Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- ఓటింగ్ లేకుండా ప్రకటించిన ప్రొటెం స్పీకర్

Latest Telugu breaking News: లోక్‌సభ స్పీకర్ ఎన్నిక తోపాటు ఏపీ, తెలంగాణతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఇష్యూలపై లేటెస్ట్ అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

Sheershika Last Updated: 26 Jun 2024 11:40 AM
ప్రజల గొంతుగా ఉండే ప్రతిపక్షానికి అవకాశాలు ఇవ్వాలి: రాహుల్‌ 

లోక్‌సభ స్పీకర్‌గా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లాకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. దీనిపై రాహుల్ మాట్లాడుతూ "ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉందన్నారు. అయితే ప్రజల గొంతుకగా ఇక్కడ ప్రతిపక్షమే ఉంటుందన్నారు. అందుకే ఈ సభలో ప్రతిపక్షాల గళం వినిపించేందుకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- ఓటింగ్ లేకుండా ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. రెండు రోజుల నుంచి నడుస్తున్న ఉత్కంఠకు ఇవాళ్టితో తెరపడింది. లోక్‌సభ సమావేశమైన వెంటనే ముగ్గురు సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్‌ ... అనంతరం లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశ పెట్టారు. దాన్ని ఎన్డేఏ సభ్యులు ఆమోదించారు. 

Lok Sabha Speake: లోక్‌సభలో స్పీకర్‌ ఎన్నిక ప్రారంభమైంది

 Lok Sabha Speake: లోక్‌సభలో స్పీకర్‌ ఎన్నిక ప్రారంభమైంది. ఓం బిర్లా పేరు మోదీ ప్రస్తావిచంగా ఆ తీర్మానాన్ని ఎన్డేఏ పక్షం నేతలు సమర్థించారు. ఇండీ కూటమి నేతలు ప్రధాని తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఇండీ కూటమి అభ్యర్థి సురేష్‌కు మద్ధతు ఇస్తున్నట్టు తెలిపారు. 

Background

Latest Telugu Breaking News: కాసేట్లో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ప్రమాణం చేసిన ఎంపీలకు ఆయా పార్టీ అధిష్ఠానం విప్‌లను జారీ చేసింది. కచ్చితంగా అంతా సభకు హాజరుకావాలని ఆదేశించింది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో లోక్‌సభ స్పీకర్‌ పదవి కోసం ఎన్నికలు జరగడం ఇది మూడో సారి. 1952లో తొలిసారిగా స్పీకర్ పదవి కోసం శంకర్ శాంతారాం, జీవీ మౌలాంకర్ పోటీ పడ్డారు. 339 ఓట్ల తేడాతో ఆ ఎన్నికల్లో మౌలాంకర్ విజయం సాధించారు. 1976లో రెండోసారి లోక్‌సభ స్పీకర్ కోసం ఎన్నికలు జరిగాయి. అప్పుడు బాలిరాం భగత్‌, జగన్నాథ్‌ రావ్‌ పోటీ పడ్డారు. అందులో బాలిరాం భగత్‌ గెలుపొందారు. 


ఇప్పుడు మూడోసారి స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఎన్డేఏ తరఫున ఓం బిర్లా నామినేషన్ వేశారు. ఆయన రాజస్థాన్‌లోని కోటా నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014 నుంచి మూడుసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన్ని లోక్‌సభ స్పీకర్‌గా చేసింది బీజేపీ. ఇప్పుడు రెండోసారి కూడా ఆయనకే అవకాశం ఇచ్చింది. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి వరుసగా రెండోసారి స్పీకర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. 


ఇండీ కూటమి నుంచి స్పీకర్ పదవికి కే. సురేష్ నామినేషన్ వేశారు. ఈయన కేరళ మవెలిక్కర స్థానం నుంచి గెలుపొందారు. ఇప్పటి వరకు 8 సార్లు ఎంపిగా గెలుస్తూ వస్తున్నారు. 2012-14 మధ్య కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు ఆయనే స్పీకర్ పదవికి పోటీ పడుతున్నారు. 


ఇప్పుడున్న లెక్కల ప్రకారం స్పీకర్ పదవి ఓం బిర్లాకు దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎన్డే కూటమి బలం 293 ఉంది. ఇండీ కూటమి బలం 233 మందే ఉన్నారు. వీరిలో కొందరు ఇంకా ప్రమాణం చేయలేదు. అలా ప్రమాణం చేయని వారిలో శశిథరూర్‌ , శతృఘ్నసిన్హా లాంటి వాళ్లు కూడా ఇంత వరకు ప్రమాణం చేయలేదు. మొత్తంగా ఏడుగురు ప్రమాణం చేయలేదు. వారిలో ఇండీ కూటమి ఎంపీలే ఐదుగురు. మిగతా వాళ్లు స్వతంత్రులు. వయనాడ్‌ ఎంపీ స్థానానికి రాహుల్ రాజీనామా చేశారు. ఈ లెక్కలు చూసుకుంటే 227 మంది మాత్రమే ఇండీ కూటమి బలం. ఈ లెక్క ప్రకారం ఓం బిర్లా విజయానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 


మద్దతు ప్రకటించిన వైసీపీ 
ఎన్డేఏ మాత్రం 300 ప్లస్ ఎంపీల మద్దతు ఆశిస్తోంది. ఆ దిశగానే వివిధ పార్టీలతో మాట్లాడుతోంది. అందులో భాగంగా వైసీపీతో కూడా చర్చలు జరిపింది. నాలుగు ఎంపీ స్థానాలు ఉన్న వైసీపీ కూడా ఎన్డేఏకు మద్దతు ప్రకటించింది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం అంశాల వారీగా మద్దతు ఇస్తామని గతంలోనే ప్రకటించిన వైసీపీ ఇప్పుడు అదే డైలాగ్ చెబుతోంది. రాష్ట్రంలో టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ జగన్‌తో మాట్లాడి లోక్‌సభలో బీజేపీ వైసీపీ మద్దుతు కోరింది. అందుకే జగన్ కూడా ఓకే చెప్పారు.


డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడంతోనే స్పీకర్ పదవికి పోటీ పడుతున్నామని ఇండీ కూటమి చెబుతోంది. గత సంప్రదాయాలను పూర్తిగా పట్టించుకోవడం లేదని మండిపడుతోంది. గత లోక్‌సభ మొత్తం డిప్యూటీ స్పీకర్ లేకండానే నడిపించారని విమర్శించారు. ఈ విషయంలో రాజ్యాంగంలో ఎలాంటి రూల్స్ లేవని కేవలం రాజకీయాలు చేయడానికే ఇలాంటి అంశం తెరపైకి విపక్షం తీసుకొచ్చిందని బీజేపీ ఆరోపిస్తోంది. ముందు కండిషన్లు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తోంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.