Boiled Rice To Glass Of Wine: పాత తెలుగు సినిమాల్లో కమెడియన్లు చిత్ర విచిత్ర వంటలు చేస్తూ.. కామెడీ పండించేవారు. ఇప్పుడు సోషల్ మీడియా ఉద్ధృతమయ్యాక ఆ బాధ్యత ఇన్ ఫ్లూయన్సర్స్ తీసుకున్నారు. ఎక్కడెక్కడ లేని వంటల కాంబినేషన్లు చూపిస్తూ విరక్తి పుట్టిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ ఐస్ క్రీమ్ బిర్యానీ చేసి దడ పట్టిస్తే... తాజాగా సింగపూర్ కు చెందిన ఓ ఇన్‌ఫ్లూయన్సర్ అన్నాన్ని కలుషితం చేసి పడేశారు. వైన్ రైస్ అని.. కొత్త వింత.. వంటకాన్ని ఆవిష్కరించాడు.
ఇంటర్నెట్ నిండా వింత ఆహార పదార్థాలను ప్రయత్నించే రీల్స్ కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు విచిత్రమైన కాంబినేషన్లతో అసహ్యం పుట్టిస్తూ ఉంటారు. వ్యూయర్స్ దృష్టిని ఆకర్షించడానికి వింత వింత ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సింగపూర్ ఇన్ఫ్లుయెన్సర్ కెల్విన్ లీ చేసిన ప్రయోగం ..యాక్ అనిపించేలా మారింది. వైన్ గ్లాసులో ఉడికించిన అన్నాన్ని కలిపి తాగాడు. ఏదో గొప్ప కాంబినేషన్ అన్నట్లుగా ఓవరాక్షన్ చేశాడు.
లీ విచిత్రమైన కాంబినేషన్లతో వంటలు చేయడానికి ప్రసిద్ధి పొందాడు. తాను ఏమి తయారు చేయబోతున్నానో లీ తన ఫాలోవర్లకు తెలియజేస్తూ కొత్త వంటకానికి "రైస్ వైన్"అనే పేరు పెట్టాడు. ఎలా చేయాలో కూడా తయారు చేసి చూపించాడు. ఇదేదో పెద్ద సైంటిఫింక్ వ్యవహారం అయినట్లుగా చెప్పుకొచ్చాడు కానీ. ఓ గ్లాసులో వైన్ తీసుకుని.. మరో గ్లాస్ రైస్ తీసుకుని రెండూ కలిపేశాడు. తర్వాత తాగేశాడు. అదే పెద్ద రైస్ వైన్ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు.
దీన్ని చూసిన నెటిజన్లు లీపై మండిపడ్డారు. మైండ్ దొబ్బిందా అని ప్రశ్నించారు. అయితే ఇన్ ఫ్లూయన్సర్లు ఖచ్చితంగా ఇలాంటి కామెంట్ల కోసమే తమ అతి చేస్తూంటారు. ఈ దిశగా లీ సక్సెస్ అయినట్లే అనుకోవాలి. ఎందుకంటే ఈ మేధావి చేసే వీడియోలన్నీ అంతే అసహ్యంగా చూస్తేనే వాంతు వచ్చేలా ఉంటాయి.
ఎవరు ఎలాంటి వంటకాలు చేసుకున్న ఇబ్బంది లేదు కానీ.. అన్నం అంటే తెలుగు వాళ్లకు ఓ ఎమోషన్.. మన దేశంలోనే వేరే ప్రాంతాలకు వెళ్తే చపాతీలు ఎక్కువగా తింటారు.కానీ దక్షిణాదిలో మాత్రం అన్నమే తింటారు. అందుకే అన్నంపై ఎవరైనా ఇలాంటి ప్రయోగాలు చేస్తే.. తచేతికి అందితే చితక్కొట్టేయాలనిపిస్తుంది. కాన ఈ లీ సింగపూర్ లో ఉంటాడు కాబట్టి మన చేతుల్లో బతికిపోయి ఉంటాడు.