Game Changer Review Live Updates: రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' రివ్యూ లైవ్ అప్డేట్స్ - సినిమాలో సీన్ టు సీన్ మీ ముందుకు!
Game Changer Review in Telugu: రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'గేమ్ చేంజర్'. ఏపీలో ఒంటిగంట షో మొదలైంది. రీడర్స్ కోసం ఫస్ట్ డే ఫస్ట్ షో లైవ్ అప్డేట్స్...
'గేమ్ చేంజర్' సినిమా జనసేనకు ప్లస్ అయ్యేలా తీశారా? అప్పన్న పాత్రను పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో డిజైన్ చేశారా? సినిమా ఎలా ఉంది? శంకర్ ఎలా తీశారు? రివ్యూ చదివి తెలుసుకోండి. రివ్యూ చదివేందుకు కింద లింక్ క్లిక్ చేయండి.
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' చూసిన ఆడియన్స్ ఏం అంటున్నారు? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? ట్వీట్స్ ఎలా ఉన్నాయి? అనేది తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Also Read: రామ్ చరణ్ హిట్టు కొట్టాడా? ట్విట్టర్‌లో టాక్ ఎలా ఉందేంటి?
క్లైమాక్స్ ముగిసింది... సినిమా చివరకు వచ్చేసరికి రామ్ చరణ్ క్యారెక్టర్ కొత్త టర్న్ తీసుకుంది. అది ఏమిటో సినిమా చూసి తెలుసుకోండి.
మళ్ళీ ఎన్నికల సన్నివేశాలు వచ్చాయి. కథలో కీలక సన్నివేశాలు జరుగుతున్నాయి. అందులో కొన్ని మలుపులు ఉన్నాయి.
ఎన్నికల తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ మధ్య లవ్ సీన్ వచ్చింది. ఆ తర్వాత 'జరగండి జరగండి' సాంగ్ వచ్చింది.
ఇప్పుడు మంచి పొలిటికల్ డ్రామా నడుస్తోంది. కథలో బ్యాక్ టు బ్యాక్ ట్విస్టులు వస్తున్నాయి. రామ్ చరణ్, ఎస్.జె. సూర్య... ఇద్దరి పాత్రల్లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి.
ఫ్లాష్ బ్యాక్ ముగిసింది. ఆ తర్వాత రామ్ నందన్ ఒక నిజం తెలుసుకున్నాడు. అది ఏమిటో స్క్రీన్ మీద చూడాలి.
రాత్రివేళ ఒక యాక్షన్ సీన్ వచ్చింది. ఆ తర్వాత మరొక ఎమోషనల్ సీన్ వచ్చింది.
అప్పన్నగా రామ్ చరణ్, శ్రీకాంత్ మధ్య కీలక సన్నివేశాలు జరుగుతున్నాయి. కథ పట్ల, క్యారెక్టర్స్ పట్ల ప్రేక్షకులకు మరింత అవగాహన వచ్చే సీన్స్ తెరపై వస్తున్నాయి.
ఫ్లాష్ బ్యాక్ సీన్స్ జరుగుతున్నాయి. అంజలికి చాలా కాలం తర్వాత మంచి రోల్ లభించింది. రామ్ చరణ్, అంజలి నటన సూపర్
కథ మరోసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళింది. ఈసారి అప్పన్నగా రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ఇంట్రడ్యూస్ చేశారు.
మాంచి ఇంటర్వెల్ ట్విస్ట్ తో ప్రేక్షకులకు కాసేపు విశ్రాంతి ఇచ్చిన 'గేమ్ చేంజర్'... సెకండాఫ్ ఆసక్తికరమైన సన్నివేశాలతో మొదలైంది.
'గేమ్ చేంజర్' ఇంటర్వెల్ ట్విస్ట్ మామూలుగా లేదు. రామ్ చరణ్ క్యారెక్టర్ బిగ్గెస్ట్ షాక్ ఇస్తుంది. ఇంటర్వెల్ ముందు పెళ్లి దుస్తుల్లో వచ్చే ఫైట్ కూడా చాలా బావుంది.
ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చేలా కథలో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. ఈ విధంగా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు.
