గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన 'గేమ్ చేంజర్' ట్విట్టర్ టాక్ (Game Changer Twitter Review) బయటకు వచ్చింది. ఏపీలో ఈ రోజు తెల్లవారుజామున ఒంటి గంటకు బెనిఫిట్ షోలు పడ్డాయి. అమెరికాలోనూ ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయ్యాయి. తమిళనాడు కొంతమంది క్రిటిక్స్ కోసం ప్రత్యేకంగా షోస్ వేసినట్లు తెలిసింది. ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. మరి సోషల్ మీడియా టాక్ ఎలా ఉంది? అనేది చూస్తే...
మైండ్ బ్లాక్ అయ్యేలా ఇంటర్వెల్ ట్విస్ట్...
సెకండాఫ్ అయితే సూపర్, పరుగులు పెట్టింది!
'గేమ్ చేంజర్' సినిమా మొదలైన తరువాత చాలా సేపటి వరకు శంకర్ క్యారెక్టర్లు పరిచయం చేస్తూ ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ కారణం చేత కొంత మందికి సినిమా సాదాసీదాగా అనిపించవచ్చు. కానీ ఇంటర్వెల్ ముందు ఆడియన్స్ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఆయన ఇచ్చారట. దాంతో సినిమా ఒక్కసారిగా పైకి లేచిందని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ తర్వాత శంకర్ కం బ్యాక్ ఇచ్చారని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చేయడం గమనార్హం. ఇక సెకండ్ హాఫ్ అయితే సూపర్ అంటున్నారు. సెకండ్ హాఫ్ రేసీగా సాగిందని చెబుతున్నారు.
అప్పన్న పాత్రలో చరణ్ నటన అద్భుతం!
అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటన అద్భుతం అని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. తన నటనతో ఆయన ఏడిపించేసారని తెలిపాడు.
'గేమ్ చేంజర్'కు 4 స్టార్ ఇచ్చిన తమిళ్ క్రిటిక్!
'గేమ్ చేంజర్' సినిమాకు తమిళ క్రిటిక్ ఒకరు ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. శంకర్ సినిమా సూపర్ తీశారని పేర్కొన్నారు. ఇక టెక్నికల్ అంశాల పరంగా కూడా సినిమా చాలా బాగుందని చెప్పారు. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్ అన్నారు. సూర్య, కియారా, అంజలి తమ తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పారు. ఓవరాల్ సినిమా విషయానికి వస్తే శంకర్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పారు.
మీకు రాజకీయం తెలుసు... మాకు రాజ్యాంగం తెలుసు!
ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్ర ఈ సినిమాకు మాటలు రాసిన సంగతి తెలిసిందే. ఆయన రాసిన సంభాషణలో కొన్ని పదునైన పదాలు పడ్డాయని వినపడుతోంది. 'మీకు రాజకీయం తెలుసు... మాకు రాజ్యాంగం తెలుసు' అంటూ కలెక్టర్ వర్సెస్ మినిస్టర్ సన్నివేశంలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ బావుందని ఒకరు ట్వీట్ చేశారు. 'గొంతు ఎవరిది అనేది ముఖ్యం కాదు... మనం ఎవరి గొంతు అనేది ముఖ్యం' అంటూ మరొక డైలాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: నెల్లూరులో 'గేమ్ చేంజర్' ఆల్ టైమ్ రికార్డ్... మిగతా ఏరియాల్లో కలెక్షన్స్ ట్రెండ్ ఎలా ఉందంటే?
తమన్ పాటలకు స్పెషల్ అప్రిసియేషన్
ఒక నెటిజన్ అయితే తమన్ పాటలకు వాటిని శంకర్ తెరకెక్కించిన విధానానికి ఫిదా అయ్యాడు ముఖ్యంగా Dhop సాంగ్ వచ్చినప్పుడు ఆ ఒక్క పాట కోసం టికెట్ డబ్బులు వర్తి అనిపిస్తాయని చెప్పాడు. ఆ పాటను క్రేజీగా తీశారట. కొన్ని నెగిటివ్ రివ్యూలు కూడా కనపడుతున్నాయి. అయితే మెజారిటీ జనాల నుంచి పాజిటివ్ రివ్యూలు రావడం గమనార్హం.