Breaking News: వైసీపీకి మరో షాక్- పార్టీ పదవులకు ఆళ్ల నాని రాజీనామా- రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం

Andhra Pradesh And Telangana Breaking News: ఒలింపిక్స్ అప్‌డేట్స్‌, తెలుగు రాష్ట్రాల రాజకీయల అప్‌డేట్స్‌ను తక్షణం ఇక్కడ తెలుసుకోండి.

ABP Desam Last Updated: 09 Aug 2024 01:39 PM
YSRCP: వైసీపీ పదవులకు ఆళ్ల నాని రాజీనామా- రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం

Alla Nani: వైసీపీకి మరో షాక్ తగిలేలా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు జగన్‌కు లేఖ రాశారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. 

Vizag: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం

Andhra Pradesh: విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేస్తుందని గ్రహించి ఓటర్లను బెంగళూరు పంపించింది. అరకు, పాడేరు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను క్యాంపునకు తరలించింది. 

YSRCP MP P. V. Midhun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సీఆర్ఫీఎఫ్‌ భద్రత కల్పించిన కేంద్రం 

Andhra Pradesh: పుంగనూరులో ఇటీవల మిథున్ రెడ్డిపై టిడిపి శ్రేణులు తిరుగుబాటు చేసి దాడికి యత్నించిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్‌తో భద్రత కల్పించింది. మిథున్ రెడ్డికి ప్రత్యర్థుల నుంచి హాని ఉందనే కేంద్ర ఇంటలిజెన్స్ నివేదిక తో భద్రత పెంచారు. ఇక నిరంతరంగా మిథున్ రెడ్డికు సిఆర్పిఎఫ్ బలగాలతో భద్రత ఉంటుందని తెలుస్తోంది. 

Andhra Pradesh: పల్నాడు జిల్లా కారంపూడిలో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి- విద్యార్థులను వేధిస్తున్నాడని తల్లిదండ్రుల ఆరోపణ 

Karampudi Model School Teacher was attacked by Parents In Palnadu : పల్నాడు జిల్లా కారంపూడి మోడల్ స్కూల్‌లో విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. ఈ ఉదయం పాఠశాల వద్ద ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు కోపంతో ఈ పని చేశారు. పోలీసుల సమక్షంలోనే ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై విద్యాశాకాధికారులు విచారణ చేస్తున్నారు. 

నంద్యాల జిల్లా సీతారాంపురంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్న వైసీపీ అధినేత జగన్

కర్నూలు నుంచి నంద్యాల వెళ్లిన జగన్‌కు హుసేనాపురం, సోమయాజులపల్లె వద్ద కార్యకర్తలు స్వాగతం పలికారు.

 

Background

Andhra Pradesh Telangana Breaking News: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మళ్ళీ కలకలం రేగింది. ఈరోజు ఉదయం ముగ్గురు విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒక విద్యార్థి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హేమంత్ అనే  బాలుడు మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. మరో బాలుడు మొండి మోక్షిత్ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పది రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కావడంతో భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ప్రభుత్వ అసమర్ధత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.


పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ప్రమాదం


రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 294 ఫిష్ బిల్డింగ్ (NFDC ) వద్ద  కార్ యాక్సిడెంట్‌కు గురైంది. ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి బలంగా ట్యాక్సీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో రెండు కార్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. తీవ్ర గాయాలు అయిన ఇద్దర్ని  హాస్పిటల్ కు తరలించారు. తృటిలో ప్లై ఓవర్ పైనుంచి కింద పడే ప్రమాదం నుంచి బయట పడ్డ కారులోని బాధితులు. ఈ ప్రమాదంతో PVNR ఎక్స్ ప్రెస్ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శంషాబాద్ నుంచి మెహదీపట్నం రూట్ ను ట్రాఫిక్‌ పోలీసులు నిలిపేశారు. 


ఆటో ఆర్టీసీ ఢీ


రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లె చెరువు వద్ద ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన కూరగాయల ఆటో ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. శంషాబాద్ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొని చంద్రాయణ్ గుట్టా వైపు వెళుతుండగా ప్రమాదంజరిగింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఢీ కొట్టి నట్లు సమాచారం.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.