దీ తీరంలో హోటల్ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదూ. చల్లని గాలి.. అలల చప్పుడు.. ప్రకృతి అందాలు.. అబ్బో ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. అలాగే, కొన్ని రెస్టారెంట్లు లేదా హోటళ్లను చిన్న ద్వీపాల్లో కూడా ఏర్పాటు చేస్తుంటారు. అయితే, మీరు ఇప్పుడు తెలుసుకోబోయే హోటల్ మాత్రం అందుకు భిన్నం. ఈ హోటల్‌లో అడుగుపెడితే మీరు తడవకుండా బయటకు రావడం అసాధ్యం. తప్పకుండా ఒక జత దుస్తులు వెంట తీసుకెళ్లాలి. ఎందుకంటే.. ఆ హోటల్ నది ప్రవాహంలో ఉంది. 


సాధారణంగా వరద ముంచెత్తితే తీర ప్రాంతాలకు దూరంగా వెళ్లిపోతారు. కానీ, థాయిలాండ్‌లోని నొంతబురి రెస్టారెంట్‌ యాజమాన్యం మాత్రం.. వరదను కూడా తన వ్యాపారానికి అనకూలంగా మార్చేసుకున్నాడు. ‘‘రండి రండి బాబు.. రండి మోకాలి లోతు నీటిలో కూర్చొని మీ ఫెవరెట్ ఫుడ్ ఆరగించండి’’ అని దండోరా వేశాడు. దీంతో అక్కడి ప్రజలు, పర్యాటకులు ఇదేదో కొత్తగా ఉంది.. ట్రై చేస్తే పోలే.. వచ్చారు. అలలు ముంచెత్తుతున్నా.. భయపడకుండా కడుపు నిండా ఆరగిస్తూ కొత్త అనుభూతి పొందుతున్నారు.  


ఇటీవల థాయిలాండ్‌ను వరదలు ముంచెత్తాయి. దాదాపు 30 ఉత్తర మరియు మధ్య ప్రావిన్స్‌లు వరదలతో దెబ్బతిన్నాయి. బ్యాంకాక్ గుండా ప్రవహించే నదుల్లో నీటి మట్టాలు పెరిగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో వాణిజ్య కేంద్రాలు, ఇళ్లలోకి భారీ వరద నీరు వచ్చి వచ్చి చేరింది. చాలా రోజుల నుంచియ తీర ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. అప్పటికే కరోనా వల్ల నష్టపోయిన వ్యాపారులను వరద తేరుకోకుండా చేసింది. 


అయితే, రివర్‌సైడ్ రెస్టారెంట్ యజమాని టిటిపోర్న్ జుటిమానన్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. లాక్‌డౌన్ వల్ల నష్టాల్లో కూరుకుపోయిన తన హోటల్‌ను ఎలాగైనా మళ్లీ తెరవాలని నిర్ణయించుకుంది. నీటితో నిండిన తన హోటల్‌ పరిసరాల్లోనే టేబుళ్లు వేసి కస్టమర్లను ఆహ్వానించాడు. కొత్తదనాన్ని ఇష్టపడే పర్యాటకులు.. హోటల్‌కు ఈ థీమ్ బాగా నచ్చేసింది. పడవలు వెళ్తున్నప్పుడు ఎగసిపడే అలల వల్ల అక్కడ కూర్చొని తినడం ఇబ్బందిగా మారినా.. పర్యాటకులు దాన్ని కూడా థ్రిల్‌గా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొట్టింది. 


సూర్యాస్తమయం సమయంలో ఈ నదీ తీరం చాలా అందంగా ఉంటుంది. దీంతో పర్యాటకులు కూడా నీటిలోకి దిగి ఆహారాన్ని తీసుకోవడాన్ని థ్రిల్‌గా ఫీలవుతున్నారు. ఈ హోటల్‌లో బార్బెక్యూ పంది మాంసం ప్రత్యేకం. సూర్యస్తమయాన్ని చూస్తూ.. రుచికరమైన ఆహారాన్ని తింటూ పర్యాటకులు మైమరచిపోతున్నారు. ‘‘నదీ ప్రవాహంలో తినడం థ్రిల్‌గా ఉందని.. ముందుకు మాత్రం వెళ్లకండి. కొట్టుకుపోతారు’’ అని హోటల్ నిర్వాహకులు పర్యాటకులను హెచ్చరిస్తున్నారు. థ్రిల్ మాట దేవుడెరుగు.. అక్కడ జరగకూడనిది ఏమైనా జరిగితే? అకస్మాత్తుగా వరద ప్రవాహం పెరిగిపోతే? ప్రమాదమే కదూ!!


ఆ రెస్టారెంట్ వీడియోను ఇక్కడ చూడండి:



Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!