Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర కార్ డిక్కీలో భాస్కర్‌ని లక్ష్మీ వాళ్లు చూసి లోపలికి తీసుకెళ్తారు. ఇంతలో మనీషా ఇంటికి వచ్చి భాస్కర్‌ని చూసి షాక్ అవుతుంది. భాస్కర్ నిజం చెప్తే మన పని అంతే అని మనీషా దేవయానితో చెప్తుంది. భాక్కర్ కళ్లు తెరిచి అందరినీ చూసి షాక్ అయిపోతాడు.
మిత్ర: ఎందుకు మా నుంచి పారిపోవాలి అనుకుంటున్నావ్ భాస్కర్ ఏమైంది. లక్ష్మీ: చెప్పండి అన్నయ్య మీకు లక్కీ అమ్మ గురించి తెలుసు అని ఆయన చెప్పారు. మీరు ఇచ్చిన ఈ బిడ్డ తల్లి ఎవరు అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అన్నయ్య. మున్నార్‌లో నాకు ఆశ్రయం ఇస్తే ఆదుకున్నారు అనుకున్నా. నేను ఎవరో తెలీకుండానే సాయం చేస్తే దేవుడు ఇచ్చిన అన్నయ్య అనుకున్నాను. మీ ఇంట్లో నాకు సీమంతం జరిపిస్తే అది నా పుట్టిళ్లు అనుకున్నా. మిత్ర: ఏంటి లక్ష్మీ భాస్కర్ ఇంట్లో ఉన్నది నువ్వా.లక్ష్మీ: అవునండీ అరవింద: అంటే మేం సీమంతం చేసింది.లక్ష్మీ: నాకే అత్తయ్య గారు. ఆరోజు భాస్కర్ అన్నయ్య మీతో నాకు సీమంతం జరిపించాడు. ఆ రోజు నేను ఎవరో తెలీకుండానే నా భర్త నన్ను ఆశీర్వదించాడు. నా అత్తయ్య నాకు గాజులు తొడిగిందని సంతోషపడ్డాను. నాకు పురిటి నొప్పులు వస్తే మీరే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అరవింద: అంటే.. అంటే ఆ రోజు బిడ్డను కని వెళ్లిపోయింది.. లక్ష్మీ: నేనే అత్తయ్య గారు జున్ను పుట్టగానే మీ కంట పడకూడదు అని వాడిని తీసుకొని హాస్పిటల్ నుంచి వెళ్లిపోయాను. మిత్ర: కానీ ఆ రోజు నువ్వు కన్న బిడ్డ లక్కీ అని మాకు తీసుకొచ్చి చూపించారు.అరవింద: అవును లక్ష్మీ ఆ రోజు మేం హాస్పిటల్‌లో జాయిన్ చేసింది నిన్నే అయితే లక్కీ నీ బిడ్డే. లక్ష్మీ: అంటే లక్కీనా కన్న బిడ్డా. మరి జున్ను. అరవింద: నీకు ఇంకా అర్థం కాలేదా లక్ష్మీ లక్కీ, జున్ను ఇద్దరూ నీ కన్న బిడ్డలే నీ కవల పిల్లలే. జయదేవ్: విధి మీ భార్యభర్తల్ని వేరే చేసినా కూతురు తండ్రి దగ్గర కొడుకు తల్లి దగ్గరా పెరిగేలా చేశాడు. లక్కీ: నేను నిజంగా నీ కూతురినా అమ్మ.లక్ష్మీ: లక్కీ అని హగ్ చేసుకొని ఏడుస్తుంది. లక్ష్మీ, లక్కీలు హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతారు. ఇక జున్ను కూడా తల్లి, అక్కని హగ్ చేసుకుంటాడు. ఇక మిత్ర కూడా వాళ్లని పట్టుకొని ఎమోషనల్ అవుతాడు. అరవింద లక్కీని పట్టుకొని ముద్దాడుతుంది. నువ్వు నిజంగా మా అదృష్టం తల్లి మీ నాన్నని కాపాడుకోవడానికి ఎప్పుడో మీ అమ్మ కడుపున పుట్టేశావే నువ్వు మా రక్తానివే అని ఎమోషనల్ అవుతుంది. దేవయాని, మనీషా ముఖం మాడ్చుకుంటారు. అరవింద భాస్కర్‌తో ఇన్ని రోజులు మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మా నుంచి ఎందుకు దూరంగా ఉన్నావ్ అని అడుగుతుంది. నా భార్యకి ఒంట్లో బాలేదు తప్పని పరిస్థితిలో కంపెనీ అకౌంట్ నుంచి రెండు లక్షలు దొగతనం చేశాను అది బయటకు వస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుందని పారిపోయాను అని మనీషాని భయపడి అబద్ధం చెప్తాడు. ఇంత చిన్న విషయానికి పారిపోవాలి అనుకుంటావా మా కోడలిని కాపాడిన నీకు ఎంత ఇచ్చినా తక్కువే అని అరవింద బ్లాంక్ చెక్ లక్ష్మీకి ఇచ్చి ఎంత కావాలో అంత ఇచ్చేయ్ అని అంటుంది. లక్ష్మీ బ్లాంక్ చెక్ భాస్కర్ చేతిలో ఇస్తుంది. ఇక భాస్కర్ ఇన్ డైరెక్ట్‌గా మనీషాతో నా భార్యకి ఏమైనా అయితే మళ్లీ మీ గడప తొక్కుతా అని అంటాడు.
లక్కీతో మృత్యుంజయ హోమం జరిపించాలని అందుకు ముహూర్తం పెట్టించాలని అనుకుంటారు. మనీషా సరయుకి కాల్ చేసి భాస్కర్ భార్యని వదిలేయ్ వాడు మొత్తం చెప్పేశాడు అంటుంది. లక్కీ మిత్ర కూతురు అని తెలిసిపోయిందని దాన్ని వదిలేయ్ అని చెప్తుంది. సరయు వదిలేస్తుంది. ఇక లక్కీ, జున్నులు నేను ముందు పుట్టాను అంటే నేను ముందు పుట్టాను అనుకుంటారు. లక్ష్మీ ఇద్దరు పిల్లల్ని చూసి మురిసిపోతుంది. మిత్ర కూడా చూస్తాడు. నేను నీ అన్నయ్యని నేను నిన్ను బాగా చూసుకుంటా అని జున్ను అంటే నేను అక్కని నేను నిన్ను సూపర్‌గా చూసుకుంటాను అని లక్కీ అంటుంది. మిత్ర పిల్లల్ని పిలుస్తాడు. ఇక మిత్ర ముందు లక్కీ పుట్టిందని అంటాడు. ఐదు నిమిషాల ముందు పుట్టుంటే నేను నీకు అన్నయ్య అయ్యుండే వాడిని అని జున్ను హర్ట్ అయిపోతాడు. లక్కీ, మిత్ర, లక్ష్మీ, జున్ను అందరూ హ్యాపీగా ఉంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఇక నుంచి నువ్వు దేవా భార్యవి.. ఈ ఇంటి చిన్న కోడలివి.. ఓర్నీ ఇదంతా కలా!