ABP  WhatsApp

Rahul Gandhi Tweet: 'మోదీని ఓడించాలంటే అదే మార్గం'- అరెస్ట్ తర్వాత రాహుల్ ట్వీట్

ABP Desam Updated at: 26 Jul 2022 04:38 PM (IST)
Edited By: Murali Krishna

Rahul Gandhi Tweet: దేశంలో శాంతియుత నిరసనలు చేసేందుకు కూడా అవకాశం లేకుండా అణిచివేయాలని చూస్తున్నారని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

(Image Source: Twitter/Rahul Gandhi)

NEXT PREV

Rahul Gandhi Tweet: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తంగా మారింది. ఈ నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు. మోదీ రాజ్యంలో శాంతియుత నిరసనకు కూడా అవకాశం లేదని ఆరోపించారు.







నియంత రాజ్యం చూశారా? శాంతియుత నిరసనలు చేపట్టకూడదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై చర్చించకూడదు. కానీ పోలీసులు, ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించినా, మమ్మల్ని అరెస్ట్ చేసినా.. మా గళాన్ని మీరు మూయలేరు. నిజం మాత్రమే ఈ నియంతృత్వానికి చరమగీతం పాడగలదు.                                                         - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత


అరెస్ట్


నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడంపై రాహుల్, పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు.  పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకూ నిరసన ప్రదర్శన జరిపారు. విజయ్ చౌక్ వద్ద  పోలీసులు రాహుల్ గాంధీని, ఇతర ఎంపీలను నిర్బంధంలోకి తీసుకున్నారు.


రాహుల్‌తో పాటు రంజీత్ రంజన్, కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కె.సురేష్ తదితరులను పోలీసు బస్సులో ఎక్కించి కింగ్స్ వే క్యాంపునకు తీసుకువెళ్లారు. 


మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని.. ఈడీ 3 గంటల పాటు ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై సోనియాను పలు ప్రశ్నలు వేసింది ఈడీ.


Also Read: Fact Check: భయ్యా! తెలియని వాళ్లకి లిఫ్ట్ ఇవ్వడం నేరమా? లైసెన్స్ తీసేసుకుంటారా?


Also Read: Kargil Vijay Diwas 2022: మంచు కొండల్లో పాక్‌పై మరపురాని గెలుపు- భారత్ పరాక్రమానికి ప్రపంచం ఫిదా!

Published at: 26 Jul 2022 04:37 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.