Buggana Comments : ఆంధ్రప్రదేశ్ విపరీతంగా అప్పులు చేస్తోందని ప్రచారం జరుగుతోందని కానీ వాస్తంగా ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే తక్కువే అప్పులు చేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల మయం అంటూ  ప్రచారం కావాలని చేస్తున్నాని… ప్రజలకు భయం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అప్పుల వివరాలు మాత్రమే కేంద్రం ఇచ్చిందన్నారు. 


దేశానికి కోటిన్నర కోట్ల అప్పు ! రాష్ట్రాలకు సుద్దులు చెప్పి కేంద్రం చేస్తున్నదేంటి ?


2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విచక్షణా రహితంగా అప్పులు చేసిందని లెక్కలు వివరించారు. టీడీపీ హయాం కంటే తక్కువ అప్పులుచేశామని..  స్థూల ఉత్పత్తితో పోలిస్తే, అప్పు ఎలా ఎక్కువ అవుతుందని ప్రశ్నించారు. కరోనా సంక్షోభం తర్వాత అన్ని రాష్ట్రాలూ అప్పులు చేశాయన్నారు.  ఏపీనే తక్కువ అప్పు చేసిందన్నారు.  ద్రవ్యలోటు గురించి మాట్లాడుతున్నారని.. జగన్ సర్కార్ వచ్చాక 3 శాతం ద్రవ్యలోటు తగ్గిందని స్పస్టం చేశారు.  స్థూల ఉత్పత్తి మీద అప్పుల నిష్పత్తి చూస్తే కర్నాటక , ఎపిలు దాదాపు సమానంగా ఉన్నాయన్నారు.  


మునుగోడులో అప్పుడే ఉపఎన్నిక ఫీవర్ - రంగంలోకి దిగిన పార్టీలు !


2018-19లో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ. 38 వేల కోట్లకు పైనే అని చెప్పారు. కరోనా సంక్షోభంలో తాము చేసిన అప్పు రూ. 40వేల కోట్లు అని తెలిపారు. ఏ సంక్షోభం లేకపోయినా టీడీపీ విచ్చలవిడిగా అప్పులు చేసిందని విమర్శించారు. ఫైనాన్స్ నిబంధనలపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు.. టిడిపి హయాంలో 8 శాతం ఇంట్రస్ట్ అప్పు తెచ్చారని స్పష్టం చేశారు బుగ్గన.వైసిపి వచ్చాక 7 శాతానికి ఇంట్రస్ట్ తగ్గించామని బుగ్గన వ్యాఖ్యానించారు. 


ఇటు ‘ఈటల్లాం'టి మాటలు, అటు ఢీ కొట్టే ‘బండి’ - గులాబీని గుచ్చుకుంటున్న ముళ్లు ఎవరు?


వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో నిబద్దతో పాలన సాగిస్తున్నామని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా అప్పులు చేసిందన్నారు. కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం శ్రీలంక పరిణామాలను చూపించి రాష్ట్రాలు జాగ్రత్త పడాలని ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.అందులో ఏపీ అప్పుల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అదే సమయంలో ఆర్బీఐ... ఏపీకి అప్పులు ఇస్తున్న బ్యాంకుల కు ప్రత్యేకంగా కొన్ని లేఖలు రాసింది. ఈ అంశాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం జరుగుతూండటంతో  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరణ ఇచ్చారు.