అంజలి ఎంట్రీ, ట్విస్టులతో పాటు డ్రామాను మొదలు పెట్టారు శంకర్. తన మార్క్ ఏమిటో చూపిస్తున్నారు. ఎమోషనల్ హై ఇచ్చేలా సీన్స్ ఉన్నాయి.
మరో హీరోయిన్ అంజలిని ఇంట్రడ్యూస్ చేశారు. పార్వతమ్మగా ఆవిడను పరిచయం చేశారు. కొన్ని ట్విస్టులు, టర్నులతో కథ ముందుకు సాగుతోంది.
రామ్ చరణ్, ఎస్.జె. సూర్య మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ వస్తున్నాయి. ఇవి చాలా అంటే చాలా బావున్నాయి. థియేటర్లలో ఈ సన్నివేశాలకు క్లాప్స్ పడటం గ్యారంటీ. విజయవాడలో జనాలు క్లాప్స్ కొట్టారు.
రామ్ చరణ్, కియారా అద్వానీ మధ్య Dhop సాంగ్ వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ సాంగ్ ఇది. పాటలో హీరో హీరోయిన్స్ జోడీ అదుర్స్ అనిపించేలా ఉంది.
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు, రామ్ చరణ్ కు మధ్య సీన్స్ జరుగుతున్నాయి.
హీరో హీరోయిన్స్ మధ్య ఒక ట్విస్టుతో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ చేశారు. తర్వాత ఓపెనింగ్ సీన్ కూడా ఫ్లాష్ బ్యాక్ తో చిన్న కనెక్షన్ ఉంటుంది.
కాలేజీ నేపథ్యంలో హీరో హీరోయిన్స్ మధ్య సీన్స్ వస్తున్నాయి. ఇక్కడ నవీన్ చంద్రను చూపించారు. రామ్ చరణ్ కలెక్టర్ కావడానికి ముందు నుంచి అతనితో పరిచయం అన్నమాట.
కాలేజీ సన్నివేశాల్లో ర్యాప్ సాంగ్ వచ్చింది. ఇందులో రామ్ చరణ్ డ్యాన్స్ సూపర్ ఉంది. అభిమానులకు విజిల్ వర్తీ స్టెప్స్ ఉన్నాయ్.
హీరోయిన్ కియారా అద్వానీ ఎంట్రీ ఇచ్చారు. రామ్ చరణ్ స్నేహితులుగా సత్య, హర్ష కూడా ఎంట్రీ ఇచ్చారు. కథ కాస్త వెనక్కి... ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. రామ్ చరణ్, కియారా అద్వానీ మధ్య ప్రేమ కథ చూపిస్తున్నారు.
నిజాయతీపరుడైన కలెక్టర్ గా రామ్ చరణ్ నటన, ఆ సీన్స్ బావున్నాయి. అవినీతి, అక్రమార్కుల భరతం పట్టే సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. రేషన్ బియ్యం అక్రమంగా తరలించే సీన్స్ వస్తున్నాయి.
'గేమ్ చేంజర్' ట్రైలర్‌లో 'ఒక్క ముద్ద' అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ హైలైట్ అయ్యింది. ఆ సీన్ ఇప్పుడు వచ్చింది.
కలెక్టర్ రామ్ నందన్ దగ్గర బంట్రోతుగా సునీల్ ఎంట్రీ ఇచ్చారు. అవినీతిపరుడైన రాజకీయ నేత బొబ్బిలి మోపిదేవిగా ఎస్.జె. సూర్యను చూపించారు. ఆయన దగ్గర పని చేసే పాత్రలో నవీన్ చంద్ర పాత్రను పరిచయం చేశారు.
ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం పరితపించే ముఖ్యమంత్రిగా శ్రీకాంత్ సన్నివేశాలు వస్తున్నాయి. ఆయనతో పాటు ఎస్.జె. సూర్య కూడా ఉన్నారు. ఇద్దరి నటన బావుంది.
పెళ్లి అంటే ఇష్టం లేని యువకుడిగా రామ్ నందన్ కనిపించారు. అతని ఫ్యామిలీని కూడా పరిచయం చేశారు. ఫ్యామిలీ సీన్స్ వస్తున్నాయి.
