట్టింది. 


నెల్లూరులో ఆల్ టైమ్ డే 1 రికార్డు...
ఇప్పుడు ఫస్ట్ డే 'గేమ్ చేంజర్' పేరిట!
'గేమ్ చేంజర్' అడ్వాన్స్ బుకింగ్స్ విడుదలకు ఒక్క రోజు ముందు పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యాయి. అయితేనేం... కొన్ని గంటల్లోనే రికార్డులు మొదలు అయ్యాయి. ఒక్క నెల్లూరు సిటీలోనే ఈ రోజు (జనవరి 10న) 103 షోలు వేస్తున్నారు. అన్ని షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. నెల్లూరు సిటీలో 'గేమ్ చేంజర్' మొదటి రోజు క్రాస్ కోటి 15 లక్షల రూపాయలు. ఇది ఆల్ టైం డే 1 రికార్డ్.


నెల్లూరుతో పాటు పలు ఏరియాలలో 'గేమ్ చేంజర్' రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారంటీగా కనబడుతోంది. విజయనగరంలో కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీలో ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ షోస్ పడుతున్నాయి.‌ అక్కడ కూడా డే 1 ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి.


Also Read: రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' ఫస్ట్‌ డే ఫస్ట్ షో, రివ్యూ లైవ్ అప్డేట్స్ - సినిమాలో సీన్ టు సీన్ మీ ముందుకు!



'గేమ్ చేంజర్' సినిమా మీద ఆకాశమంత అంచనాలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ చూస్తుంటే వాళ్ళు అందరినీ సినిమా అమితంగా ఆకట్టుకుందని అర్థమవుతుంది. మరో వైపు ఓవర్ సీస్ రిపోర్టులు కూడా బాగున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్, ఎస్.జె. సూర్య నటన పట్ల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇంతకు ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాకు తెలంగాణలో వచ్చిన టికెట్ రేట్ హైక్ ఈ సినిమాకు రాలేదు.‌ అందువల్ల నైజాం ఏరియాలో ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయి అనేది చూడాలి.


Also Read: పక్కింట్లోకి తొంగిచూసే హీరోయిన్... ఆమె కాపురంలో మంట పెట్టిన హీరో... ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్, ఎందులో చూడొచ్చంటే?


రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో 50వ సినిమాగా అగ్ర నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ ప్రొడ్యూస్ చేసిన చిత్రం ఇది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేయగా... కలెక్టర్ రామ్ నందన్ జంటగా ఆమె సందడి చేశారు. మరొక పాత్ర అప్పన్నకు జోడిగా అంజలి కనిపించారు. మంత్రి బొబ్బిలి మోపిదేవి పాత్రలో ఎస్.జె. సూర్య నటించగా... ఇతర కీలక పాత్రల్లో శ్రీకాంత్ జయరాం, సునీల్, నవీన్ చంద్ర, హర్ష, సత్య, సముద్రఖని తదితరులు యాక్ట్ చేశారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. విడుదలకు ముందు సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ కాగా కేవలం ఆ పాటల చిత్రీకరణకు 75 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు నిర్మాత 'దిల్' రాజు తెలిపారు.