ABP  WhatsApp

Margaret Alva Comments on BJP: 'మా ఫోన్లు బిగ్ బ్రదర్ ట్యాప్ చేస్తున్నారు'- ఉపరాష్ట్రపతి అభ్యర్థి సంచలన ఆరోపణలు

ABP Desam Updated at: 26 Jul 2022 05:38 PM (IST)
Edited By: Murali Krishna

Margaret Alva Comments on BJP: బిగ్ బ్రదర్ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా సంచలన ఆరోపణలు చేశారు.

Margaret Alva Comments on BJP: 'మా ఫోన్లు బిగ్ బ్రదర్ ట్యాప్ చేస్తున్నారు'- ఉపరాష్ట్రపతి అభ్యర్థి సంచలన ఆరోపణలు

'మా ఫోన్లు బిగ్ బ్రదర్ ట్యాప్ చేస్తున్నారు'- ఉపరాష్ట్రపతి అభ్యర్థి సంచలన ఆరోపణలు

NEXT PREV

Margaret Alva Comments on BJP: ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌పై విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ నేతల ఫోన్లను బిగ్ బ్రదర్ ట్యాపింగ్ చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్‌ను ట్యాగ్ చేస్తూ మార్గరెట్ ట్వీట్ చేశారు.







భాజపాలోని కొంద‌రు స్నేహితుల‌తో ఈ రోజు మాట్లాడిన తర్వాత నా ఫోన్‌కు వ‌చ్చే కాల్స్‌ను డైవ‌ర్ట్ అవుతున్నాయి. నేను కాల్స్ చేయ‌లేక‌పోతున్నాను. రిసీవ్ చేసుకోలేక‌పోతున్నాను.  రాజ‌కీయ నేత‌ల ఫోన్ల‌ను బిగ్ బ్ర‌ద‌ర్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ భ‌యంతో పార్టీల‌కు అతీతంగా ఎంపీలు, ఆయా పార్టీల నేత‌లు త‌ర‌చూ ఫోన్ నెంబ‌ర్లు మార్చేస్తున్నారు.                                                             - మార్గరెట్ అల్వా, విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థి


BSNL రియాక్షన్


ఈ వ్య‌వ‌హారంపై బీఎస్ఎన్ఎల్ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. అల్వా ఫిర్యాదుపై త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని, ఈ వ్య‌వ‌హారంపై ఎఫ్ఐఆర్‌ను బీఎస్ఎన్ఎల్ దాఖ‌లు చేసింద‌ని టెలికాం మంత్రిత్వ శాఖ వ‌ర్గాలు తెలిపాయి.


అల్వా ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషీ స్పందించారు. ఆమె ఫోన్‌ను ఎందుకు ట్యాప్ చేస్తార‌ని ప్రశ్నించారు. ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తాము విశ్వాసంతో ఉన్నామ‌న్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేదని తేల్చి చెప్పారు. 


Also Read: Lakhimpur Violence Case: ఆశిష్ మిశ్రాకు బెయిల్ నిరాకరణ- లఖింపుర్ ఖేరీ కేసు అప్‌డేట్


Also Read: MPs Suspended From Rajya Sabha: పెద్దల సభ నుంచి 19 మందిపై సస్పెన్షన్ వేటు- లిస్ట్‌లో TRS ఎంపీలు కూడా!

Published at: 26 Jul 2022 05:31 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.