OnlyFans Star Under Fire After Asking Worker If He Is On The Menu : లండన్‌లోని ఓ ఫుడ్‌ కోర్టు చాలా బిజీగా ఉంది. ఓ అమ్మాయి నేరుగా ఫుడ్ ఆర్డర్ తీసుకునే యువకుడి దగ్గరకు వెళ్లి కొంటె చూపులతో నువ్ మెనూలో ఉన్నావా అని అడిగింది. ఆ యువకుడికి ఏమి అడిగిందో అర్థం కాక బిత్తర చూపులు చూస్తూంటే మళ్లీ తనే అడిగింది.. ఈ రెస్టారెంట్‌లో ఏదైనా సీక్రెట్ రూమ్ ఉంటే ఓకే అని ఆఫర్ ఇచ్చింది. ఆ కుర్రాడు సంశయిస్తూంటే  పోనీ షిప్ట్ అయిపోయిన తర్వాత రెడీనా అడిగింది. అప్పటికి ఆ యువకుడికి లైట్ వెలిగింది. తాను అలాంటి వాడ్ని కాదని చెప్పడంతో .. జస్ట్ మెనూలో ఏం ఉందని అడిగాను అంతే అని చెప్పి వెళ్లిపోయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 



ఈ వీడియోలో ఉన్న అమ్మాయిని నెటిజన్లు బోనీ బ్లూ అని గుర్తించారు. ఇది ఆమె అసలు పేరు కాదు. ఓన్లీఫ్యాన్స్ అనే ఓ అడల్ట్ కంటెంట్ సైట్‌లో పేరు తెచ్చుకున్న కంటెంట్ క్రియేటర్.  ఓన్లీఫ్యాన్స్ అనే కంటెంట్ క్రియేటింగ్ యాప్ లో అమ్మాయిలు ఇలా అడల్ట్ కంటెంట్ చేసి డబ్బులు సంపాదించునే అవకాశాల్ని కల్పిస్తున్నారు. ఇందులో సభ్యురాలిగా చేసిన బోనీ బ్లూ ఇలాంటి పనులు చేస్తున్నారు. 


బోనీ బ్లూ ఇటీవల ఒక వారంలో 158 మంది అబ్బాయిలతో బెడ్ షేర్ చేసుకున్నానని ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇలాంటివి చాలా చేసి ఫేమస్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా రెస్టారెంట్లలో పని చేసే యువకుల్ని రెచ్చగొడుతున్నారు. వారు ఒప్పుకుంటే.. తన కంటెంట్ క్రియేషన్ లో భాగం చేసుకుని ఓన్లీ ఫ్యాన్స్‌లో షేర్ చేస్తున్నారు.        


ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అదే మాటలు మగపిల్లవాడు మాట్లాడితే ఊరుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.