ABP  WhatsApp

Election Results 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Fact Check: భయ్యా! తెలియని వాళ్లకి లిఫ్ట్ ఇవ్వడం నేరమా? లైసెన్స్ తీసేసుకుంటారా?

ABP Desam Updated at: 26 Jul 2022 04:16 PM (IST)
Edited By: Murali Krishna

Fact Check: అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వకూడదా? మోటార్ వెహికల్ చట్టంలో ఏముంది?

భయ్యా! తెలియని వాళ్లకి లిఫ్ట్ ఇవ్వడం నేరమా? లైసెన్స్ తీసేసుకుంటారా?

NEXT PREV

Fact Check: 


"లిఫ్ట్ ఇవ్వటం నేరం.. ఫైన్ కట్టాల్సిందే" 


"కొత్త మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం రవాణా యేతర వాహనాల్లో అపరిచితులకు (బంధువులు కానివారు) లిఫ్ట్ ఇస్తే ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ చలానా వేస్తుంది"


ఇది ప్రస్తుతం వాట్సాప్ సహా సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ కూడా వేశారంటూ అందులో పేర్కొన్నారు. అయితే ఇందులో నిజమెంత? నిజంగానే భారత్‌లో తెలియని వారికి లిఫ్ట్ ఇవ్వకూడదా? ఓ సారి చెక్ చేద్దాం.


పైన చెప్పింది శుద్ధ తప్పు. ఇది ఫేక్ న్యూస్. అయితే ఇందులో కొంత వాస్తవం ఉంది. అందులో చెప్పిన ఓ వ్యక్తి వార్త నిజం.. ఆయనకు ఫైన్ కూడా పడింది. కానీ ఇది కూడా ట్రాఫిక్ సిబ్బంది తప్పుగా భావించడం వల్లే.  అసలు చట్టంలో ఏముంది? ఆ వ్యక్తి ఏం చేశాడు? చూద్దాం.


లిఫ్ట్ ఇచ్చాడు


నితిన్ నాయర్.. అనే వ్యక్తి ముంబయిలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఎప్పటిలానే 2018 జూన్ 18న రోజూ మాదిరిగానే తన ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికి వెళుతున్నారు. ముంబయిలోని ఐరోలి సర్కిల్ దగ్గరకు వచ్చారు.


అప్పటికే జోరు వాన, ట్రాఫిక్ జామ్, రోడ్లపై నీళ్లు.. ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేస్తోన్న నితిన్ నాయర్‌కు రోడ్డు పక్కన వర్షంలో ఇబ్బంది పడుతున్న ముగ్గురు వ్యక్తులు కంటపడ్డారు. వారు లిఫ్ట్ కోసం చూస్తున్నారు. వారి బాధను అర్ధం చేసుకున్న నితిన్ కారును ఆపాపరు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని.. కారులో ఎక్కించుకున్నారు. ఇదంతా కొంచెం దూరం నుంచి ఓ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్‌ గమనిస్తున్నారు. లిఫ్ట్ అడిగిన వారిని నితిన్ కారులో ఎక్కించుకున్న వెంటనే కారు దగ్గరకు వచ్చారు పోలీస్.


విషయం ఏంటని ట్రాఫిక్ పోలీస్‌ను నితిన్ అడిగారు. అయితే రూ.1,500 చలానా రాసి చేతిలో పెట్టాడు పోలీస్. సెక్షన్ 66/192 రూల్ ప్రకారం నితిన్ చేసింది నేరం అంటూ రూ.1,500 చలానా కోర్టులో కట్టి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లాలని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన నితిన్.. ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు.



నా 12 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవంలో ఇప్పటి వరకు ఇలాంటి రూల్ ఉందని నాకు తెలియదు. మన దేశంలో అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమని నాకు తెలియదు. ఒక వేళ ఇది నేరమే అయితే రోడ్డు మీద చావుబతుకుల్లో ఉన్న వాళ్లకి కూడా లిఫ్ట్ ఇవ్వకుండా అందరూ వెళ్లిపోతారు.                                                                               - నితిన్ నాయర్, బాధిత వ్యక్తి


చట్టంలో ఏముంది?


ఎవరికీ లిఫ్ట్ ఇవ్వకూడదని చట్టంలో లేదు. అయితే నితిన్ నాయర్‌కు ఫైన్ వేసిన సెక్షన్‌ల ప్రకారం.. వ్యక్తిగత వాహనాలను కమర్షియల్ అవసరాల కోసం వినియోగించకూడదు. అంటే మన వాహనాన్ని కిరాయికి తిప్పకూడదు. అయితే నితిన్ విషయంలో పోలీసులు ఓ తప్పు చేశారు. నితిన్ లిఫ్ట్ ఇచ్చిన రోజు ఆయన వాహనాన్ని పోలీసులు ఫాలో అయ్యారు. ఆయన డబ్బులకు పాసింజర్లను ఎక్కిస్తున్నారని తప్పుగా ఊహించుకుని ఆయన బండికి చలానా వేశారు. 


కానీ నితిన్ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ చూసిన నెటిజన్లు.. నిజంగానే అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు.


Also Read: Kargil Vijay Diwas 2022: మంచు కొండల్లో పాక్‌పై మరపురాని గెలుపు- భారత్ పరాక్రమానికి ప్రపంచం ఫిదా!


Also Read: Rahul Gandhi Detained: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్ట్

Published at: 26 Jul 2022 04:15 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.