MPs Suspended From Rajya Sabha: రాజ్యసభ నుంచి 19 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. నిరసనలతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ వీరిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సస్పెండ్ చేశారు. ఈ వారం చివరివరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు.






లిస్ట్ ఇదే



  1. సుస్మితా దేవ్ (TMC)

  2. మౌసమ్ నూర్ (TMC)

  3. శాంత చెత్రి (TMC)

  4. డోలా సేన్ (TMC)

  5. శాంతాను సేన్ (TMC)

  6. అభి రంజన్ బిస్వార్ (TMC)

  7. ఎండీ నదిముల్ హక్ (TMC)

  8. ఎం హమద్ అబ్దుల్లా (డీఎంకే)

  9. బీ లింగయ్య యాదవ్‌ (TRS)

  10. ఎ.ఎ.రహీం సీపీఐ(ఎం)

  11. రవీంద్ర వద్దిరాజు (TRS)

  12. ఎస్.కళ్యాణసుందరం (డీఎంకే)

  13. ఆర్.గిరంజన్ (డీఎంకే)

  14. ఎన్.ఆర్. ఎలాంగో (డీఎంకే)

  15. వి.శివదాసన్ సీపీఐ(ఎం)

  16. ఎం. షణ్ముగం (డీఎంకే)

  17. దామోదర్ రావు (TRS)

  18. సంతోష్ కుమార్ పి (సీపీఐ)

  19. ఎన్వీఎన్ సోము (DMK) 


అయితే, సస్పెండ్ అయిన సభ్యులు.. సభను వీడకుండా అక్కడే నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందున సభను తొలుత 20 నిమిషాలు, తర్వాత మరో గంటపాటు వాయిదా వేస్తున్నట్లు ఉపసభాపతి ప్రకటించారు. లిస్ట్‌లో ముగ్గురు టీఆర్ఎస్ సభ్యులు ఉన్నారు.






తిరిగి సమావేశం అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడక పోవడంతో బుధవారానికి రాజ్యసభను వాయిదా వేశారు. సస్పెన్షన్​కు గురైన వారిలో అత్యధికులు టీఎంసీ, డీఎంకే సభ్యులే. 


Also Read: Rahul Gandhi Tweet: 'మోదీని ఓడించాలంటే అదే మార్గం'- అరెస్ట్ తర్వాత రాహుల్ ట్వీట్


Also Read: Fact Check: భయ్యా! తెలియని వాళ్లకి లిఫ్ట్ ఇవ్వడం నేరమా? లైసెన్స్ తీసేసుకుంటారా?