లుంగీ ఫైట్ తర్వాత ఫస్ట్ సాంగ్ 'రా మచ్చా మచ్చా' సాంగ్ వచ్చింది. ఇందులో రామ్ చరణ్ డ్యాన్స్ అభిమానులకు ట్రీట్. డైరెక్టర్ శంకర్, డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఈ పాటలో తళుక్కున మెరిశారు.
ఐఏఎస్ అధికారిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారు. లుంగీ లుక్కులో మాస్ ట్రైన్ ఫైట్ చేశారు. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి ఫైట్.
ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, జయరామ్, సముద్రఖని పాత్రలను మొదట పరిచయం చేసి... ముఖ్యమంత్రి పాత్రలో శ్రీకాంత్ కనిపించారు. ఆయన ఆస్పత్రిలో చేరారు.
ఏపీలోని విజయవాడలో గల రాజ్ యువరాజ్ థియేటర్‌లో మరికాసేపటిలో షో మొదలు కానుంది.
Background
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎదురు చూపులకు ఇవాళ తెర పడింది. ఈ రోజు 'గేమ్ చేంజర్'తో సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత ఆయన వెండితెర మీదకు వచ్చారు. ఆస్కార్ సాధించిన 'త్రిబుల్ ఆర్' తర్వాత పూర్తి స్థాయి హీరోగా నటించిన ఆ సినిమా ఇవాళ విడుదలైంది. 'త్రిబుల్ ఆర్' తర్వాత 'ఆచార్యు'లో అతిథి పాత్రలోనూ, సల్మాన్ ఖాన్ హిందీ సినిమా 'కిసి కా భాయ్ కిసి కీ జాన్'లో ఓ పాటలో తళుక్కున మెరిశారు. అయితే ఆయన నుంచి ఫుల్ లెంగ్త్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫాన్స్ అందరికీ 'గేమ్ చేంజర్' ఒక ఫెస్టివల్ మూమెంట్.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన 'గేమ్ చేంజర్' ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు (జనవరి 10న) భారీ ఎత్తున విడుదల అయ్యింది. దర్శకుడు శంకర్ తీసిన తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ రోజు విడుదల చేశారు.
'గేమ్ చేంజర్' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత 'దిల్ రాజు', ఆయన సోదరుడు శిరీష్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. వారి సంస్థలో ఇది 50వ సినిమా. అందుకని, ఖర్చు విషయంలో అస్సలు వెనకడుగు వేయలేదు. సుమారు 500 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. ఈ చిత్ర నిర్మాణంలో జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థలు భాగస్వామ్యం వహించాయి. కేవలం ఐదు పాటల చిత్రీకరణకు రూ. 75 కోట్లు ఖర్చు చేసినట్లు 'దిల్' రాజు తెలిపారు.
రాజకీయ నేపథ్యంలో 'గేమ్ చేంజర్' సినిమా రూపొందింది. కలెక్టర్, ఒక మంత్రికి మధ్య తలెత్తిన సంఘర్షణ నేపథ్యంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇది. ఇందులో మంత్రి బొబ్బిలి మోపిదేవి పాత్రలో దర్శకుడు - నటుడు ఎస్.జె. సూర్య నటించారు. ఇక మరొక కీలక పాత్రలో శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ నటించగా... ఇతర ప్రధాన పాత్రలను జయరాం, సునీల్, నవీన్ చంద్ర, 'వెన్నెల' కిషోర్ తదితరులు పోషించారు.
'గేమ్ చేంజర్' సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేశారు. ఐఏఎస్ అధికారిగా కనిపించనున్న రామ్ నందన్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించగా... ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో వచ్చే అప్పన్నకు జంటగా తెలుగు అమ్మాయి అంజలి సందడి చేయనున్నారు. ఈ సినిమాలో నటనకు గాను రామ్ చరణ్ కచ్చితంగా ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకుంటారని అమెరికాలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ చెప్పారు. ఆ తర్వాత అదే మాటను దర్శకుడు శంకర్ కూడా చెప్పారు. చరణ్ ఒక్కరికే కాదని అంజలి నటనకు కూడా నేషనల్ అవార్డు రావాలని సంగీత దర్శకుడు తమన్ ఆకాంక్షించారు. ఇంతమంది ఇలా చెబుతున్న ఈ సినిమా ఎలా ఉంది? లైవ్ అప్డేట్స్ ద్వారా తెలుసుకోండి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -