భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. భారత్ బయోటెక్ యూఎస్ భాగస్వామి ఆక్యూజెన్ చిన్నపిల్లలకు కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని యూఎస్ అధికారులను కోరింది. 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఈ వాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరింది. ఏఎన్ఐ వార్త సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ క్లినికల్ లీడ్ డాక్టర్ రాచెస్ ఎల్లా ట్వీట్టర్ లో తెలిపారు. పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సిన్‌గా కొవాగ్జిన్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. తమ భాగస్వామి ఆక్యూజెన్ కొవాగ్జిన్ అత్యవసర అనుమతి కోరుతూ US-FDAకు ఫైలింగ్ చేశారని తెలిపారు.
ఈ వెరో సెల్ పోలియో వ్యాక్సిన్ తయారీలో
ఆక్యూజెన్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ భారతదేశంలో 2-18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో ప్రయోగించి ఇమ్యునో-బ్రిడ్జింగ్ క్లినికల్ ట్రయల్‌లో అధ్యయనం చేశారు. ఈ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను 17 దేశాల్లో అత్యవసర వినియోగం కింద ఉపయోగించినట్లు ఆక్యూజెన్ పేర్కొంది. కొవాగ్జిన్ (BBV152) అనేది వోల్-వైరియన్, ఇది క్రియారహిత వ్యాక్సిన్. దీనిని వెరో సెల్ ను ఉపయోగించి తయారు చేశారు. దీనిని గత 35 సంవత్సరాలుగా పోలియో వ్యాక్సిన్ తయారీ, ఇతర చిన్నపిల్లల వ్యాక్సిన్‌ల తయారీలో ఉపయోగిస్తున్నారని ఆక్యూజెన్ తెలిపింది.
Also Read: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం.. దరఖాస్తు చేసుకున్నాక ఎప్పటిలోగా వస్తాయంటే..
మూడు కేటగిరీల్లో పరిశోధనలు
ఈ వ్యాక్సిన్ భద్రత, రియాక్టోజెనిసిటీ, ఇమ్యునోజెనిసిటీపై భారత్ లో పరిశోధనలు జరిగాయి. ఈ ఏడాది మే నుంచి జులై వరకు పీడియాట్రిక్ క్లినికల్ ట్రయల్‌తో పాటు ఫేజ్ 2/3 మల్టీసెంటర్ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనాన్ని మూడు కేటగిరీల్లో నిర్వహించారు. 2-6 సంవత్సరాలు, 6-12 సంవత్సరాలు, 12-18 సంవత్సరాల మధ్య వయసున్న వారిపై పరిశోధన చేశారు. వాలంటీర్లు 28 రోజుల గ్యాప్‌తో కొవాగ్జిన్ రెండు డోస్‌ల తీసుకున్నారు.
Watch: కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డబ్య్లూహెచ్‌వో గ్రీన్ సిగ్నల్
ప్రతికూల ప్రభావాలు లేవు
పెడాంటిక్ క్లినికల్ ట్రయల్స్‌లో 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల 526 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ పరిశోధనలో వాలంటీర్లు ఎటువంటి ప్రతికూల పరిస్థితులకు లోనవలేదు. మరణాలు, ఆసుపత్రిలో చేరడం, మయోకార్డిటిస్, పెరికార్డిటిస్, గులియన్-బారే సిండ్రోమ్, టీకా-ప్రేరిత థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనియా లేదా అనాఫిలాక్టిక్ రియాక్షన్ వంటి ప్రతికూల ప్రభావాలు అధ్యయనంలో కనిపించలేదని ఆక్యూజెన్ తెలిపింది. చిన్నపిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో కొవాగ్జిన్ వినియోగానికి US ఆథరైజేషన్ కోసం దాఖలు చేశామని ఆక్యూజెన్ కో ఫౌండర్, సీఈవో డా.శంకర్ ముసునూరి తెలిపారు. వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడం COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ఒక ముఖ్యమైన అడుగు అన్నారు.
Also Read: కొవాగ్జిన్ అత్యవసర వినియోగంపై డబ్ల్యూహెచ్‌వో సమీక్ష... 24 గంటల్లో అనుమతి లభించే అవకాశం..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి