చాయ్.. కూలీల నుంచి కోటీశ్వరుల వరకు దీనికి ఫిదా అవ్వాల్సిందే. ఎంత బిజీ పనిలో ఉన్నా ఓ కప్పు టీ కొట్టకపోతే భారతీయులకు ఏ పనీ సరిగా కాదు. అందులోను అసోంలో ఉత్పత్తయ్యే టీ పొడి మరింత ప్రత్యేకం. దాని డిమాండ్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ఈ సారి అసోంలో తయారైన ప్రత్యేక టీ పొడి రికార్డ్ స్థాయిలో కేజీ రూ.99,999కి అమ్ముడుపోయింది.
అంత ఖరీదా?
అసోంలో ఏటా పలు సంస్థలు అరుదైన రకానికి చెందిన టీ పొడులను వేలం వేస్తాయి. ఈరోజు మనోహరి టీ ఎస్టేట్‌కు చెందిన కిలో టీ పొడి వెలంలో రూ.99,999కి అమ్ముడుపోయింది. గతేడాది వేలంలో ఈ ధర రూ.75,000గా ఉంది. దేశ చరిత్రలో కేజీ టీ పొడికి ఇదే అత్యధిక రేటు.
సౌరవ్ టీ ట్రేడర్స్ అనే సంస్థ ఈ టీ పొడిని కొనుగోలు చేసింది. ఈ తరహా టీలకు విదేశాల్లో కూడా డిమాండ్ పెరుగుతుందని మనోహర్ టీ ఎస్టేట్ ఓనర్ రాజన్ లోహియా అన్నారు. ఈ తరహా టీ పొడిని డిమాండ్ బట్టి ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తి సంస్థలు కూడా ఇలాంటి టీ పొడులను మరిన్ని విక్రయించి.. దేశాన్ని ప్రత్యేక టీ పొడులకు కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నామన్నారు.
అసోం టీ..
1660 కాలంలో మన దేశంలో తేయాకును ఔషధంగా ఉపయోగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండే తేయాకును తలనొప్పి, కడుపునొప్పి వచ్చినప్పుడు నీళ్లలో వేసి.. నిమ్మరసం కలిపి తాగేవారు. 18వ శతాబ్దంలో స్కాంట్లాండ్ ప్రజలు వ్యాపారులుగా భారత్ వచ్చారు. అసోంలో తేయాకులు పండించడాన్ని వారు గుర్తించారు.
ఆ తర్వాత బ్రిటీష్ పాలకులు 1839లో అసోం టీ కంపెనీ ఒకటి స్థాపించి తేయాకును పండించడం మొదలుపెట్టారు. అలా 1862 నాటికి అసోం ప్రాంతంలో 160 తేయాకు తోటలు వెలిశాయి. ప్రస్తుతం 800కు పైగా తేయాకు తోటలు ఉన్నాయి. అందుకే అసోం టీ చాలా ప్రత్యేకం.
Also Read: Covishield for Children: మరో 6 నెలల్లో పిల్లలకు కరోనా టీకా: పూనావాలా
Also Read: Bank Strike: కస్టమర్ అలర్ట్.. ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్
Also Read: WPI Inflation: సామాన్యులకు మరో దెబ్బ.. 12 ఏళ్ల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
Also Read: Omicron Cases in Delhi: దిల్లీలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు.. దేశంలో పెరుగుతోన్న వ్యాప్తి
Also Read: Char Dham Road Project: చార్‌ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి