Los Angles Wildfire : అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు.. అనేక ప్రాంతాలను ప్రభావితం చేసింది. ఐదుగురు మృత్యువాత పడ్డట్టు సమాచారం. అంతే కాకుండా వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్రమంలోనే అమెరికా ప్రస్తుతం అధ్యక్షుడు జోబైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు మొత్త కాలి బూడిదైనట్టు పలు అంతర్జాతీయ మీడియాలు కథనాలు వెల్లడించాయి. ఇంటిముందు ఉంచిన కారు సైతం కాలిపోయిందని రష్యన్ టెలివిజన్ తెలిపింది. కానీ ఈ విషయంపై తనకు సరైన సమాచారం లేదని జో బైడెన్ విలేకరులతో పేర్కొన్నారు. ఈ లగ్జరీ హోమ్ ను 1950లో మూడు గదులతో నిర్మించినట్టు తెలుస్తోంది.


హాలివుడ్ హిల్స్ కు వ్యాపించిన అగ్ని కీలలు - రూ.4.2 లక్షల కోట్ల నష్టం


లాస్ ఏంజిల్స్ లో చెలరేగిన అగ్ని కీలలు..  నగర శివార్లను తాకాయి. ఈ సమయంలోనే మంటలు హాలివుడ్ హిల్స్ కు వ్యాపించాయి. దాదాపు 2వేల నిర్మాణాలు దగ్ధమైనట్టు సమాచారం. 1.3 లక్షల ఇళ్లు ఖాళీ చేయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. తీరానికి దగ్గరగా ఉన్న, అతి పెద్దదైన ప్రాంతంలో హాలీవుడ్ తారలకు నిలయమైన సుందరమైన శివారు ప్రాంతాలను చీల్చింది. అనేక సినీ తారల ఇళ్లు ఇక్కడే ఉండడం గమనార్హం. మొత్తం 50 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.4.2 లక్షల కోట్ల సంపద మంటల్లో కాలిపోయిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మంటలను ఆర్పేందుకు సుమారుగా 17వందల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటుంటుండగా.. మరో 7వేల 5వందల మంది సిబ్బందిని కాలిఫోర్నియా సిద్ధం చేసింది.


డాల్బీ థియేటర్ ఖాళీ


ఈ కార్చిచ్చు వల్ల ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్ ను కూడా ఖాళీ చేయించారు. దీని వల్ల ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ కూడా ఆలస్యం కానుంది. మొత్తం 6 చోట్ల కార్చిచ్చు వ్యాపించినట్టు అధికారులు ప్రకటించగా.. వీటిలో 15వేల 8వందల ఎకరాలను కాల్చి బూడిద చేసిన పాలిసాడ్స్ ఫైర్ అతి పెద్దది. ఇక ఈ కార్చిచ్చుకు సంబంధించిన దృశ్యాలను ఎక్స్ యజమాని ఎలోన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మాలిబు ప్రాంతంలోని ఇళ్లు పూర్తిగా కాలిబూడైదనట్టుగా చూపించే దృశ్యాలు ఇందులో కనిపించాయి.


బైడెన్ టూర్ క్యాన్సిల్ 


లాస్ ఏంజిల్స్ లో పెద్ద ఎత్తున ఎగసిపడ్డ మంటల కారణంగా.. అధ్యక్షుడిగా జోబైడెన్ పర్యటించాల్సిన ఇటలీ, రోమ్ పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఆయన పదవీకాలంలో చివరిదైన ఈ విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నట్టు వైట్ హౌస్ వెల్లడించింది. ప్రస్తుతం బైడెన్ లాస్ ఏంజిల్స్ లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోపక్క అగ్ని కీలలను అదుపు చేయడంలో విఫలమైన కాలిఫోర్నియా గవరన్ర్ గవిన్ న్యూసమ్ రాజీనామా చేయాలని.. మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. 


Also Read : Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం