కొన్ని రాశులు మధ్య సమన్వయం ఉంటుంది, మరికొన్నింటి మధ్య మాత్రం పొత్తు కుదరదు. పొత్తు కుదరని రాశులకు చెందిన వ్యక్తులు పెళ్లి చేసుకుంటే వారి సంసారమంతా ఫైటింగులేనట. ఏఏ రాశుల వారు పెళ్లి చేసుకోకూడదో, ఏ రాశుల మధ్య పొత్తు కుదరదో చూద్దాం రండి

Continues below advertisement


వృశ్చికం - మేషం
వీరిద్దరి ప్రతి విషయంలో పోటీపడే తత్వం ఉన్నవాళ్లే. అంతేకాదు గోప్యతలను ఇష్టపడే వ్యక్తులు. వీరిద్దరి మధ్య ప్రారంభ రోజుల్లో అద్భుతంగా అనిపిస్తుంది. కానీ రాను రాను ఆధిపత్యపోరు మొదలవుతుంది. ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటే, మరొకరు నియంత్రణలో ఉండేందుకు ఇష్టపడరు. 


కర్కాటకం - కుంభం
కర్కాటక రాశి వారు ప్రతిది తమకు తెలిసే జరగాలని కోరుకుంటారు. కుంభరాశి వారు మాత్రం చాలా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. కుంభరాశి వారికి శక్తిమంతమైన భాగస్వాములు సెట్ అవుతారు. కర్కాటకరాశి వారు భావోద్వేగ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. కాబట్టి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నిత్యం ఇంట్లో మెలో డ్రామాలే. వాదనలతో ఇంటి పైకప్పును కూడా ఎగరగొడతారు. 


వృషభం- ధనుస్సు
ఈ రెండు రాశిచక్రాల వారి ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. వృషభరాశి వారు కుటుంబం, ఇల్లు, పనికే ప్రాధాన్యనిస్తారు. కానీ ధనుస్సు రాశి  వారు షికార్లు చేసేందుకు ఇష్టపడతారు. మొండిపట్టుదల గల వృషభరాశి వారు చాలా అరుదుగా ధనుస్సు రాశి వారితో కనెక్ట్ అవుతారు. కనెక్ట్ కాలేకపోతే మాత్రం ఇల్లు కురుక్షేత్రమే. 


మేషం-వృషభం
మేష రాశి వారు ఏదైనా నిమిషాల మీదే నిర్ణయాలు తీసుకుంటారు. అన్నీ అకస్మాత్తుగా చేసేస్తుంటారు.  వృషభరాశి వ్యక్తులు మాత్రం స్థిరంగా ఉండటానికి ఇష్టపడతారు, నెమ్మదిగా ఉంటారు. ఇద్దరి ఓపిక స్థాయిలు మ్యాచ్ కావు. 


మకరం-ధనుస్సు
మకరరాశి వారు ఎవరైనా ఏమైనా అంటే ఆ మాటలను పాజిటివ్ గా తీసుకోలేరు. కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి కూడా తక్కువే. కానీ ధనుస్సు రాశి వారికి ప్రాపంచిక విషయాల పట్ల ఇష్టం ఉండదు కాబట్టి కొత్త విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరికి ఇంట్లో జరిగే విషయాలపై ఒక రాజీ మార్గానికి రాకపోతే తరచుగా పెద్ద తగాదాలకు దారి తీస్తుంది.


సింహం-కన్యా 
ఈ రెండు రాశులవారికి విపరీతమైన గర్వం. కన్యా రాశివారు తమ భావోద్వేగాలను ప్రదర్శించారు. సింహరాశి వారు భావోద్వేగ ప్రకోపాలను కలిగి ఉంటారు. అందుకే వీరిద్దరి మధ్య నిత్య వివాదాలు తప్పవు. 


Read also: వైరస్‌ల నుంచి రక్షణనిచ్చే ఎండు అంజీర్ పండ్లు... తినకపోతే మీకే నష్టం


Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్


Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే


Read also: త్వరగా బరువు తగ్గాలా? ఓట్స్‌ను ఇలా ఉపయోగించండి...


Read also: బ్రౌన్ రైస్, వైట్ రైస్, బాస్మతి రైస్... డయాబెటిస్ ఉన్న వారికి ఏ బియ్యం బెటర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి