కొవిడ్ మహమ్మారి నుంచి చిన్నారులను రక్షించేందుకు ఆరు నెలల్లోనే పిల్లల టీకాను తీసుకురాబోతున్నట్లు సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ప్రకటించారు. ప్రస్తుతం కొవొవాక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. 3 ఏళ్లు పైబడ్డ పిల్లలందరికీ ఈ టీకాను ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.
ప్రస్తుతం సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఇస్తున్నారు. కొవిడ్ వంటి మహమ్మారులపై పోరాడే శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని పూనావాలా అభిప్రాయపడ్డారు. మన ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందన్నారు.
శక్తిమంతమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించేందుకు కేంద్రం కృషి చేస్తుందని కొనియాడారు. హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్ సహా అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Also Read: Bank Strike: కస్టమర్ అలర్ట్.. ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్
Also Read: WPI Inflation: సామాన్యులకు మరో దెబ్బ.. 12 ఏళ్ల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
Also Read: Omicron Cases in Delhi: దిల్లీలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు.. దేశంలో పెరుగుతోన్న వ్యాప్తి
Also Read: Char Dham Road Project: చార్‌ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి