కొవాగ్జిన్​కు అత్యవసర అనుమతులు ఇచ్చే అంశంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక సలహా సంఘం సమీక్షిస్తుంది. ఈ సలహా సంఘం అనుమతి తెలిపితే 24 గంటల్లో అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్ కు అనుమతి లభించనుంది. డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి మార్గరెట్‌ హారిస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఓ సాంకేతిక కమిటీ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఆమోదించిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ ప్రకటించారు. మరో కమిటీ ముందుకు ప్రతిపాదనలు ఉన్నాయని మంగళవారం తెలిపారు. టీకా అనుమతులపై తాజాగా జరిగిన సమావేశం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. 


Also Read: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం.. దరఖాస్తు చేసుకున్నాక ఎప్పటిలోగా వస్తాయంటే..
 
24 గంటల్లో కీలక ప్రకటన


హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఐసీఎంఆర్‌తో కలిసి అభివృద్ధి చేసిన కొవాగ్జి్న్ టీకాపై డబ్ల్యూహెచ్వో 24 గంటల్లో కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశంలో ఇప్పటికే కోట్లాది మంది ఈ టీకాను తీసుకున్నారు. అయితే ఈ టీకా పొందిన వాళ్లు విదేశాలకు వెళ్లడం కష్టతరంగా మారుతోంది. అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని భారత్ బయోటెక్ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది. చాలా దేశాలు డబ్ల్యూహెచ్వో ఇచ్చే ఈ అనుమతులను ఆధారంగా చేసుకుంటున్నాయి. దీంతో కొవాగ్జిన్ టీకా వేసుకున్న భారతీయులకు విదేశీ ప్రయాణాలు కష్టంగా మారుతున్నాయి. డబ్ల్యూహెచ్‌వో కొవాగ్జిన్ టీకాకు అనుమతిపై 24 గంటల్లో కీలక ప్రకటన చేయనుంది.


Also Read: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?


డేటాపై సంతృప్తి చెందితే గ్రీన్ సిగ్నల్


కొవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్‌వో 24 గంటల్లో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉందని భారత్ బయోటెక్ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. భారత్ బయోటెక్ అందించిన డేటాపై సాంకేతిక కమిటీ సమీక్ష చేస్తుందని తెలిపింది. జెనీవాలోని యూఎన్ ప్రెస్ బ్రీఫింగ్‌లో సంస్థ ప్రతినిధి మార్గరెట్ హారిస్ ఈ విషయాన్ని తెలిపారు. భారత్ బయోటెక్ సమర్పించిన డేటాపై కమిటీ సంతృప్తి చెందితే వచ్చే 24 గంటల్లో కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి రావొచ్చన్నారు. 


Also Read: ఏపీలో తగ్గుతున్న కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 415 కరోనా కేసులు, పెరిగిన రికవరీలు... తెలంగాణలో 190 కేసులు


Also Read: భారత్ లో తగ్గిన కొవిడ్ కేసులు.. మధ్యప్రదేశ్ లో కొత్తరకం కరోనా వైరస్!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి